Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంటికి వచ్చిన పంతులు ఈ ఇంటికి రాబోయే కోడలు జాతకం అచ్చు అరుంధతి జాతకంలాగే ఉందని ఈ ఇంటిని ఈ ఇంట్లో ఉండే పిల్లలను తన పిల్లలాగే చూసుకుంటుందని, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కష్టం రాకుండా కాపరి అవుతుందని  చెప్తాడు. అయితే మనోహరి మాత్రం నేను ఈ ఇంటి కోడలు అయిన తర్వాత ఇవన్నీ చేయాలనుకోలేదు కదా పంతులు ఏంటి ఇలా చెప్తున్నాడు అని మనసులో అనుకుంటుంది.


శివరాం: అయితే కచ్చితంగా మళ్లీ మా ఇంటికి మా అరుధతే రాబోతుందా?


పంతులు: అవును అరుంధతి ప్రతిరూపమే ఈ ఇంటి కోడలుగా రాబోతుంది. అది కూడా ఆవిడ సంకల్పబలంతోనే ఆవిడ ఆశీస్సులతోనే ఈ పెళ్లి జరుగుతుంది.


మరోహరి: ఈ ఇంటి కోడలు గురించే కదా చెప్తున్నారు.


పంతులు: అవునమ్మా..


 మనోహరి: ఈ ఇంటికి కాబోయే కోడలు నేనే


నిర్మల: పంతులు గారు పెళ్లి ఎప్పుడు పెట్టుకోవాలో చెబితే దాన్ని బట్టి మేము ప్లాన్‌ చేసుకుంటాం.


అనగానే పంతులు ఇంకో 4రోజుల్లో ముహూర్తం ఉందని చెప్పడంతో మనోహరి ఆ ముహూర్తమే ఓకే చేయండి అని చెప్తుంది. దీంతో అందరూ అదే ముహూర్తం ఓకే చేస్తారు. ఇంతలో గుప్త లోపలికి పరిగెత్తుకొస్తాడు.


గుప్త: నేనే మీ తోటమాలిని..


శివరాం: ఎంటయ్యా నువ్వు ఈ వేషం వేసుకున్నావు అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు నువ్వు.


రాథోడ్‌: అదే నేను ఇందాకన్నుంచి అరుస్తున్నాను సార్‌. తను ఇష్టం వచ్చిన్నప్పుడు వచ్చి ఇష్టం లేనప్పుడు వెళ్లిపోతే ఎలా సార్‌.


మనోహరి: అయినా నీకు ఇంట్లో ఏం పని వెళ్లు బయటకి.. ఫస్ట్‌ ఆ గెటప్‌ తీసేవరకు జనాలకు కనిపించకు వెళ్లు.


గుప్త: నాకొక చిన్న సందేహం అండి పంతులుగారిని అడిగి సమాధానం తెలుసుకునేందుక వచ్చాను.


అంటూ పెళ్లి జరిగే ఈ ఇంట్లో అరుంధతి ఫోటో ఉండటం మంచిదేనా అని గుప్త అడగడంతో పంతులు ఏమీ కాదని చెప్తాడు. బయట అరుంధతితో మాట్లాడుతున్న మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. అదిచూసిన మనోహరి, అరుంధతి, గుప్త టెన్షన్‌ పడుతుంటారు. ఇంతలో మిస్సమ్మకు ఫోన్‌ రావడంతో బయటే ఆగిపోతుంది. దీంతో గుప్త, మనోహరి, అమర్ కు  కొన్ని సెంటిమెంట్‌ మాటలు చెప్పి ఫోటో తీయడానికి ఒప్పిస్తారు. దీంతో లీల ఫోటో తీసుకుని లోపలికి వెళ్తుంది. మిస్సమ్మ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అందరూ వెళ్లిపోతారు.


మనోహరి: ఇందాకా నాతో చాలెంజ్‌ చేశావు.. ఇప్పుడేంటి నోట్లోంచి మాట కూడా రావడం లేదు. నువ్వు ఇంటికి వచ్చేలోపే నేను నా పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నాను. అమర్‌తో పెళ్లి చేసుకుంటాను. పిల్లలను ఆయనకు దూరం చేస్తాను. ముసలొళ్లను వృద్దాశ్రమంలో వేస్తాను.


మిస్సమ్మ: చూస్తావు.. మనోహరి ఇవన్నీ నువ్వు చేయాలనుకున్నా నేను ఆపడం నువ్వు చూస్తావు. నేను కూడా ఒకటి చూస్తా.. అది ఆయన నిన్ను ఇంట్లోంచి గెంటేయడం.  నీ పాపాలు పండి నువ్వు జైలుకు వెళ్లడం అన్నీ చూస్తా..


అని మనోహరికి మిస్సమ్మ వార్నింగ్‌ ఇస్తుంది. మరోవైపు అరుంధతి ఆలోచిస్తూ ఉండటం చూసి గుప్త వెళ్లి ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. నాకు బాగీకి, వాళ్ల నాన్నకు ఏ సంబంధం లేకుండా వాళ్లకే ఎందుకు కనిపిస్తున్నాను. ఈ ప్రశ్నకు నాకు సమాధానం కావాలి గుప్తగారు అని అడుగుతుంది. దీంతో గుప్త షాక్‌ అవుతాడు. నేను రేపే వెళ్లి నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటాను అని అరుంధతి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: అనుష్క శెట్టి 50వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ - ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్ పోస్టర్!