Nindu Noorella Saavasam Serial Today March 19th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: నిజం చెప్పిన స్వామిజీ – షాక్‌తో వణికిన మను – ఆరును హెచ్చరించిన గుప్త
Nindu Noorella Saavasam Today Episode: అరుంధతి అనామికలా మారిపోయిందన్న నిజం మనుకు తెలియడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: శివరాం రూంలో ఉన్న ఫైల్స్ లో ఏదో సీక్రెట్ ఉందని అదేంటో తెలుసుకోవాలనుకున్న మనోహరి ఎవరూ లేని టైం చూసి రూంలోకి వెళ్లి కప్‌బోర్డులో ఫైల్ కోసం వెతుకుంది. ఇంతలో పైనుంచి భాగీ.. బయటి నుంచి శివరాం హాల్లోకి వస్తారు.
భాగీ: ఏంటి మామయ్యా మీరు పేపర్ చదివే టైంలో అసలు రారు. ఇప్పుడు లోపలికి వచ్చారేంటి..?
శివరాం: ఏం లేదు భాగీ.. నా కళ్లజోడు మర్చిపోయాను. తీసుకుందామని వచ్చాను.
భాగీ: అయితే నేను వెతికి తీసుకొస్తాను ఉండండి.
శివరాం: లేదమ్మా నేను తీసుకుంటాను నువ్వు ఏదైనా పనుంటే చూసుకో..
ఇద్దరు మాట్లాడుకోవడం రూంలోంచి గమనించిన మనోహరి.. బయటకు వెళ్లడానికి వీల్లేక రూం బాల్కనీలోకి వెళ్లి కిటికీ లోంచి చూస్తుంది. రూంలోకి వచ్చిన శివరాం కప్‌బోర్డు తెరుచుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. ఫైల్ జాగ్రత్తగా ఉంచాలని భాగీని పిలిచి ఫైల్ ఇచ్చి అమర్ కు ఇవ్వమని చెప్తాడు. ఫైల్ తీసుకుని భాగీ వెళ్తుంది. ఆ ఫైల్‌లో ఏముందో ఎలాగైనా తెలుసుకోవాలని అమర్ లేని టైంలో అమర్ రూంలోకి వెళ్లైనా చూడాలనుకుంటుంది మను. పైన అమర్ దగ్గరకు వెళ్తుంది భాగీ.
భాగీ: ఏవండి మామయ్య ఈ ఫైల్ మీకు ఇవ్వమన్నారు.
అమర్: కప్‌బోర్డులో పెట్టు..
భాగీ: లేదు మీ చేతికే ఇవ్వమన్నారు
అమర్: పర్వాలేదు కప్‌బోర్డులో పెట్టు
భాగీ: అదేం కాదండి జాగ్రత్తగా మీ చేతిలోనే పెట్టమన్నారు
అమర్: నాకు కొన్ని రోజులు ఆఫీసు పని ఉంది. అన్ని నిన్నే చూసుకోమని చెప్పాను కదా
భాగీ: కానీ నేను నిన్నటి నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను
అమర్: చెప్పండి..
భాగీ: నిన్న నేను కరుణ స్కూటీ మీద వెళ్తుంటే మాకు రెండు కార్లు వచ్చి డాష్ ఇవ్వబోయాయి.
రాథోడ్ పరుగెత్తుకొస్తాడు.
రాథోడ్: సార్ సార్ చుట్టాల నుంచి సమాచారం వచ్చింది.
అమర్: వెళ్లి కలవగలిగే ఇన్ఫర్మేషనేనా..?
రాథోడ్: లేదు సార్ పై నుంచి ఫోన్ వచ్చింది
అమర్: అయితే వెళ్దాం పద
అంటూ అమర్ చెప్పగానే రాథోడ్ కూడా అమర్‌ను ఫాలో అవుతాడు.
భాగీ: అయ్యో కొంత మంది తుపాకులు పట్టుకుని సిటీలో తిరుగుతున్నారు అని చెప్పబోతుంటే వెళ్లిపోయారేంటి..?
అనుకుంటూ ఫైల్ కప్‌బోర్డులో పెట్టబోతూ అంజును దత్తత తీసుకున్న సర్టిఫికేట్ చూస్తుంది. ఫస్ట్ షాక్ అవుతుంది. తర్వాత ఇది అబద్దం అయ్యుండొచ్చని అనుకుంటుండగా.. ఆనంద్, ఆకాష్ వచ్చి గేమ్ గురించి కిందకు రమ్మని పిలుస్తారు. సరే పదండి అంటూ భాగీ వెళ్తుంది. ఎలాగైనా స్వామీజీ చెప్పినట్టు చేయాలని అనామికను బంధించాలని ఎదురుచూస్తున్న మనోహరికి ఒక ప్లాన్ తడుతుంది. ఆ ప్లాన్ ప్రకారం అనామిక తనతో చెస్ ఆడేలా చేస్తుంది. అదే టైంలో స్వామిజీ చెప్పినట్టు ఆరు ఆత్మను తాయెత్తులో బంధించి తీసుకుని స్వామిజీ దగ్గరకు వెళ్తుంది.
మను: స్వామీజీ మీరు చెప్పినట్టే చేశాను. తాయెత్తు కూడా తీసుకొచ్చాను
మను తీసుకొచ్చిన తాయోత్తు స్వామిజీ పట్టుకుని చూస్తారు.
స్వామిజీ: ఇందులో ఏ ఆత్మ లేదు మనోహరి..
మను: మరి ఆత్మ ఏమైంది. ఇంకా ఆనామిక బాడీలోనే ఉందా..?
స్వామిజీ: అనామిక, అరుంధతిగా మారిపోయింది.
మను: అయితే ఇప్పుడు నేనేం చేయాలి స్వామి..
అని మను అడగ్గానే నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా మనోహరి. నీ టైం ఎప్పుడో అయిపోయిందని.. ఇప్పుడు నిన్ను ఈ సమస్య నుంచి ఎవ్వరూ కాపాడలేరు అని చెప్తాడు. మరోవైపు పూర్తి అరుంధతిలా మారిపోయిన అనామిక బయటి నుంచి వస్తున్న భాగీని చూసి ఎమోషనల్‌గా ఫీలవుతూ ఎదురెళ్లి హగ్ చేసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!