Ammayi garu Serial Today Episode రూప మందారాన్ని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తానని పర్మిషన్ తీసుకుంటుంది. అందరూ రూపని వెళ్లమని చెప్తారు. రూప, మందారంతో పాటు దీపక్‌ని కూడా వెళ్లమని సూర్యప్రతాప్ చెప్తారు. దాంతో దీపక్ అమ్మని చూసుకోవడానికి నేను ఉండాలి కదా మామయ్య అని చెప్పి దీపక్ ఉండిపోతాడు. రూప, మందారం కారులో హాస్పిటల్‌కి బయల్దేరుతారు. 


రూప వాళ్లడం చూసిన దీపక్ రూప, మందారం ఇద్దరూ చనిపోతారని చాలా సంతోష పడతాడు. ఇంతలో కోపంగా చూస్తున్న తన తల్లిని చూసి షాక్ అయిపోతాడు. అమ్మకి అంతా బాగుంటే ఈ పాటికి ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీలయ్యేదని అనుకుంటాడు. తల్లి దగ్గరకు వెళ్లి చిన్న పాప ఏం చేస్తున్నావ్ అంటే విజయాంబిక దీపక్ పెట్టిన బాంబ్ చేతిలో పట్టుకొని ఆడుతుంది. దీపక్ చాలా కంగారు పడతారు. అమ్మ చేతికి బాంబ్ ఎలా వచ్చిందని అనుకుంటాడు. దీపక్ బాంబ్ పెట్టడం చూసిన విజయాంబిక చిన్న పిల్లలా వెళ్లి నా బొమ్మ దాచేస్తావా అని వెంటనే అది తీసేస్తుంది. కారు కింద బాంబ్ లేదా మందారానికి ఏం కాదా.. మందారానికి గతం గుర్తొస్తే ఇక అంతే అని బిత్తరపోతాడు.


చిన్న పాప బొమ్మ ఇవ్వు.. పాప బొమ్మ ఇవ్వు అని విజయాంబిక వెనక పరుగులు పెడతాడు. నా బొమ్మ అని విజయాంబిక పరుగులు పెడుతుంది. అదంతా చూసిన మౌనిక వచ్చి నిజమైన  బాంబ్‌నా అని అడిగితే అవును అని చెప్పి దీపక్, మౌనిక ఇద్దరూ కలిసి పాపని పట్టుకుంటారు. ఇద్దరూ లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో టైం ఆన్ అయిపోతుంది. విజయాంబికకు ఇవ్వకుండా దీపక్, మౌనికలు క్యాచ్‌లు ఆడుతారు. సరిగ్గా పేలే టైంకి దీపక్, మౌనికలు లాక్కొని విసిరేస్తారు. ఇద్దరి ఒంటి మొత్తం మట్టి పడి ఇబ్బంది పడుతుంటే.. విజయాంబిక పాప వచ్చి భలే ఉన్నారు భలే ఉన్నారు అని చెప్పి వెళ్లిపోతుంది. దీపక్ హాస్పిటల్ విషయం మౌనికకి చెప్పి బయల్దేరుతాడు.


హాస్పిటల్‌కి వెళ్లిన మందారానికి డాక్టర్ కొన్న టెస్ట్‌లు చేస్తానని చెప్తారు. దీపక్, మౌనిక వస్తే విజయాంబిక అందరి ముందు ఇందాక వీళ్లు బాగున్నారు ఇప్పుడు బాలేదు అంటుంది. అక్క  పిచ్చితనంతో ఏదో చెప్తుందని అనుకున్న సూర్య తను చెప్పేదానికి అవును అని అంటారు. టిక్ టిక్ సౌండ్ వచ్చే బొమ్మ అంటే దీపక్ కవర్ చేస్తాడు. మమ్మీని లోపలికి తీసుకెళ్లు అంటాడు. మౌనిక భయపడుతుంది. చిక్ చిక్ బొమ్మ గురించి చెప్తేనే వెళ్తానని అంటుంది. బొమ్మ పేలిపోయిందని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. దీపక్ నీళ్లు నములుతాడు. ఇంతలో డాక్టర్ వస్తారు. విజయాంబిక పిచ్చి తగ్గే మందు తీసుకొచ్చానని చెప్తారు. ఇక దీపక్ ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తానని అంటే సూర్య వద్దని చెప్తారు. డాక్టర్‌ ఇంజక్షన్ వేసి గంట తర్వాత మామూలు మనిషి అవుతుందని చెప్తారు. 


మందారానికి గతం గుర్తొస్తుందా లేదా రూప టెన్షన్ పడతుంది. రాజు ధైర్యం చెప్తాడు. ఇక సూర్యతో ఇంట్లో ఉన్న డాక్టర్ ఎవరో ఇంజక్షన్ వేయడం వల్ల ఇలా అయిపోయిందని చెప్తారు. అంత అవసరం ఎవరికి ఉంది ఆ ఫ్లూయిడ్ ఎవరు ఎక్కడ ఎప్పుడు కొన్నారు అని కనిపెట్టమని చెప్తారు. దీపక్ తల్లి దగ్గర మ్యానేజ్ చేయమని మౌనికకు చెప్పి వెళ్తాడు. దీపక్ నర్స్ గెటప్ వేసుకొని హాస్పిటల్‌కి వస్తాడు. మందారం దగ్గరకు వెళ్లి మందారాన్ని తలగడతో నొక్కి పెట్టి చంపడానికి ప్రయత్నిస్తాడు. మందారం తిరగబడటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే దీపక్ మాస్క్ తీసి చూసేస్తుంది. మందారం గుర్తు పట్టడంతో అక్కడే ఉన్న సిలెండర్‌తో దీపక్ మందారం తల పగలగొట్టేస్తాడు. తర్వాత గొంతు నులిపేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?