Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషాకి తెలీకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేస్తాం అని జాను లక్ష్మీని అడిగితే లక్ష్మీ ఆలోచించి గతంలో మనీషా మిత్ర కోసం తన రక్తంతో బొమ్మ గీయించానని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఆ విషయం జాను వాళ్లతో చెప్తుంది. తన రక్తంతో మిత్రగారి బొమ్మ గీయించేలా చేద్దామని నేను రక్తం ఇస్తానంటే నాకు పోటీకి అయినా సరే మనీషా రక్తం ఇవ్వడానికి ఒప్పుకుంటుందని లక్ష్మీ అంటుంది. 


జాను అక్కతో అక్క త్వరగా ఈ విషయం పరిష్కారం చేయక్కా నీకు గిల్టీగా ఉంది ఇదంతా నా వల్ల అనిపిస్తుంది అని అంటుంది. నువ్వే బాధ పడకు నీకు దీనికి ఏం సంబంధం లేదని జానుతో లక్ష్మీ చెప్తుంది. నీ రుణం తీర్చుకోలేమని వివేక్ అంటే అవన్నీ వదిలేయండి ముందు మనీషా సంగతి చూద్దాం. ఈ బ్లడ్ టెస్ట్ గురించి మనకు అత్తయ్యకి తప్ప ఇంకెవరికీ తెలీకూడదని చెప్తుంది లక్ష్మీ. అరవింద మిత్ర గండం గురించి ఆలోచిస్తుంది. మిత్ర కన్న కూతురి వల్లే మిత్రకు గండాల సమస్య తొలగిపోతుందని చెప్పిన విషయం గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అరవింద మిత్రని పిలుస్తుంది. నాకు తెలీకుండా నిర్ణయం తీసుకున్నావ్ కదా అమ్మ అంటే నీ కోసమే నేను ఏమైనా చేస్తాను అని నీకు తెలుసు కదా అంటుంది. దానికి మిత్ర నాకు ఇప్పుడు లక్ష్మీ, పిల్లలే ముఖ్యం అని లక్ష్మీ దూరం అయిపోతుందని భయంగా ఉందని నేను చేసిన తప్పునకు లక్ష్మీకి శిక్ష వేయడం లేదు కదా మమ్మీ అంటే నేను నిన్ను బాధ పెట్టనురా అని ప్రామిస్ చేస్తుంది. ఇక మనీషా విషయం అడిగితే తనని కోడలిగా ఒప్పుకోవడానికి వేరే కారణం ఉందని ఇంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసుకుంటా నాకు వదిలేయ్ అని చెప్పి ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మనకే రావాలి అని దాన్ని మిత్ర చేతుల్లో పెడుతుంది. 


పిల్లలు స్కూల్‌కి రెడీ అవుతూ మనీషా తప్ప అందరూ బాధగా ఉందని మనీషా రాక్షసి మళ్లీ అమ్మానాన్నల మధ్యకు వచ్చిందా అని అనుకుంటారు. పిల్లల దగ్గరకు జయదేవ్, మిత్ర, లక్ష్మీలు వస్తారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లమని మారాం చేస్తారు. తమకు అమ్మానాన్నలే రోజూ డ్రాపింగ్ అండ్ పిక్ చేసుకోవాలని లేదంటే మేం స్కూల్‌కి వెళ్లమని చెప్తారు. జయదేవ్‌కి ప్లాన్ అర్థమై పిల్లలకు సపోర్ట్ చేస్తారు. దాంతో మిత్ర ఒకే చెప్తాడు. ఇక లక్ష్మీ వెళ్లకుండా మిత్ర వెళ్లి పిల్లల్ని డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. జాను గులాబీ రెక్కల్ని పట్టుకొని ఒక్కొక్కటీ తీస్తూ జరుగుతుంది జరగదు అని తెంచుతూ ఉంటుంది. వివేక్ జాను దగ్గరకు వచ్చి చూస్తాడు. ఇలాంటివన్నీ ఎందుకు అని పువ్వు పారేస్తాడు. మందులు వేసుకోమని నువ్వు తర్వగా రికవరీ అయితే ఇద్దరం ముగ్గురం అవుతాం కదా అంటాడు. ఇద్దరూ మనీషా గురించి మాట్లాడుకొని మామూలు ప్లాన్ వేయలేదు కదా అనుకోవడం దేవయాని వింటుంది. ప్లాన్ ఏంట్రా అని అడుగుతుంది. దానికి వివేక్ కొన్ని అనవసరమైన గొంతులు వినిపిస్తున్నాయ్ వాళ్లకి పిల్లల్ని కని ఇచ్చేస్తే గావు కేకలు ఆపుతారని తల్లిని ఉద్దేశించి అంటాడు. హాస్పిటల్‌లో నీ గొడవ చూసి గౌరవం పోయిందని అంటాడు. 


ఉదయం ఇంటికి లక్ష్మీ చెప్పిన అమ్మాయి వస్తుంది. లక్ష్మీ మేడం చెప్పినట్లు ఎవరికీ అనుమానం రాకుండా బ్లడ్ తీసుకోవాలని అనుకుంటుంది. లోపలికి వస్తుంది. అందరూ హాల్లోకి చేరుకుంటారు. అరవింద అందరితో తను బొమ్మలు గీసే ఆర్టిస్ట్ అని మిత్ర కోసం పిలిపించానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?