Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి చెప్పినట్టే హోళీ పండగ రోజు అంజును కిడ్నాప్ చేసేందుకు రెడీ అయి వచ్చి అమర్ ఇంటి ముందు నిలబడతాడు రణవీర్. పక్కనే ఉన్న లాయరు పిల్లలు ఇంట్లోకి వెళ్లారు ఇంకాసేపట్లో హోళీ సంబరాలు మొదలవుతాయి అని చెప్తాడు. రణవీర్: సంబరాలు స్టార్ట్ అవ్వగానే.. నేను లోపలికి వెళ్లి అంజు పాపను ఎత్తుకొస్తాను లాయరు: ఎలా సార్ అమర్ చూస్తే మిమ్మల్ని గుర్తు పడతారు కదా..? రణవీర్: రంగుల పండుగలో రంగులు పూసుకుని వెళితే ఎవరు గుర్తుపడతారు లాయరు. ఈ హోళీ మనకు బాగా కలిసి వచ్చింది లాయరు: సార్ అమరేంద్రను తక్కువ అంచనా వేయకండి.. బయటి నుంచి ఎవరు వచ్చినా ఈజీగా కనిపెట్టేస్తారు రణవీర్: అందుకేగా ఇంకో సెటప్ కూడా రెడీ చేసి ఉంచాను లాయరు: ఇంకో సెటపా ఏంటి సార్ రణవీర్: అటు చూడు అక్కడ ఒక వెహికిల్ ఉంది కదా..? అది మనదే అందులో కిడ్నాప్ కావాల్సిన అసలైంది ఉంది. దాంతోనే అంజును ఎత్తుకురాబోతున్నాను.లాయరు: ఏంటి సార్ అది రణవీర్: ముందే చెప్తే కిక్ ఏముంటుంది లాయరు.. నువ్వే చూస్తావుగా లాయరు: సస్పెన్స్ ఎందుకు సార్ అసలు ఆ వెహికిల్ లో ఏముందో చెప్పొచ్చు కదా..? రణవీర్: నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే బాగుంటుంది లాయరు.. జస్ట్ వెయిట్ అండ్ సీ అని రణవీర్ చెప్పగానే.. లాయరు అదే వెహికిల్ ను చూస్తూ ఆలోచిస్తుంటాడు. కట్ చేస్తే.. ఇంట్లో మనోహరికి ఎదురైనా భాగీని తిడుతుంటుంది.. మనోహరి: యాదమ్మ చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను భాగీ నీ మీద నాక్కూడా డౌటు వస్తుంది భాగీ భాగీ: నన్ను అనుమానిస్తున్నావా..? మనోహరి.. నిప్పు లాంటి నాలో తప్పులు వెతుకుతున్నావా..? ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను.. ఇప్పుడే వెళ్లిపోతాను.. ఏదీ ఎక్కడ నా బ్యాగు.. ఎక్కడుంది నా లగేజీ మనోహరి: ఆగు భాగీ నేను నిన్ను వెళ్లిపోమ్మని చెప్పలేదు.. హెల్ప్ చేయమన్నాను.భాగీ: కానీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు.. అవమానిస్తున్నావు ఇలాంటి చోట నేను ఉండలేను మనోహరి ఉండలేను.. నా వల్ల కాదు
యాదమ్మ: అయితే వెళ్లిపోండి మేడం.. మనోహరి గారు ఆవిడ తిప్పలు ఆవిడ పడతారు.. భాగీ: ( మనసులో) నా ఇంట్లోంచి నన్నే వెళ్లిపోమ్మంటున్నావా..? నీకు ఉందే.. మనోహరి: యాదమ్మ నువ్వు నోర్మూయ్ మధ్యలో జోక్యం చేసుకోకు యాదమ్మ: ఏంటి మేడం.. భాగీ గారు లేకపోతే ఏంటి..? మీ ప్రేమను మీరు సెట్ చేసుకోలేరా..? మనోహరి: ఇన్నేళ్లుగా గా ట్రై చేస్తున్నాను.. నా వల్ల అయిందా..? నా లవ్ సెట్ చేయడం భాగీ వల్లే అవుతుంది.యాదమ్మ: ఆవిడ మీ ప్రేమను సెట్ చేయడం లేదు.. తన లైఫ్ సెట్ చేసుకుంటుంది.అంటూ యాదమ్మ అనగానే.. భాగీ కోపంగా అనేశావా.? యాదమ్మ ఆ మాట కూడా అనేశావా..? అనుకుంటూ ఆవేశంగా మనోహరి నేను ఇక ఇక్కడ అసలు ఉండను.. వెళ్లిపోతాను అంటూ అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
