Brahmamudi Serial Today Episode:  పబ్బులో ఉన్న ఇందుకు జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇవ్వాలనుకుంటాడు రాఖీ. అలాగే వెళ్లి జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇందు దగ్గరకు వెళ్తాడు. రాఖీ జ్యూస్‌ తీసుకుని రావడం చూస్తుంది ఇందు.. ఇందు: సార్‌ ఇంతకీ నా జాబ్‌ విషయం ఏం చేశారు రాఖీ:  నీకో ఆఖరి టెస్ట్‌ ఉంది. అందులో నువ్వు సక్సెస్‌ అయితే గ్యారంటీగా ఆ జాబ్‌ నీదే కానీ దానికి ఇంకా టైం ఉంది. ముందు ఈ జ్యూస్‌ తాగు అంటూ జ్యూస్‌ ఇవ్వబోతుంటే.. అప్పుడే రాజు, లక్కీ గొడవ పడుతూ.. వచ్చి రాఖీని గుద్దేస్తారు.. జ్యూస్‌ గ్లాస్‌ కింద పడి పగిలిపోతుంది. రాజు ఇందును చూసి నవ్వుతాడు. రాజు: నువ్వా..ఇందు: నువ్వా దేన్నో ఒక దాన్ని గుద్దేయడం ఇలా పడేయడం తప్పా నీకు వేరే పని చేత కాదా..? రాజు: సిచ్యుయేషన్‌ ఏంటో తెలియకుండా ఎదుటివాళ్లను  ఎడాపెడా తిట్టడం తప్పా నీకు వేరే పని లేదా..? రాఖీ: హలో గుద్దిన దానికి సారీ చెప్పకుండా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావేంటి..?రాజు: పడిపోయింది ఏమన్నా ప్లాటినమా..? గోల్డా..? ఆప్రాల్ ఆరేంజ్‌ జ్యూసే కదా..? కావాలంటే రెండు కొనిస్తానులే.. ఇందు:  ఎంతసేపు వస్తువులు, డబ్బు అంతేనా..? ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌ ను పట్టించుకోవా..? రాజు: ఏంటి ఇప్పుడు  జ్యూస్‌ కోసం ఫీల్‌ అవుతున్నావా..? ఇప్పుడు నిన్ను గుండెల మీదకు తీసుకుని ఓదార్చాలా ఏంటి..? రాఖీ:  ఏంట్రా వాగుతున్నావు రాజు: రా ఏంట్రా  ఎలా పడితే అలా నోరు జారకు బ్రదర్‌ ఆ తర్వాత నా చెయ్యి జారుతుంది. ఆ తర్వాత నీ ఒంట్లో ఏం జారుతాయో నేను గ్యారంటీ ఇవ్వలేను.రాఖీ:  ఏంటి ఇందు ఇదంతా అసలు ఎవ్వడు వీడు.. ఇంత చీఫ్‌గా మాట్లాడుతున్నాడేంటి..? ఇందు: సార్‌ ఇతను ఎవరో నాకు నిజగానే తెలియదు సార్‌ రాఖీ: తెలియకుండానే నీతో ఇంత క్లోజ్‌గా మాట్లాడుతున్నాడా..? వీడి వాలకం చూశావా..? పక్కా ఏదో బస్తీ నుంచి వచ్చినట్టు ఉన్నాడు లక్కీ: మా వాణ్ని ఏ మాటైతే అనకూడదో ఆ మాటే అనేశావు..? అయిపోయావురా..? నువ్వు రాఖీ: అంటానురా మళ్లీ మళ్లీ అంటానురా..? నేను అనకపోతే వీడేమైనా రాజకుమారుడు అయిపోతాడా..? అసలు నిన్ను కాదురా..? లోపలికి రానిచ్చినందుకు ఈ పబ్బు ఓనరును అనాలి.. మార్కెట్‌ లో కొన్న బట్టలు వేసుకుని వస్తే..నువ్వు నేను సమానం అయిపోతామా..? రాజు, రాఖీని కొడతాడు..రాజు: రేయ్‌ నేనేదో జీవితంలో కష్టపడి ఎదగాలనుకుంటే.. ఇలా అవమానించి తొక్కేయాలని చూస్తార్రా..? చూడు బస్తీలో పుట్టడం నా తప్పు కాదు.. కానీ అదే బస్తీలో చస్తే మాత్రం అది నా తప్పు అవుతుది. ఇంకెప్పుడు అలా పర్సనల్‌ గా అటాక్‌ చేయకు.. ఇందు: ఏయ్‌ అసలు నీకు బుద్దుందా..? అలా కొడతావేంటి..? రాఖీ:  స్టాఫిట్ ఇందు మీ ఇద్దరికి ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి. అంతేకానీ నన్ను కొట్టిస్తావా..? ఇందు: అయ్యో సార్‌ ఇతనికి నాకు ఏ సంబంధం లేదు సార్‌ రాఖీ:  స్టాపిట్‌ ఇక జీవితంలో నా కంపెనీలో నీకు ఎలాంటి జాబ్‌ దొరకదు.అని వార్నింగ్‌ ఇచ్చి రాఖీ వెళ్లిపోతాడు. ఇందు రాజును తిట్టి వెళ్తూ కిందపడబోతుంటే రాజు పట్టుకుంటాడు. ఇందు తిట్టి వెళ్లిపోతుంది. ఇక పబ్బులో ఉన్న స్మగ్లర్‌ను నందు పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్తుంది. మరోవైపు మందు మత్తులో ఉన్న ఐశ్వర్యను తన బైక్‌ మీద తీసుకెళ్తూ పోలీసులకు దొరికిపోతాడు లక్కీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

Continues below advertisement

 

Continues below advertisement