Nindu Noorella Saavasam Serial Today Episode:  కోల్‌కతాలో రణవీర్‌ ఇంటికి వెళ్లిన అమర్ కు భాగీ కాల్ చేస్తుంది. అంజు దొరికిందా అని అడుగుతుంది. అమర్‌ దొరకలేదని రణవీరే అంజును తీసుకెళ్లాడని వారి అంతు చూస్తానని అమర్‌ చెప్తాడు.

భాగీ: ఏవండి నేను నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి. ఒక నిజం చెప్పాలండి..

అమర్‌: ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం

రాథోడ్‌: సార్‌ రణవీర్‌ వచ్చినట్టు ఉన్నాడు

అమర్‌:  భాగీ రణవీర్‌ వస్తున్నాడు. వాడి సంగతి చూసి అంజును తీసుకొస్తాను ఫోన్‌ పెట్టేయ్

భాగీ: ఏవండి మీరు రణవీర్‌ను ఏమీ చేయడానికి వీలులేదండి..

అమర్‌: ఏం మాట్లాడుతున్నావు భాగీ అంజును కిడ్నాప్‌ చేయాలని చూసిన వాడిని తన స్వార్థం కోసం అంజును కొల్‌ కతా తీసుకొచ్చిన వాడిని వాడి ఆస్తిని దక్కించుకోవడానికి కోర్టులో అంజు తన కూతురు అని  అబద్దపు  సాక్ష్యం చెప్పించిన వాడిని వదిలేయమంటున్నావా..?

భాగీ: అవునండి.. ఎందుకంటే అంజు కోర్టులో రణవీర్‌ కూతురు అని చెప్పడం అబద్దం కాదు.

అమర్‌: ఏంటి ఏం మాట్లాడుతన్నావు

భాగీ: అవునండి అంజు రణవీర్ కన్నకూతురు. ఏం జరిగిందో తెలియదు. ముందు అంజును తీసుకుని అక్కడి నుంచి వచ్చేయండి. ఏం జరిగినా తర్వాత మాట్లాడుకుందాం

అని చెప్పి కాల్‌ కట్‌ చేస్తుంది భాగీ. రణవీర్‌, లాయరు అంజును తీసుకుని ఇంట్లోకి వస్తారు. ఇంట్లో అమర్‌ను చూసిన రణవీర్ షాక్‌ అవుతారు.

రణవీర్‌: అమర్‌ ఇక్కడకు ఎలా వచ్చాడు. అంజు నాతో ఉందని ఎలా కనిపెట్టాడు. నిజం తెలిసిపోయిందా..? (మనసులో అనుకుంటుంటాడు)

అంజు:  డాడ్‌

అంటూ వెళ్లి అమర్‌ను హగ్‌ చేసుకుంటుంది. అమర్‌ కోపంగా రణవీర్‌ ను చూస్తుంటాడు. కట్‌ చేస్తే ఇంట్లో అందరూ టెన్షన్‌ పడుతుంటారు.

మనోహరి: ఏంటో సంతాపసభకు కూర్చున్నట్టు అందరూ మౌనంగా కూర్చున్నారు

చిత్ర: మను కామ్‌గా చూడు..

ఇంతలో ఫోన్‌ వస్తుంది. మిస్సమ్మ వెళ్లి లిఫ్ట్ చేసి అలాగా…ఓకే నేను చెప్తాను అంటూ హ్యాపీగా అంజు దొరికేసిందట అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మను, చిత్ర షాక్‌ అవుతారు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

చిత్ర: పక్కా ప్లాన్‌ చేశాను అన్నావు పాప దొరికేసింది అంటున్నారు

మనోహరి:  నాకు అదే అర్థం కావడం లేదే అంజు అమర్‌కు ఎలా దొరికింది.

చిత్ర: రణవీరే అమర్‌కు దొరికేసి ఉంటాడు. నువ్వు ఎలా చూసిన నిజం అదే ముందు నీ నిజం అమర్‌ ముందు బయట పడిందో లేదో వెళ్లి కనుక్కో 

అని చిత్ర చెప్పగానే.. మనోహరి భయంగా రూంలోకి వెళ్తుంది. తర్వాత అందరూ గార్డెన్‌లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వినోద్‌ సీరియస్ గా వస్తాడు.

వినోద్‌: అన్నయ్య నేను మీతో ఒక విషయం మాట్లాడాలి

శివరాం: దేని గురించి మాట్లాడాలి వినోద్‌

వినోద్‌:  నా పెళ్లి గురించి నాన్నా

నిర్మల:  నువ్వు ఈ మాట ఎప్పుడెప్పుడు అంటావా అని ఎదురుచూస్తున్నాము నాన్నా

వినోద్‌:  నేను ఆల్ రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను

అందరూ షాక్‌ అవుతారు.

అమర్‌: నువ్వు ప్రేమించింది చిత్రనా..?

శివరాం: నువ్వు నిజంగా చిత్రను ప్రేమిస్తున్నావా..? వినోద్‌

వినోద్‌:  అవును నాన్నా నేను తననే పెళ్లి చేసుకుందాం  అనుకుంటున్నాను.. మీరందరూ ఒప్పుకుంటే మీ ఆశీర్వాదంతో పెళ్లి జరుగుతుంది. లేదంటే పెళ్లికి నా కుటుంబం రాలేదు అనుకుని చిత్ర మెడలో తాళి కడతాను.

అంటూ వినోద్‌ బాంబు పేల్చగానే అందరూ షాక్‌ అవుతారు. బయట గేటు దగ్గర నిలబడి అంతా వింటున్న చిత్ర తన ప్లాన్‌ సక్సెస్‌ అయినందుకు హ్యపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!