Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఫోటో ఉన్న రూం కీ కోసం మనోహరి దొంగచాటుగా అమర్ రూంలోకి వెల్లి వెతుకుతుంది. ఇంతలో అమర్, భాగా వస్తారు. మనోహరి కీస్ తీసుకుని డోర్ దగ్గరకు రాగానే అమర్, భాగీ చూస్తారు.
భాగీ: మనోహరి గారు మీరు మా రూంలోంచి ఎందుకు వస్తున్నారు
అమర్: మనోహరి మా రూంలో నేను కానీ భాగీ కానీ లేనప్పుడు నువ్వెందుకు వచ్చావు.. అడుగుతుంది నిన్నే మనోమరి మా రూంలోకి ఎందుకు వెళ్లావు
భాగీ: మనోహరి గారు అడుగుతుంటే చెప్పరేంటి అసలు మీరు రూంలో ఏం చేస్తున్నారు కీస్ ఏందుకు తీసుకున్నారు.
చిత్ర: బావగారు నేను చెప్తేనే తను మీ రూంలోకి వెళ్లింది. నేను అడిగితేనే తను కీస్ తీసుకొచ్చింది
అమర్: నువ్వా..? ఎందుకు
చిత్ర: ఆరు ఫోటో చూడాలనిపించింది. ఎక్కడ ఉందని మనును అడిగితే గదిలో ఉందని చెప్పింది. అందుకే ఫోటో చూడాలని కీస్ తీసుకురమ్మని చెప్పాను
భాగీ: అందుకు నేను ఆయన లేనప్పుడు మీరు మా రూంకు వెళ్తున్నారా..?
అమర్: మనోహరి ఆ రూంకి సంబంధించిన ప్రతిదీ ఎంత పర్సనల్లో తనకు తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు కదా..
మనోహరి: తెలుసు అమర్
అమర్: మరి తను అడగ్గానే మా రూంలోకి వెళ్లి పీక్స్ అన్ని వెతికి కీస్ తీసుకున్నావంటే నేను ఏమనుకోవాలి
మనోహరి: సారీ అమర్
చిత్ర: బావగారు ఆరుంధతి ఫోటో ఉన్న గది కూడా ఈ ఇంట్లో భాగమే కదా మరి ఆ రూంలోకి వెళ్లే రైట్ అందరికీ ఉంది కదా...? అయినా నా ఫ్రెండ్ ఫోటో నేను ఒకసారి చూడాలనుకోవడం తప్పా..? నేను తనతో ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నాను అది తప్పా
భాగీ: చిత్ర అది తప్పేం కాదు కానీ ఇలా మేము గదిలో లేనప్పుడు అడక్కుండా ఆ గదిలోకి వెళ్లి కీస్ తీసుకోవడం తప్పు
చిత్ర: అరే ఏంటి భాగీ నువ్వు.. బావగారు ఏంటిది నేను మను ఏదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. అయినా ఇది మీది.. ఇది మాది అనుకోవడానికి ఆస్థి ఇంకా భాగాలు ఏమీ పెట్టలేదు కదా..? భాగాలు పెట్టనప్పుడు అన్ని అందరివి అవుతాయి కదా బావగారు
భాగీ: చిత్ర ఎవ్వరితో ఏం మాట్లాడుతున్నావో గుర్తు చేసుకుని మాట్లాడు. ఆయన సహనాన్ని పరీక్షించడం నీకంత మంచిది కాదు చెప్తున్నాను
అమర్: కోపంగా మనోహరి కీస్ ఇవ్వు అందరికీ లాస్ట్ టైం చెప్తున్నాను మనోహరి రూం ఓపెన్ చేయాలంటే నాకు చెప్పండి. ఇలాంటి పని ఇంకోసారి చేస్తే చూస్తూ ఊరుకోను
అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు అమర్. మనోహరి, చిత్ర వెళ్లిపోతారు. మరోవైపు రణవీర్ కోపంగా బయటకు వెళ్లబోతుంటే లాయర్ వచ్చి ఆపేస్తాడు.
లాయర్: రణవీర్ నువ్వు అమర్ మీద అటాక్ చేసిన విషయం అమర్‌కు తెలిసినట్టు ఉంది. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్లడం సేఫ్ కాదు
రణవీర్: లాయరు అమర్ కు నిజం తెలిసి ఉంటే ఈపాటికి ఆయన గన్ నా తల మీద ఉండేది. లేదు అంటే అమర్‌కు నిజం తెలియకకుండా ఉండాలి. లేదా తెలిసినా ఊరుకుని ఉండాలి. అంజలిని కిడాన్నప్ చేసింది నేనే ఇవాళ పిల్లలను చంపాలని చూసింది నేనే అని తెలిసినా కూడా అమర్ ఏమీ చేయలేదంటే దాని వెనక కచ్చితంగా బలమైన కారణం ఉండాలి అదేంటే నేను తెలిసుకుని తీరాలి
లాయరు: ఎందుకు రణవీర్ అమర్ విషయంలో ఇంత మొండిగా ఆలోచిస్తున్నావు.. నీకు ప్రాణం కన్నా ఆస్థి ముఖ్యమా
రణవీర్: అవును లాయరు నాకు నా ప్రాణం కన్నా ఆస్థే ముఖ్యం
అని చెప్పి వెళ్లిపోతాడు. భాగీ రూంలో అల్మారాలో సర్దుతుంటే.. ఆరు ఫోటో కనిపిస్తుంది. పక్కింటి అక్క ఫోటో ఇక్కడ ఉందేంటి అని షాక్ అవుతుంది. వెంటనే గార్డెన్‌లో ఉన్న ఆరు దగ్గరకు వెళ్లి మీ ఫోటో మా అల్మారాలో ఉందేంటి అక్కా అని అడుగుతుంది. దీంతో ఆరు షాక్ అవుతుంది. ఏం చెప్పాలో అర్తం కాక మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!