Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ, అమర్‌ల శోభనం జరగబోతుందని చిత్ర హ్యాపీగా ఉంటుంది. ఇంతలో వినోద్‌ వస్తాడు.

వినోద్‌: ఏంటి చిత్ర అంత హ్యాపీగా ఉన్నావు. ఇవాళ అక్కడ కార్యం అయిపోతుందని ఫుల్‌ కాన్పిడెంట్‌ గా ఉన్నట్టు ఉన్నావు. మా అన్నయ్య అంత ఈజీగా దేన్ని ఒప్పుకోడు నీకు మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు.

చిత్ర:  మీ అన్నయ్యకు ఇచ్చే పాలలో టాబ్లెట్‌ కలిపిన విషయం నీకు తెలియదు

వినోద్‌: అంటే ఇప్పుడు మా అన్నయ్యా..?

చిత్ర: భాగీని క్యూట్‌గా చూస్తుంటారు

రూంలో పాలు తాగిన అమర్‌ మత్తుగా తూలుతూ ప్రేమగా భాగీ అని పిలుస్తాడు. అమర్ పిలుపునకు షాక్‌ అయిన మిస్సమ్మ ఏంటి అంటూ చూస్తుంది. దీంతో అమర్‌, మిస్సమ్మ దగ్గరకు జరిగి

అమర్‌:  ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా..? ఈ హెయిర్‌ ఇలా ఉంటే ఇంకా అందంగా ఉంటావు

చిత్ర:  అలా ఇద్దరూ ఒక్కటై పోతారు

వినోద్‌: అవును ఎన్ని టాబ్లెట్స్‌ వేశావు

చిత్ర: రెండు టాబ్లెట్స్ వేశాను

వినోద్‌: రెండు టాబ్లెట్స్‌ వేస్తే స్లీపింగ్‌ పిల్స్ లా పని చేస్తుంది అది

చిత్ర: నిరుత్సాహంగా అంటే బావగారు.. నా కష్టం వృథా అయినట్టేనా..?

చిత్ర అనుకున్నట్టుగానే అమర్‌ మత్తుగా నిద్రపోతాడు. మరోవైపు రణవీర్‌ దగ్గరకు లాయర్‌ వస్తాడు.

లాయర్‌: ఎందుకు రణవీర్‌ రాత్రంతా కూడా నిద్ర పోకుండా ఆలోచిస్తూ ఉన్నావు. అయినా అమరేంద్ర చెప్పాడు కదా దుర్గ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తానని

రణవీర్‌: లాయరు అమరేంద్ర నిజం దాస్తున్నాడు. అంజలి పుట్టిన మిలటరీ హాస్పిటల్ నెంబర్‌ కనుక్కున్నావా..?

లాయరు: కనుక్కున్నాను రణవీర్‌..

రణవీర్‌: అయితే కాల్‌ చేసి ఇవ్వు

లాయర్‌ కాల్‌ చేసి రణవీర్‌కు ఇస్తాడు. హాస్పిటల్‌ వాళ్లను అంజలి బర్తు గురించి అడుగుతాడు. ఇక్కడే హాస్పిటల్‌ లోనే అంజలి పుట్టిందని చెప్తారు. రణవీర్‌ షాక్ అవుతాడు. వెంటనే కాల్‌ కట్‌ చేస్తాడు.

రణవీర్‌:  లాయరు అమరేంద్ర ఇంట్లో పని చేసిన వారికి కాల్‌ చేయ్‌ డెలివరీ అయ్యాక ఎన్ని రోజులకు ఇంటికి వచ్చారో తెలుసుకో

లాయరు కాల్‌ చేస్తాడు.

లాయరు: రణవీర్‌ డెలివరీ అయ్యాక ఐదు రోజులకు ఇంటికి వచ్చారట. అప్పటి నుంచి అంజలి వాళ్లు కొడైకెనాల్‌ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు ఆవిడ చూసిందట

రణవీర్: అయితే వెంటనే ఫోన్‌ చేయ్‌

లాయరు ఫోన్‌ చేస్తాడు.

లాయరు: రణవీర్‌ నువ్వు చెప్పిన అందరికీ కాల్ చేశాను. అందరూ అంజలిని రోజుల పాప నుంచి చూస్తున్నామని చెప్తున్నారు

రణవీర్‌: వాళ్లందరూ అబద్దం చెప్తున్నారు అనిపిస్తుంది లాయరు

లాయరు: డీటెయిల్స్‌ తో సహా అన్ని చెప్తున్నారు రణవీర్‌.. అబద్దం అంటావేంటి..?

రణవీర్: కాదు అమరేంద్ర గేమ్‌ ఆడుతున్నాడు లాయరు

అంటూ కోపంగా చూస్తుంటాడు. మరోవైపు రాథోడ్‌, అమర్‌ దగ్గరకు వచ్చి మీ గెస్‌ కరెక్ట్‌ అయింది. రణవీర్‌ అంజలి గురించి మనకు తెలిసివాళ్ల దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాడట సార్‌ అని చెప్తాడు. కానీ నిజానికి రణవీర్‌ కు మధ్య నేనుంటాను రాథోడ్‌. రణవీర్‌కు ఎప్పటికీ నిజం తెలియనివ్వను అంటాడు అమర్‌. తర్వాత చిత్ర, మనోహరి కలిసి భాగీని చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. అందుకోసం బాత్‌రూంలో కరెంట్‌ వైర్‌ కట్‌ చేసి టాప్‌ ఓపెన్‌ చేసి పెడతారు. కిందకు వచ్చి భాగీని రూంలోకి వెళ్లమని చెప్తారు. అలాగేనని భాగీ రూంలోకి వెళ్లగానే టాప్‌ ఓపెన్‌ అయిన సౌండ్‌ విని బూత్రూంలోకి వెళ్తుంది భాగీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!