Chinni Serial Today Episode నాగవల్లి మహికి తినిపిస్తుంది. శ్రియ తల్లితో చూడు మమ్మీ అత్త బావకి ఎలా తినిపిస్తుందో నువ్వు ఎప్పుడైనా మాకు తినిపించావా అని అంటుంది. దానికి వసంత మీరు అంత ఛాన్స్ ఎక్కడ ఇచ్చారు మీరే తినేస్తారు కదా అంటుంది. మహికి తిండి మీద ధ్యాస ఉండదు అని మీ అత్త తినిపిస్తుంది అని అంటుంది.

శ్రియ మహితో బావ త్వరగా కాలేజ్‌కి వెళ్దాం నీ రాక కోసం చాలా మంది వెయిటింగ్ అంటుంది. దానికి నువ్వు మరీ నా గురించి కాలేజ్‌లో ఎవరికి తెలుసు అంటే నేనే చెప్పి నీ రాకకోసం గ్రాండ్‌ వెల్‌కమ్ ఏర్పాటు చేశానని చెప్తుంది. నిన్ను చూసి అందరూ పిధా అయిపోతారు. నువ్వు నచ్చిన వాళ్లు ఎవరైనా ఉంటారా అని అంటుంది. ఇక మధుమితకి వాళ్ల అమ్మ తినిపిస్తుంటుంది. మధుకి తన తండ్రి 500 వందలు ఇస్తే మహికి దేవా కార్డు ఇస్తాడు. మధు రెడీ అయి దేవుడికి దండం పెడుతుంటే హారతి ఆగిపోతుంది. తల్లిదండ్రులు కంగారు పడితే మధు ధైర్యం చెప్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటుంది. తన ఫ్రెండ్ రావడంతో ఇద్దరూ స్కూటీ మీద వెళ్తారు.

లోహిత రెడీ అయి డ్రస్‌లు వేసుకుంటూ రిచ్ కాలేజ్‌కి ఇలాంటి డ్రస్‌లు వేసుకుంటే విలేజ్ అమ్మాయి అని ఏడిపిస్తారని అనుకుంటుంది. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ తన ఫ్రెండ్‌కి  కాల్ చేసి కారులో ఓ మంచి డ్రస్ పెట్టమని అడుగుతుంది. చందు లోహిత దగ్గరకు వస్తాడు. కాలేజ్‌లో నేను పని చేస్తున్నా అని మర్చిపోకు  నాకు చెడ్డ పేరు తీసుకురావొద్దు జాగ్రత్త అని అంటాడు. ఇక తాను తీసుకెళ్తా అంటే లోహిత వద్దని సపరేట్‌గా వెళ్తా 500 వందలు ఇవ్వమని అంటుంది. చందు, సరళ 500 అని నోరెళ్ల పెడతారు. ఇక లోహిత కరెంట్ బిల్‌ కోసం ఉంచిన 500 వందలు తీసుకుంటుంది. 

శ్రియ కాలేజ్‌కి వెళ్లి తన బావ కోసం ఎలివేషన్ ఇస్తుంది. మహి కారులో కాలేజ్‌కి వెళ్తాడు. మహిని చూసి అందరూ నోరెళ్ల పెడతారు. శ్రియ హాయ్ బావ అని వస్తే తన ఫ్రెండ్స్ కూడా హాయ్ బావ అంటూ పలకరిస్తారు. బావ అని మహి అంటే మా ఫ్రెండ్ అన్నయ్యని అన్నయ్యా అంటాం కదా అలాగే బావని కూడా బావ అంటాం అని అంటారు. అందరూ మహికి షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వెళ్తే మహి మూడు అడుగులు వెనక్కి వేస్తాడు. మహి అక్కడ అమ్మాయిలతో ఇండియా ఈజ్ మై కంట్రీ.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పమంటాడు. ఎవరూ చెప్పరు.. నువ్వు మా బావ బ్రదర్ కాదు అని పారిపోతారు.

మహి చిన్నిని తలచుకుంటాడు. నా మనసులో ఖాళీ లేదు మనసంతా చిన్ని నిండిపోయి ఉంది అని అనుకుంటాడు. ఇంతలో మహి ఫ్రెండ్‌ వస్తాడు. ఇద్దరూ ఫ్రెండ్ మారినా ట్రెండ్ మారదే అని పాడుకుంటూ వెళ్లిపోతారు. చందు లోహితను తీసుకెళ్తుంటే తన ఫ్రెండ్ కారు దగ్గర ఆగమని చెప్పి తన కోసం తన ఫ్రెండ్ ఆగమని చెప్పిందని అంటుంది. చందుని ఒప్పిస్తుంది. కారు ఎక్కు వెనకాలే ఫాలో అవుతాను అని చందు అంటే తనకు వేరే పని ఉందని చెప్పి చందుని పంపేస్తారు. ఇక లోహిత బేబీ  స్టైల్‌లో కారులోనే డ్రెస్ మార్చేసి మోడ్రన్ డ్రస్ వేసుకొని రెడీ అయిపోతుంది. ఇక తన ఫ్రెండ్‌ని పక్కన కూర్చొపెట్టుకొని లోహిత చాలా స్పీడ్‌గా కారు నడుపుతుంది. 

చిన్ని అలియాస్ మధుమిత తన ఫ్రెండ్‌తో కలిసి స్కూటీ మీద రాజమండ్రి చేరుకుంటుంది. రాజమండ్రిలో అడుగు పెట్టగానే చిన్నికి జైలు నుంచి వచ్చిన తర్వాత మొదటి సారి రాజమండ్రి చూడటం మామయ్య ఇంటికి తనని అప్పగించడం గుర్తు చేసుకుంటుంది. స్కూటీ పక్కకు ఆపి బాధగా నిల్చొని అన్నీ గుర్తు చేసుకుంటుంది. కావేరిని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకుంటుంది. అమ్మ నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఊరు ఇప్పటి వరకు రాలేదు వచ్చిన తర్వాత అన్నీ నీ జ్ఞాపకాలే ఎందుకంటే నువ్వే నా జీవితం అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'