Nindu Noorella Saavasam Serial Today Episode:  అనాథల గురించి చాలా ఛీప్‌గా మాట్లాడిన మనోహరికి బుద్ది చెప్తుంది మిస్సమ్మ.  గతంలో ఉన్నది చీకటో ప్రేమో తెలియాలంటే ముందడుకు వేయాలి. ముందు అక్కడికి వెళ్లాలి అని చెప్తుంది. రాథోడ్‌ కూడా మిస్సమ్మ చెప్పింది కరెక్టేనని చెప్పడంతో శివరాం కూడా సపోర్టు చేస్తాడు. దీంతో అమర్‌ ఆరు కోరిక తాను తీరుస్తానని తన పిల్లలని తన తల్లిదండ్రుల దగ్గర నిలబెడతానని చెప్తాడు. తర్వాత పిల్లలు అందరూ ఆరు గురించి ఆలోచిస్తూ బాధపడుతారు. అంజును స్కూల్‌లో సేవ్‌ చేసినందుకు థాంక్స్‌ చెప్పావా? అని అడుగుతారు. లేదని చెప్తుంది. ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తుంది. అందరూ తిట్టడతారు ఇంతలో మిస్సమ్మ రాగానే అంజు థాంక్స్‌ చెప్తుంది. తర్వాత హాస్పిటల్‌ లో ఉన్న కృష్ణమూర్తిని డాక్టర్‌ టెస్ట్‌ చేస్తుంటాడు.


డాక్టర్‌: ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి..


కృష్ణమూర్తి: ఇక్కడ కొంచెం కలుక్కుమంటుంది. డాక్టర్‌ గారు


మంగళ: ఆగిపోతున్న గుండె మళ్లీ కొట్టుకుంటుంది కదా ఆ మాత్రం నొప్పి లేకపోతే ఎలా?


డాక్టర్‌: అంతపెద్ద ఆపరేషన్‌ జరిగింది కదా  అందుకోసం కొద్ది రోజులు నొప్పిగా ఉంటుంది. కడుపులో మంటగా కూడా ఉంటుంది. కొద్ది రోజులు కారం తక్కువగా తినండి.


కృష్ణమూర్తి: అలాగే నండి. డాక్టర్‌గారు నాకొక చిన్న సాయం కావాలి. నాకేం బాగా లేకపోయినా.. నాకే చిన్న సమస్య వచ్చినా.. ముందు నాకే చెప్పండి. నా కూతురుకు చెప్పకండి. నాకేం అయిపోతుందేనని భయపడిపోతుంది.


డాక్టర్‌: మీకేం కాదు సార్‌. ఏ సమస్య రాదు. ఒకవేశ వచ్చినా మీ పక్కన మీ అల్లుడు రూపంలో కొండంత బలం ఉంది సార్‌. తండ్రికి ఆపరేషన్‌ చేయించాలంటేనే తెల్లబోయిన ముఖాలను ఒకళ్లని ఒకళ్లు చూసుకునే వాళ్లను చూశాను. కానీ మీ అల్లుడు క్షణం కూడా ఆలోచించకుండా ఎంత ఖర్చైనా ఏం కావాలన్నా? నేను చూసుకుంటానని చెప్పాడు. మీ అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలండి.


కృష్ణమూర్తి: అవును బాబు నా కూతురు పడిన కష్టానికి ఆ భగవంతుడు బంగారం లాంటి భర్తను ఇచ్చాడు.


డాక్టర్‌: సరేనండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నర్సుకు చెప్పండి.


మంగళ: డాక్టర్‌ గారు పొద్దున్నే పంపించాల్సిన టిఫిన్‌ ఇంకా పంపించలేదు.


డాక్టర్‌: ఏమ్మా తిండి నిద్రా కాకుండా ఇంక దేని గురించి ఆలోచించవా?


 అంటూ మంగళను డాక్టర్‌ చెడామడా తిట్టి వెళ్లిపోతాడు. మరోవైపు అరుంధతి ఇంట్లోకి వచ్చి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది.


మిస్సమ్మ: ఏంటక్కా నిన్న కనిపించలేదు.


ఆరు: అవును మిస్సమ్మ


మిస్సమ్మ: ఏంటో అక్కా నువ్వు పక్కన లేకపోతే నాకు ఏమీ తొచదు. నీకు బాగా అలవాడు పడిపోయాను అక్క. ఏదైనా సమస్య రాగానే నువ్వు పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఆనందం వస్తే నీతో పంచుకోవాలనిపిస్తుంది.


ఆరు: నేను కూడా ఇక్కడ నువ్వున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను మిస్సమ్మ. అవును అదేంటి ఈరోజు ఇంటి ముందు ఇంకా ముగ్గు వేయలేదు.


మిస్సమ్మ: వేయలేదా? ఏదైనా పండగొస్తే అత్తయ్య వేస్తారు. లేదంటే పని అమ్మాయి వేస్తుంది. ఈరోజు పని అమ్మాయి రాలేదు కదా?


ఆరు: అయితే నువ్వు వెయ్‌ మిస్సమ్మ.


అని చెప్పగానే సరే అక్కా నేను వెళ్లి ముగ్గు తీసుకొస్తాను అని లోపలికి వెళ్లి ముగ్గు తీసుకుని వస్తుంది మిస్సమ్మ. ఏ ముగ్గు వేయాలని అడుగుతుంది. ఆయనకు లోటస్‌ ముగ్గు అంటే ఇష్టమని ఆరు చెప్పడంతో ఆయనకు ఆ ముగ్గే ఇష్టమని నీకెలా తెలుసు అంటూ ప్రశ్నిస్తుంది మిస్సమ్మ. మీ ఆయన ఎప్పుడు మేడంతో ఆ ముగ్గు వేయించుకునే వారని చెప్తుంది ఆరు. తర్వాత ఆరు చెప్తుంటే మిస్సమ్మ ముగ్గు వేస్తుంది. ఇంతలో అమర్‌ వచ్చి ముగ్గు చూసి ఆరును గుర్తు చేసుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ:  అల్లు అర్జున్‌ నంద్యాల వెళ్లడంపై నిహారిక రియాక్షన్‌ - అప్పుడు ఇంట్లో అంతా ఇదే అన్నారు..