Nindu Noorella Saavasam Serial Today January 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  తనకు బతకాలని ఉందన్న ఆరు – భాగీకి అబద్దం చెప్పిన రామ్మూర్తి  

Nindu Noorella Saavasam Today Episode:   తనకు మళ్లీ బతకాలని ఉందని.. తన చెల్లితో.. నాన్నతో గడపాలని ఉందని ఆరు, గుప్తను అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Continues below advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఇంటికి వచ్చిన రామ్మూర్తి కూల్‌గా నిర్మల, శివరాంలకు సారీ చెప్తాడు. కానీ అసలు నిజం ఎవ్వరికీ చెప్పడు.  దీంతో శివరాం ఆస్థికలు కలపడానికి కాశీ వెళ్తు్న్నాం మీరు రండి అని చెప్తాడు. సరే అంటాడు రామ్మూర్తి.   ఇక పైకి వెళ్తు్న్న రామ్మూర్తి దగ్గరకు వెళ్తుంది భాగీ.

Continues below advertisement

భాగీ: నాన్నా అక్క అచూకి ఏమైనా తెలిసిందా?

రామ్మూర్తి:  తెలియలేదు తల్లి. కానీ అక్క మనకు అందనంత ఎత్తులో.. చేరుకోలేనంత దూరంలో ఉందమ్మా..

భాగీ: ఏంటి నాన్నా.. అక్క గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అడిగితే నాకేం తెలియదంటున్నారు.

రామ్మూర్తి: ఎక్కడుందో ఎలా ఉందో తెలియని మీ అక్కను చేరుకోవడం అంత ఈజీ కాదమ్మా.. విడదీసిన ఆ విధే మళ్లీ కలపాలి

భాగీ: లేదు నాన్నా మీ మాటలు వింటుంటే నాకేదో అనుమానంగా ఉంది. చెప్పండి నాన్నా అసలు ఏం జరిగింది

అమర్‌:  మిస్సమ్మ నువ్వు లేనిపోనివి ఊహించుకుని మీ నాన్న మనసును ఇబ్బంది పెట్టకు

భాగీ: లేదండి మిమ్మల్ని మా నాన్న మాటలు చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. నిజం చెప్పండి నాన్నా అసలేం జరిగింది.

రామ్మూర్తి: అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో సెటిల్‌ అయ్యారంట అందుకే అలా అన్నాను

భాగీ: అక్క ఎంత దూరంలో ఉన్నా.. తెలిస్తే ముందు నేనే వెళ్తాను నాన్నా..

రామ్మూర్తి: వద్దమ్మా నువ్వు అలా మాట్లాడకు.. తల్లి

అని రామ్మూర్తి చెప్పగానే సరే నాన్నా అంటూ భాగీ వెళ్లిపోతుంది. బాబుగారు ఒకసారి నేను ఆమ్మాయి అస్తికలు ముట్టుకోవచ్చా అని అడుగుతాడు. సరే పదండి అని రూంలోకి తీసుకెళ్తాడు అమర్‌. ఆరు ఏడుస్తూ కూర్చుని ఉంటే గుప్త వస్తాడు.

గుప్త: నీకు ఎప్పుడో చెప్పాను కదా బాలిక. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని నువ్వు తెలుసుకున్న నిజం నీకు బాధను, కష్టాన్ని ఇస్తుంది. ఇక నువ్వు ఈ నిజాన్ని మోయక తప్పదు. నీకు ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పుకో బాలిక

ఆరు: ఒక గంటే నేను ఈ నిజాన్ని మోయలేకపోతున్నాను. ఆయన ఒక్కరే ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎలా మోయగలిగారు. మా ఆయనతో సంతోషంగా ఉన్నా.. నా పిల్లలతో హ్యాపీగా ఉన్నా మనసులో ఎప్పుడూ ఏదో వెలితిగా ఉండేది. కానీ మొదటి సారి నా చెల్లి మాట విన్నప్పుడు చాలా సంతోషం వేసింది. దేవుడు చాలా దుర్మార్గుడు గుప్త గారు..   దేవుడంటే ఇప్పుడు కోపంగా ఉంది. మనసారా ఆ దేవుడిని తిట్టాలని ఉంది.

గుప్త: బాలిక ఏమిటీ ఆ మాటలు.. జీవితమంతయూ దైవమును కొలిచి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు.

ఆరు: చనిపోయే  ముందు నా చెల్లిని నా కళ్ల ముందుకు తీసుకొచ్చి కలవకుండా చేశాడు గుప్త గారు.  ఎందుకు చేశావు దేవుడా ఇలాగా..? నేను ఎవరికి ఏం అన్యాయం చేశానని ఇలా చేశావు చెప్పు.. నా కుటుంబానికి ఎందుకింత కష్టాన్ని తీసుకొచ్చావు. అప్పుడు ఇప్పుడు నా తండ్రికి ఎందుకు ఇంత దుఃఖాన్ని ఇచ్చావు.

గుప్త: బాలిక ఏడవకు.. నీ పతి దేవుడు నీ తండ్రిని.. నీ సోదరిని బాగా చూసుకుంటాడు. నువ్వు లేని లోటు లేకుండా చూస్తాడు. మీ రుణ బంధం ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఆ జగన్నాథుడు ఇలా చేశాడు..

ఆరు: నాకు ఒక్కసారి బతకాలని ఉంది గుప్త గారు.. నాన్న వేలు పట్టుకుని బతకాలని ఉంది. చెల్లెలు చేయి పట్టుకుని తన కన్నీళ్లను తుడవాలని ఉంది. నేను కోల్పోయిన జీవితాన్ని పొందడం కోసం నాకు బతకాలని ఉంది.

గుప్త: బాలిక అది అసంభవం.

ఆరు: అసంభవం అని తెలుసు గుప్త గారు. కానీ మనిషిని కదా..?

అని ఆరు ఏడుస్తుంది. గుప్త ఎమోషనల్‌ అవుతాడు. తర్వాత ఇంటికి వెళ్దాం పద బాలిక అంటే ఆరు రాను అంటుంది. మరోవైపు అమర్‌ రూంలోకి వెళ్లిన రామ్మూర్తి ఆరు ఆస్థికలు, ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement