Nindu Noorella Saavasam Serial Today Episode: అరకు నుంచి వస్తున్న బస్సు హైదరాబాద్‌లో స్టాప్ దగ్గర ఆగుతుంది. అందులోంచి విక్రమ్ దిగి వస్తాడు. విక్రమ్‌ను చూసిన అమర్ పలకరిస్తాడు. హెల్త్ ఎలా ఉందని అడుగుతాడు.
విక్రమ్: బాగానే ఉంది. ఆ అమ్మాయి ఎవరో కానీ నన్ను దేవతలా కాపాడింది
అమర్: తను బస్సులోనే ఉందా..? (అమర్ బసులోకి వెళ్తాడు) విక్రమ్ వీళ్లల్లో నిన్ను సేవ్ చేసింది ఎవరు..?
విక్రమ్: ఆ తల్లీకూతుళ్లు ముందు స్టాప్‌లోనే దిగిపోయారు
అమర్: అయ్యో నేను వాళ్లకు థాంక్స్ చెబుదాం అనుకున్నాను కదా..?
విక్రమ్: నేను అదే చెప్పాను కానీ వాళ్లు దిగిపోయారు అమర్
అమర్ బస్సు దిగి కిందకు వెళ్తాడు.
రాథోడ్: ఏమైంది సార్ వాళ్లకు థాంక్స్ చెప్పారా..?
అమర్: లేదు రాథోడ్ వాళ్లు ముందు స్టాప్ లోనే దిగిపోయారట
విక్రమ్: ఇట్స్ ఓకే అమర్ వీళ్లు ఈ సిటీలోనే ఉంటారు కదా..? ఎప్పుడో ఒకప్పుడు కలవొచ్చు కదా..?
రాథోడ్: ఏంటి రాజు గారు మీ వాళ్లు ఇంకా దిగలేదా..?
రాజు: మా వాళ్లు వచ్చేది ఈ బస్సులో కాదండి.. వెనక బస్సులో వస్తున్నారు
విక్రమ్: ఇంకేంటి అమర్ విశేషాలు మీ వైఫ్ పాప కనిపించారా..?
రాథోడ్: లేదు సార్.. ఐదేళ్ల నుంచి వాళ్ల కోసం వెతుకుతున్నాము
విక్రమ్: ఐయామ్ సో సారీ అమర్.. ఇలా జరగకుండా ఉండాల్సింది.. ఇంతకీ వాళ్లు ఎలా ఉంటారు..?
రాథోడ్: (ఫోన్‌లో మిస్సమ్మ ఫోటో చూపిస్తాడు) సార్ ఈవిడే మా మిస్సమ్మ
విక్రమ్: వాట్ ఈ అమ్మాయా..?
రాథోడ్: ఏంటి సార్ మా మిస్సమ్మ మీకు తెలుసా..?
విక్రమ్: అమర్ బస్సులో నన్ను ఒక అమ్మాయి సేవ్ చేసింది అని చెప్పాను కదా..? తనే
రాథోడ్: ఏంటి సార్ మీరు చెప్పేది..? మిమ్మల్ని కాపాడింది మా మిస్సమ్మ.. మా సారు వైఫా..?
విక్రమ్: ఓ మై గాడ్ తను నీ వైఫా..? నైట్ నేను వచ్చిన ఈ బస్సులోనే తను వచ్చింది తనతో పాటు ఐదేళ్ల పాప కూడా ఉంది
అమర్: వాళ్లు ఎక్కడ దిగారు.. విక్రమ్..?
విక్రమ్: వాళ్లు ముందు బస్టాప్‌లోనే దిగారు
అమర్: విక్రమ్ నేను నిన్ను ఆఫీసులో మీట్ అవుతాను.. రాథోడ్ కారు తీయ్
అంటూ ఇద్దరూ ముందు స్టాప్ దగ్గరకు వెళ్తారు. అమర్ వాళ్లు వచ్చేలోపు రాజు ఆటోలో భాగీని, బుజ్జమ్మను తీసుకుని వెళ్లిపోతాడు. అమర్ అక్కడ వెళ్లి భాగీని వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. అక్కడున్న వాళ్లను అడిగితే ఇప్పుడే ఆటోలో వెళ్లిపోయారు అని చెప్తారు. దీంతో అమర్ బాధగా ఇంటికి వచ్చి ఎవ్వరిని పట్టించుకోకుండా రూంలోకి వెళ్లిపోతాడు.
ఆకాష్: ఏం జరిగింది రాథోడ్. డాడ్ మాతో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు
రాథోడ్: మీరు కంగారు పడకండి మంచి విషయమే జరిగింది.
అమ్ము: మంచి విషయమా..? ఏంటా విషయం రాథోడ్
అంజు: మంచి విషయమా.. అయితే మరీ డాడ్ ఎందుకు అంత డల్లుగా ఉన్నారు..?
రాథోడ్: మీరేం కంగారు పడకండి.. మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబద్ వచ్చారు
అంటూ రాథోడ్ డాన్స్ చేస్తూ చెప్పగానే.. పిల్లలు సంతోషపడుతుంటారు. మనోహరి, చంభా షాక్ అవుతారు. మరోవైపు ఆశ్రమానికి వెళ్లిన భాగీ, అమర్ పిల్లల గురించి రాజును అడుగుతుంది. వాళ్లు నీ కోసమే బాధపడుతున్నారని చెప్తాడు రాజు. ఇక రూంలోకి వెళ్లిన అమర్ భాగీ ఫోటో తీసుకుని చూస్తూ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
