Nindu Noorella Saavasam Serial Today January 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  యమలోకంలో ధర్నా చేస్తున్న ఆరు – ఇంటికి వచ్చిన అమర్‌

Nindu Noorella Saavasam Today Episode: తనకు న్యాయం చేయాలని యమలోకంలో ఉన్న వాళ్లతో కలిసి ధర్నా చేస్తుంది ఆరు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Continues below advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: యమలోకం నుంచి కింద హాస్పిటల్‌ లో జరుగుతుంది మొత్తం మాయాపేటికలో చూస్తుంది ఆరు. అంజు గురించి బాధపడుతూ గుప్తను తిడుతుంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే మా ప్రభువుల వారు నిన్ను మళ్లీ భూలోకం పంపిస్తాడు అని చెప్తాడు గుప్త. ఆరు ఆశ్చర్యపోతుంది. మీరు ఈ మాత్రం హింట్‌ ఇస్తే నేను ఇక చెలరేగిపోతాను అంటూ వెళ్తుంది ఆరు. హాస్పిటల్‌కు భాగీ వస్తుంది.

Continues below advertisement

భాగీ: ఏవండి ఇక్కడ రణవీర్‌ అనే వ్యక్తి జాయిన్‌ అయ్యారా..?

రిసెప్షన్‌: చూస్తాను ఉండండి.. లేదండి ఆ పేరుతో ఎవ్వరూ జాయిన్‌ కాలేదు.

భాగీ: ఎవరైనా డాక్టర్‌ అపాయింట్‌ తీసుకున్నారేమో చూడండి.

రిసెప్షన్‌:  (చెక్‌ చేసి) లేదు మేడం ఎవ్వరూ ఆ పేరుతో అపాయింట్ మెంట్‌ కూడా తీసుకోలేదు.

అని చెప్పగానే.. భాగీ అంజును వెతుక్కుంటూ హాస్పిటల్‌ లోకి వెళ్తుంది. హాస్పిటల్‌కు వచ్చిన భాగీని చూసిన మనోహరి, రణవీర్‌ కంగారుపడతారు.  

మనోహరి: ఆ రాక్షసి పసిగట్టేసింది. ఇక్కడకు కూడా వచ్చేసింది.

రణవీర్‌: ఏంటి మనోహరి ఇప్పుడు ఏం చేద్దాం

మనోహరి: ఏమో తెలీదు. కానీ మిస్సమ్మకు నువ్వు అంజలికి కిడ్నాప్‌ చేసే ప్లాన్‌లో ఉన్నావని తెలిస్తే.. నిన్ను ప్రాణాలతో వదలదు. అది తన జోలికి వచ్చినా వదిలేస్తుందేమో కానీ పిల్లల జోలికి వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు.

రణవీర్‌: ఏంటి మనోహరి నువ్వు, నీ ప్రాణాలు, నీ కిడ్నాప్‌ అంటూ మాట్లాడుతున్నావు నీకు ఈ ప్లాన్‌కు సంబంధం లేదా..? అవును ఇదంతా నువ్వు నన్ను అమర్‌ దగ్గర ఇరికించడానికి వేసిన ప్లాన్‌ కాదు కదా..?

మనోహరి: అయినా మిస్సమ్మ మనల్ని పట్టుకోవడానికి ఒక్క క్షణం దూరంలో ఉంది. ఇప్పుడిలా మనం కొట్టుకుంటూ ఉంటే.. దాని పని ఈజీ అవుతుంది

 మరోవైపు మిస్సమ్మ అంజలిని వెతుక్కుంటూ అంజలి బ్లడ్‌ శాంపిల్‌ తీస్తున్న రూం దగ్గరకు వెళ్తుంది. అది గమనించిన మనోహరి, రణవీర్‌ కంగారుపడుతుంటారు. మరోవైపు అమర్‌ ఇంటికి వస్తాడు.

నిర్మల:  ప్రయాణం బాగా జరిగిందా నాన్నా.. చూడు రాత్రంతా నిద్ర లేదా… చాలా నీరసంగా కనిపిస్తున్నావు

అమర్‌: అవునమ్మా వరుసగా మీటింగ్‌లు ఉన్నాయి. అందుకే నిద్ర లేదు

నిర్మల:  మీరేంటో.. మీ డ్యూటీలేంటో నాకు అర్తం కావడం లేదు

శివరాం: అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు కానీ వెళ్లి కాఫీ తీసుకురాపో

అమర్‌: మిస్సమ్మ లేదా..?

 అని అమర్‌ అడగ్గానే.. ఇందాక రణవీర్‌ వచ్చి అంజును తీసుకెళ్లాడు..? అంటూ నిర్మల చెప్పబోతుంటే.. ఏయ్‌ ఆగు ఇంట్లో రాథోడ్‌ లేడు కదా.? సరుకుల కోసం బయటకు వెళ్లింది అంటూ శివరాం అబద్దం చెప్తాడు. మరోవైపు హాస్పిటల్‌ లో ఉన్న మిస్సమ్మ రణవీర్‌కు ఫోన్‌ చేస్తుంది. మనోహరి కంగారుగా సైలెంట్‌ లో పెట్టు అంటుంది. రణవీర్‌ కాల్‌ లిఫ్ట్‌ చేయబోతుంటే.. ఏయ్‌ లిఫ్ట్‌ చేయకు.. ఒక్కసారి చేసినందుకే ఇంతదూరం వచ్చింది. ఈసారి లిఫ్ట్ చేశావనుకో నువ్వు అంజును హాస్పిటల్‌కు తీసుకొచ్చావని ఈజీగా తెలిసిపోతుంది అని భయపడుతుంది మనోహరి. ఇంతలో శివరాం.. భాగీకి ఫోన్‌ చేసి అమర్‌ ఇంటికి వచ్చిన విషయం చెప్తాడు. మరోవైపు యమలోకంలో ఆరు ధర్నా చేస్తుంది.

  యముడు వచ్చి తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తుంది. ఇంతలో యముడు వచ్చి వాళ్లందరినీ పంపించేయ్‌ బాలిక అని చెప్తాడు. సరే అని అందరినీ పంపిచేస్తుంది ఆరు. కింద హాస్పిటల్‌ లో బ్లడ్‌ శాంపిల్‌ తీసుకున్న తర్వాత నర్సు అంజును పంపిస్తుంది. బయటకు వచ్చిన అంజు హాస్పిటల్‌ లో భాగీని చూసి పిలవబోతుంటే.. రణవీర్‌ వచ్చి ఆపి ఇప్పుడు భాగీ నిన్ను ఇక్కడ చూస్తే నువ్వు ఐస్‌క్రీం తిన్న సీక్రెట్‌ తెలిసిపోతుందని పిలవొద్దని చెప్తాడు. అంజు సరే అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement