Nindu Noorella Saavasam Serial Today Episode: మాయాపేటికలో భవిష్యత్తు చూస్తుంది ఆరు. అది గమనించిన విచిత్రగుప్తుడు భయంతో పరుగెత్తుకొచ్చి మాయాపేటికను లాక్కోవాలని చూస్తాడు. కానీ ఆరు ఇవ్వదు. అందులో మనోహరి అంజును కిడ్నాప్ చేయడం.. తీసుకెళ్లి రణవీర్‌కు అప్పగించడం మొత్తం చూసి భయపడుతుంది.
విచిత్రగుప్త: బాలిక నువ్వు మాయాపేటిక చూడటం ఇక్కడ ఎవరైనా చూస్తే మాకు నరకంలో విధించే శిక్షలు విధిస్తారు.
ఆరు: మను మళ్లీ ఏదో ప్లాన్ చేస్తుంది గుప్త గారు
విచిత్రగుప్త: నేను ఏమీ మాట్లాడుతుంటిని.. నువ్వు ఏమీ సమాధానం ఇస్తుంటువి
ఆరు: మను ఎక్కడి నుంచో ఇంటికి వచ్చి రణవీర్‌తో ఏదేదో మాట్లాడుతుంది
విచిత్రగుప్త: ముందు నువ్వు ఆ మాయాపేటిక మూయుము.. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతున్నాయి బాలిక
ఆరు: అర్థం కాలేదు గుప్తగారు.
విచిత్రగుప్త: ఆనాడు వద్దన్ని వదిలించుకున్నవాళ్లే ఈనాడు కావాలని దగ్గరకు చేర్చుకుంటున్నారు
ఆరు: అంటే.. అంజును తీసుకెళ్తున్నారా..? అయితే వెంటనే ఈ విషయాన్ని మా ఆయనకు చెప్పండి ఫ్లీజ్ గుప్త గారు. నేను ఇక ఎక్కడికి వెళ్లను.. ఫ్లీజ్ ఈ ఒక్క సాయం చేయండి
విచిత్రగుప్త: నేను కూడా నీ లాగే చూడటం తప్ప ఏమీ చేయలేను బాలిక.
అని విచిత్రగుప్త చెప్పగానే.. ఆరు తనే ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంది. మరోవైపు భాగీని తీసుకుని ఇంటికి వచ్చిన అమర్.. హ్యాపీయా అని అడుగుతాడు.
భాగీ: చాలా అంటే చాలా హ్యపీగా ఉంది. మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు
అమర్: థాంక్స్ చెప్పొద్దు నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు ఈ ఇల్లు పిల్లలు అడ్డు రాకూడదు.. ముందు ఎలా ఉండేదానివో అలాగే ఉండు.
భాగీ: నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీకు కనిపించడం లేదా..? మీకు తెలియడం లేదా..? నేను హ్యాపీగా ఉండాలంటే నేను ఎక్కడికో వెళ్లి ఏదో చేస్తేనే రాదు.. ఈ ఇంట్లో మీ పక్కనే ఉంటే నాకు హ్యాపీ వస్తుంది.
అంటూ అమర్ కళ్లల్లోకి చూస్తుంది. అమర్, మిస్సమ్మ చేతులు పట్టుకుని కళ్లల్లోకి చూస్తుంటాడు. రూంలోంచి మనోహరి వస్తుంది. ఇద్దరిని అలా చూసి తిట్టుకుంటుంది. నిర్మల, శివరాం చూసి హ్యాపీగా ఫీలవుతారు. మనోహరిని తిట్టుకుంటూ వెళ్లి అమర్‌ను పలకరిస్తారు.
శివరాం: అమర్ ఉదయం చేసిన పచ్చడి భలేగా ఉంది.
మనోహరి: అమర్ పొద్దున్నే అనగా వెళ్లారు ఎక్కడికి వెళ్లారు
భాగీ: అయనకు తెలిసిన వాళ్లను కలవడానికి తీసుకెళ్లారు మనోహరి గారు.
మనోహరి: ఓహో నువ్వేదో భాగీకి బుల్లెట్ నేర్పిస్తున్నావేమో అనిపిస్తుంది.
అమర్, భాగీ షాక్ అవుతారు. ఇంతలో పిల్లలు వస్తారు. వాళ్లను డిన్నర్ చేశారా అని అమర్ అడుగుతాడు. చేశామని అంజు చెప్తూ రణవీర్ సిటీలోకి వచ్చాడట అని చెప్తుంది. ఆ విషయం నీకెలా తెలుసని అమర్ అడగ్గానే.. మనోహరి చెప్పిందని అంజు చెప్తుంది. దీంతో మనోహరి టెన్సన్ పడుతుంది. ఇంతలో రాథోడ్ వచ్చి అర్జెంట్ మెసేజ్ వచ్చింది సార్ అంటూ లెటర్ ఇస్తాడు. అది చూసిన అమర్.. వచ్చే వారం జరగాల్సిన మీటింగ్ రేపే ఉందట. ఇంకో గంటలో మాకు ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్‌కు నేను రాథోడ్ డిల్లీ వెళ్లాలి అని అమర్ చెప్పి రెడీ అవ్వడానికి పైకి వెళ్తాడు. వెంటనే తన రూంలోకి వెళ్లి విషయం రణవీర్‌కు ఫోన్ చేసి చెప్పి రేపే వచ్చి అంజును తీసుకెళ్లు అంటుంది. రణవీర్ సరే అంటాడు. ఇక యమలోకంలో ఉన్న ఆరు కోపంగా యముడిని నిద్ర లేపుతుంది. యముడు కోపంగా అరవడంతో వెళ్లి గుప్త చాటున్న దాక్కుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!