Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు ఫోటో చూసిన భాగీ షాక్ అవుతుంది. ఈ ఫోటో ఇక్క డ ఉండటమేంటి? అని భయంతో అడుగుతుంది. తాను ఆరుతో మాట్లాడిన విషయాలు.. ఆరు కోసం తాను కొడైకెనాల్‌ వెళ్లిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. చెప్పండి ఈ ఫోటో ఇక్కడ ఉందేంటి అని గట్టిగా అడుగుతుంది భాగీ.


శివరాం: ఏంటి మిస్సమ్మ కొత్తగా అడుగుతున్నావు అక్కడ ఉన్నది ఈ ఇంటి పెద్ద కోడలి ఫోటో..


భాగీ:  ఆ ఫోటోలో ఉన్నది ఆరు అక్కేనా..?


అమర్‌: అవును మిస్సమ్మ.. ఎందుకు అలా అడుగుతున్నావు.


నిర్మల: ఆ ఫోటో నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు కదా మిస్సమ్మ..


భాగీ: చూడటం కాదు అత్తయ్యా మాట్లాడుతున్నాను కూడా


రాథోడ్‌: ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ.. నెలల ముందు చనిపోయిన మా మేడంతో నువ్వు రోజు మాట్లాడుతున్నావా..?


అంజు: అవును మిస్సమ్మ నువ్వు జోక్‌ చేయకు


భాగీ: అయ్యో అంజు నేను జోక్‌ చేయడం లేదు. ఇలాంటి విషయాలు నేను జోక్‌ చేయలేను.. అసలు రోజు నాతో మాట్లాడే పక్కింటి అక్క.. ఆరు అక్కా ఒక్కరే ఎలా అయ్యారు..?


అమర్‌: ఏంటి మిస్సమ్మా నువ్వు చెప్పేది.. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన పక్కింటి అక్కా నా ఆరునా..? మిస్సమ్మ ఫ్లీజ్‌ నిజం చెప్పు..


భాగీ: నిజమండి నేను చెప్పేది..


అంజు: నా బర్తుడేకు హ్యాపీ ప్యారెట్‌ ఇవ్వడం.. నాకు అమ్మకు మాత్రమే తెలిసినవి పక్కింటి అక్కకు తెలిసింది అని చెప్పడం పక్కింటి అక్క గురించేనా..


అమ్ము: నేను నిన్న చూసినప్పుడు నువ్వు మాట్లాడింది కూడా మా అమ్మతోనేనా..?


భాగీ: అవునని అమ్ము.. ఇన్ని రోజులు అక్క ఈ ఇంటి చుట్టు ఎందుకు తిరుగుతుంది. ఈ ఇంటికి కష్టమొస్తే ఆవిడకు ఎందుకు కన్నీళ్లు వచ్చాయో.. ఇప్పుడు నాకు అర్థం అయింది. మీరు ప్రమాదంలో పడ్డ ప్రతిసారి ఆవిడ ఎందుకు ప్రత్యక్షమయ్యేదో ఇప్పుడు అర్థం అయింది. మీకోసమే వచ్చేది..మీ మీద ప్రేమతోనే అక్క వచ్చేది మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చేది.


నిర్మల: అసలు అరుంధతి నీకు కనిపించడం ఏంటి మిస్సమ్మ


భాగీ: ఏమన్నారు అత్తయ్యా


నిర్మల: అదేనమ్మా అరుంధతి నీకు కనిపించడం ఏంటని..?


భాగీ: ఏంటి ఆరు అక్కా పూర్తి పేరు అరుంధతియా..


భాగీ: నేను కొడైకెనాల్‌ వచ్చి కలవకుండా పోయింది ఈ అక్కనేనా..?


అమర్‌:  అవును మిస్సమ్మ


అంజు: నువ్వు మా అమ్మను కలవడానికి కొడైకెనాల్ ఎందుకు వచ్చావు.. అంటే మా అమ్మ ఎంతగానో అభిమానించే ఆర్‌జే భాగీ అంటే మీరేనా..?


భాగీ: అవును..


రాథోడ్‌:  అవును మిస్సమ్మ  ఆరు మేడం ఫోటో ఇప్పుడే చూశాను అన్నావు. ఇంతకు ముందు ఎప్పుడో మేడం ఫోటో చూశానన్నావు


భాగీ: అప్పుడు నాకు మనోహరి గారు ఎవరిదో ఫోటో చూపించి అదే ఆరు అక్కా ఫోటో అని చెప్పింది. అప్పటి నుంచి ఆవిడే ఆరు అక్కా అనుకున్నాను.


అమర్‌ : ఆరు ఫోటో అడిగితే వేరే వాళ్ల ఫోటో చూపించిందా..? మనోహరి.. మనోహరి: ఏమైంది అమర్‌ ఎందుకు అలా అరుస్తున్నావు..


అమర్‌: మిస్సమ్మ, ఆరు ఫోటో అడిగితే వేరే వాళ్ల ఫోటో చూపించావా..? చెప్పు మనోహరి.


మనోహరి:  చెప్తాను అమర్‌.. చెప్తాను..


నిర్మల:  చెప్పమ్మా ఏ దురుద్దేశంతో మిస్సమ్మకు వేరే ఫోటో చూపించావు


మను: మిస్సమ్మ తను మాట్లాడుతుంది ఆరుతో అని నిజం తెలియకూడదని అలా చెప్పాను


అని మనోహరి చెప్పగానే అమర్‌ కోపంగా మనోహరి చెంప పగులగొడతాడు. వెంటనే మనోహరి నిద్రలోంచి ఉలిక్కి పడి లేస్తుంది. అయ్యో ఇదంతా కలా అనుకుంటుంది. ఇంతలో బయట నుంచి ఏవేవో అరుపులు వినిపిస్తుంటే బయటకు వచ్చి ఏమైంది అమర్‌ అని అడుగుతుంది. ఏమైంది అంటావేంటి మనోహరి ఇంట్లో ఇంత మందిమి ఉన్నాయి అయినా ఆరు ఆస్థికలు కనిపించడం లేదు అంటాడు దీంతో మనోహరి షాక్ అవుతుంది. కట్‌ చేస్తే ఘోర పూజలు చేస్తుంటాడు. మనోహరి కోపంగా వచ్చి ఆరు ఆస్థికలు ఎందుకు దొంగిలించావు. అమర్‌ కంట్లో పడి ఉంటే పరిస్తితి ఎలా ఉండేది అని తిడుతుంది. ఆస్థికలు నేను తీసుకురాలేదని ఘోర చెప్తాడు. అమర్‌ కు దొరికితే ఎలా ఉంటుందో నాకు తెలుసు మనోహరి అటువంటప్పుడు నేను ఎలా ఇంట్లోకి రాగలను అంటాడు ఘోర. మనోహరి మరింత షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!