Nindu Noorella Saavasam Serial Today Episode:  ఇంట్లో అందరూ అంజు కోసం వెతుకుతుంటే అంజు మాత్రం రామ్మూర్తి దగ్గరకు వెళ్తుంది. ఒక్క దానవి ఎలా వచ్చావని రామ్మూర్తి అడిగితే.. ఇందాక డాడీ వచ్చినప్పుడు వచ్చాను తర్వాత డాడీతో వెళ్లలేదు అని చెప్తుంది. ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తున్న రామ్మూర్తిని అంజులో ఉన్న ఆరు ఓదారుస్తుంది. దగ్గరకు వచ్చి రామ్మూర్తిని హగ్‌ చేసుకుంటుంది. ఆరునే తనను హగ్‌ చేసుకుందేమోనని ఫీల్‌ అవుతుంటాడు రామ్మూర్తి.

అంజు: ఇప్పటికే చాలా ఏడ్చారు.. ఇంక ఏడ్వకండి.. నేను ఎక్కడికి వెళ్తాను.. మీ పక్కనే ఉన్నాను నాన్నా

మాటకు రామ్మూర్తి షాక్‌ అవుతాడు.

అంజు: ఏమైంది తాతయ్యా ఎంటలా చూస్తున్నారు.

రామ్మూర్తి: మీ అమ్మలా అనిపిస్తే చూస్తున్నాను

అంజు: ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే.. అలా  చెప్పాలనిపించింది తాతయ్య.

రామ్మూర్తి: ఇదే మాట నా పెద్దకూతురు నోట వినాలని ఉంది అమ్మా కానీ ఎలా

( అని మనసులో అనుకుంటాడు రామ్మూర్తి.)

అంజు: మీరు మైండ్‌ లో ఉన్నదంతా పక్కన పెట్టి ఇవాళంతా నేను చెప్పేది వినాలి.

రామ్మూర్తి: సరేలే అమ్మా ముందు ఇంటికి వెళ్దాం పద

అంజు: నేను చెప్పినట్టు వినమని చెప్పా కదా..? రేపు కాశీకి వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా అమ్మకు ఫాదర్‌ లాంటి వాళ్లు కాబట్టి మా అమ్మకు ఒక చీర కొని ఫోటో దగ్గర పెడతారా..? ఏంటి తాతయ్యా మా అమ్మకు చీర కొనరా..?

రామ్మూర్తి: ఎందుకు కొననమ్మా కొంటాను.. మంచి చీర కొంటాను.. నా కష్టార్జితంతో కొంటాను

అని రామ్మూర్తి, అంజు కలిసి బయటకు వెళ్తారు. బయట ఘోర అంత చూస్తూ.. అంజు వాళ్లను ఫాలో అవుతాడు. ఇంటి దగ్గర అందరూ కంగారుగా అంజు కోసం వెతుకుతుంటారు. అంజు కనిపించకపోయే సరికి అమర్‌, రాథోడ్‌.. అంజును వెతకడానికి బయటకు వెళ్తారు.  గుప్త కంగారు పడుతుంటాడు. ఇంతలో మనోహరి అనుమానంగా ఘోరకు ఫోన్‌ చేస్తుంది.

మనోహరి: ఘోర అంజును నువ్వు కిడ్నాప్‌ చేశావా..?

ఘోర: ఎందుకు అడుగుతున్నావు మనోహరి

మను: ఎందుకంటే అంజు ఇంట్లో లేదు.. కనిపించడం లేదు

ఘోర: అంతమంది ఉన్న ఇంట్లోకి అందరి కళ్లు కప్పి వచ్చి నేను తీసుకెళ్లగలను అనుకుంటాన్నావా..?

మను: కరెక్టే అమర్‌ కూడా పొద్దుటి నుంచి ఇంట్లోనే ఉన్నాడు.. మరి అంజలి ఎక్కడుంది

మను: ఎక్కడైనా ఉండొచ్చు.. ఇంట్లో ఉండొచ్చు.. బయట ఉండొచ్చు..  నా కళ్ల ముందు కూడా ఉండొచ్చు

మను: ఏం మాట్లాడుతున్నావు ఘోర నువ్వు అంజలిని కిడ్నాప్‌ చేశావు కదూ.. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా..? నువ్వు తన పిల్లలను ముట్టుకున్న ప్రతిసారి అమర్‌ నిన్ను ఎలా వెంటాడాడో మర్చిపోయావా..?

ఘోర: నువ్వేం కంగారు పడిపోకు మనోహరి .. నేను ఇంకా అంజలిని కిడ్నాప్‌ చేయలేదు.. అలా అని సంబరపడిపోకు ఇంకాసేపట్లో అంజలిని కిడ్నాప్‌ చేయబోతున్నాను.. మూడడుగుల దూరంలో ముచ్చటగా ఉంది నా ఆత్మ.  టైం వేస్ట్‌ చేసేంత టైం లేదు మనోహరి

అని ఫోన్‌ కట్‌ చేస్తాడు ఘోర. రామ్మూర్తి, అంజును తీసుకుని స్వీట్ షాపుకు వెళ్లి స్వీట్లు కొనిస్తాడు. తర్వాత బట్టల షాపుకు వెళ్లి చీరలు చూస్తుంటాడు. ఇంతలో భాగీ ఫోన్‌ చేసి అంజు గురించి అడుగుతుంది. తను నా పక్కనే ఉంది. ఇంట్లో చెప్పే వచ్చానంది అందుకే నేను మీకు ఫోన్‌ చేయలేదు. ఇప్పుడు ఇద్దరం బట్టల షాపులో ఉన్నామని  చెప్తాడు రామ్మూర్తి. భాగీ ప్రశాంతంగా హ్యాపీగా అమర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్తుంది. అయితే నేనే అక్కడికి వెళ్లి వాళ్లను తీసుకుని ఇంటికి వస్తానని చెప్తాడు అమర్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!