Nindu Noorella Saavasam Serial Today February 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అనామికగా మారిపోయిన ఆరు – ఆయా గురించి ఆలోచిస్తున్న భాగీ
Nindu Noorella Saavasam Today Episode: ఆరు ఆత్మను తీసుకెళ్లి చిత్రగుప్తుడు ఆనామిక శరీరంలో ప్రవేశపెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి కోసం ఎదురు చూస్తుంటాడు కాళీ. తాను రాగానే తాళి కట్టాలని రెడీగా ఉంటాడు. అదే విషయం మంగళకు చెబితే సొంత ఫ్రెండునే చంపింది ఆ మనోహరి అలాంటిది నువ్వు తాళి కడితే ఊరుకుంటుందా..? అని భయపడుతుంది మంగళ. కానీ మనోహరిని నేను పెళ్లి చేసుకున్నట్టు అమరేంద్రకు తెలిస్తే ఆ మనోహరి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు అక్కా అంటాడు కాళీ. మరోవైపు చిత్రగుప్తుడు ఆరును తీసుకుని అనామిక ఉన్న దగ్గరకు వెళ్తాడు.
ఆరు: మిస్టర్ చిత్రగుప్తా.. మీరు నాకు హ్యాండిచ్చి.. నన్ను యమలోకం తీసుకుపోవడం లేదు కదా
చిత్రగుప్త: అనుమానం ముందు పుట్టి.. తర్వాత మానవులు పుట్టారని నా పితృదేవులు చెప్తుంటే నేను నమ్మలేదు. కానీ నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. బాలిక తమరి కోసం నేను ఇంతటి సాహసానికి ఒడిగడితే మీరు నన్నే అనుమానించుచుంటిరే
ఆరు: ఆపండి మిస్టర్ గుప్త గారు.. మీ మాటలు ఎవరైనా వింటే మీరు నిజంగా గొప్ప వ్యక్తి అనుకుంటారు.
చిత్రగుప్త: ఇందులో నా స్వార్థం కూడా ఉన్నది బాలిక.
ఆరు: అవును నాకు తెలుసులే మీరు ఇదంతా నాగమణి కోసం చేస్తున్నారని నాకు తెలుసు
చిత్రగుప్త: బాలిక మనం చేరవలసిన ప్రదేశం అదే
అంటూ అనామిక సూసైడ్ చేసుకుంటున్న ఇంటికి తీసుకెళ్తాడు. అనామికను చూసి ఆరు ఎమోషనల్ అవుతుంది. ఇంతలో అనామిక సూసైడ్ చేసుకుంటుంది. వెంటనే ఆరు ఆత్మను ఆమె బాడీలోకి ప్రవేశపెడతాడు చిత్రగుప్త. అదే టైంలో ఇంట్లో భాగీ పూజ చేస్తుంది. నిర్మల ఆరు ఫోటోకు బొట్టు పెడుతుంది. శివరాం హాల్లో పేపర్ చదువుతుంటాడు. పెద్దగా గాలి వీస్తుంది. ఆరు ఫోటో ముందు ఉన్న దీపం ఆరిపోతుంది. ఫోటోకు ఉన్న పూల దండ తెగిపోతుంది. పూజగదిలో దీపం ఆరిపోతుంటే భాగీ చేతులు అడ్డుపెడుతుంది. తర్వాత హాల్లోకి వస్తుంది.
శివరాం: ఏంటమ్మా ఇది ఉన్నట్టుండి గాలి వీచింది.
భాగీ: అదే అర్థం కావడం లేదు మామయ్య దీపం కూడా కొండెక్కబోయింది. ఇందాకటి నుంచి మనసంతా అలజడిగా ఉంది. ఏదో జరుగుతున్నట్టు ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి.
నిర్మల: భయపడాల్సిన అవసరం లేదు మిస్సమ్మ.. జరగబోయేదంతా మంచిదేనని ఆ పరమేశ్వరుడు సంకేతాన్ని పంపాడు.
శివరాం: ఏంటి నిర్మల నువ్వు చెప్పేది.
నిర్మల: అవునండి రేపుటి శివరాత్రి శివతాండవానికి శివయ్య సన్నాహాలు మొదలుపెట్టాడు అనిపిస్తుందండి.
అని చెప్తుంది. మరోవైపు అనామిక బాడీలోకి వెళ్లిన ఆరు మెల్లగా కళ్లు తెరుస్తుంది. నిద్రలోంచి లేచినదానిటా అటూ ఇటూ చూస్తుంది. అన్ని టాబ్లెట్స్ వేసుకున్నా నేను చనిపోలేదా అని చూస్తుంది. చిత్రగుప్తుడు ఎంత పిలిచినా అనామికకు వినబడదు. చిత్రగుప్త షాక్ అవుతాడు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఏం జరిగిందో యమపురికి వెళ్లి తెలుసుకోవాలి అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు కాళీ దగ్గరకు కోపంగా వెళ్తుంది మనోహరి. ఇవాళ నా చేతుల్లో అయిపోయావురా అనుకుంటూ దగ్గరకు వెళ్తుంది.
మనోహరి: ఎంత ధైర్యం ఉంటే నన్నే బెదిరిస్తావురా నువ్వు ( కొట్టబోతుంది)
మంగళ: మనోహరి ఆగు ఏంటి ఈ కోపం నా తమ్ముణ్ని చంపేస్తావా ఏంటి..?
మనోహరి: ఏయ్ నాకొచ్చే కోపానికి నీ తమ్ముణ్నే కాదు నిన్ను కూడా చంపేస్తాను. రేయ్ చెప్పరా ఎంత కావాలి నీకు
కాళీ: ఎంత కావాలని కాదు మనోహరి.. ఏం కావాలని అడుగు.
మనోహరి: సరే చెప్పు ఏం కావాలి..?
కాళీ: పెళ్లి కావాలి. నీ వల్ల నా పెళ్లి ఆగిపోయింది. చిన్నప్పటి నుంచి భాగీని ఎంతో ప్రేమించాను. కానీ నీవల్లే భాగీతో నా పెళ్లి ఆగిపోయింది.
మనోహరి: అయితే ఏం చేయాలి ఇప్పుడు ఒక అమ్మాయిని వెతికి నీకు పెళ్లి చేయాలా..?
కాళీ: లేదు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు
మనోహరి: ఏమన్నావు…? మనోహరి ఎంత ధైర్యం ఉంటే నన్నే పెళ్లి చేసుకుంటాను అంటావురా..? నాకు ఇంతకు ముందే పెళ్లి అయింది తెలుసా..?
కాళీ: తెలుసు.. కానీ కలిసి లేరు కదా..?
మనోహరి: నువ్వు నా మెడలో తాళి కడితే నా మాజీ మొగుడు నిన్ను జైలుకు పంపిస్తాడు. అలా కాకుండా రణవీర్‌ను నువ్వు చంపేసిరా అప్పుడు పెళ్లి చేసుకుందాం. కోట్ల ఆస్తి వస్తుందు ఇద్దరం కలిసి అనుభవిద్దాం
అని మనోహరి చెప్పగానే కాళీ ఆలోచనలో పడిపోతాడు. కొంచెం దూరం వెళ్లాక మనోహరి ఒక్కదెబ్బకు రెండు పిట్టలు.. నువ్వు వాడిని చంపడానికి వెళ్తావు వాడే నిన్ను చంపేస్తాడు. తర్వాత జైలుకు వెళ్తాడు అని మనసులో అనుకుని అక్కడి నుంచివెళ్లిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన మనోహరిని కోపంగా భాగీ ఎందుకు దొరికినట్టే దొరికి మిస్ అయ్యావు అని అడుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!