Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరును ఎలాగైనా గీతలోంచి బయటకు వచ్చేలా చేసి తనను యమలోకానికి తీసుకెళ్లాలనుకుంటాడు గుప్త. అందుకోసం ఆరు దగ్గరకు వచ్చి తన మాటలతో రెచ్చగొడతాడు. నీ పిల్లలు ప్రమాదంలో ఉంటే నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. గీత దాటి బయటకు వస్తే నీకు ఏమైనా ప్రమాదం జరగుతుందని భయపడుతున్నావా అంటాడు.
ఆరు: గుప్త గారు మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు తెలుసు
గుప్త: నువ్వు నాకు తెలుసు అంటావు కానీ నీకేమీ తెలియదని నాకు తెలుసు
ఆరు: అన్ని తెలిసిన ధర్మ మూర్తులైన మీరే మౌనంగా ఉంటే నన్నేం చేయమంటారు.
గుప్త: ఇంత మాట్లాడుతున్నావు కానీ నీ పిల్లలను రక్షించుకోవడానికి వెళ్లడం లేదు.
ఆరు: నా పిల్లలను కాపాడటానికి మా ఆయన ఉన్నారు. మిస్సమ్మ ఉంది. ఇక నా పిలల్లకు ఏమీ కాదు.
గుప్త: నువ్వు ఈ రేఖ దాటి వెల్లెదవో లేక ఇక్కడే ఉండెదవో నీ ఇష్టం.
ఆరు: దేవుడు న్యాయాన్ని గెలిపిస్తాడు గుప్తగారు ఆ నమ్మకంతోనే నేను ఇప్పుడు ఈ రేఖను దాటుతున్నాను..
అని ఆరు ఒక్క ఉదుటున రేఖలోంచి బయటకు వచ్చి వెళ్లిపోతుంది. ఆరు వెళ్లడం చూసి గుప్త హ్యాపీగా యముడిని పిలిచి నాకన్నా ముందుగా ఆ బాలిక మన లోకానికి వస్తుంది అని చెప్తాడు. యముడు వచ్చి గుప్తను తిట్టి ఆ బాలిక అమావాస్య గడియల్లో గీత దాటిందని మన లోకానికి రాలేదని వచ్చే అమావాస్యలోపు ఎలాగైనా అ బాలికను తీసుకుని రమ్మని చెప్పి వెళ్లిపోతాడు యముడు. పిల్లలను బంధించిన రౌడీలు వాళ్ల చుట్టు గన్స్‌తో కాపలా ఉంటారు. పిల్లలందరూ భయపడుతుంటారు. అంజు మాత్రం భయం లేకుండా అందరినీ ఓదారుస్తుంది. మా డాడీ వస్తారు మమ్మల్ని కాపాడతాడు అని చెప్తుంది. మరోవైపు అరవింద్ ఆర్మీ ఆఫీసర్‌కు ఫోన్ చేస్తాడు.
అరవింద్: పిల్లలకు ఏమైనా అవ్వడం అవ్వకపోవడం అంతా మీ చేతుల్లోనే ఉంది. పిల్లలు ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం మీరు అమరేంద్రనే.. ఫస్ట్ టైం నేను కిడ్నాప్ చేసినప్పుడే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసి ఉంటే నా పని నేను చేసుకునే వాణ్ని..
ఆఫీసర్: అసలు నీకేం కావాలో అడుగు ఇస్తాం..
అరవింద్: మా వాళ్లందరినీ మాకు అప్పగించాలి. మేము ఇక్కడి నుంచి సేఫ్‌గా వెళ్లాలి ఆ అమరేద్రను ఒంటరిగా మా దగ్గరకు పంపించాలి.
ఆఫీసర్: అమర్ తప్పా అన్ని డిమాండ్ల నెరవేరుస్తాం..
అరవింద్ : లేదు ఆఫీసర్.. ఆ అమరేంద్ర నాకు ఫస్ట్ టైం ఓటమిని పరిచయం చేసిండు.. నేను తనకు మరణాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వాలి కదా..?
అని వార్నింగ్ ఇవ్వగానే ఆర్మీ ఆఫీసర్ కూడా అరవింద్ కు వార్నింగ్ ఇస్తాడు. ఫారెస్టులో ఆగి ఉన్న స్కూల్ బస్సు దగ్గరకు అమర్ వాళ్లు వెళ్తారు. బస్సును చూసిన మిస్సమ్మ బస్సులో పిల్లలు లేరని ఏడుస్తుంది. అమర్ మాత్రం రోడ్డు ఇక్కడితో ఎండ్ అయింది కాబట్టి పిల్లలను ఇక్కడి నుంచి బై వాక్ తీసుకెళ్లి ఉంటారని.. ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి మనకు చుట్టు పక్కలే పిల్లలు ఉండి ఉంటారు అనుకుంటూ రౌడీలు పిల్లలన తీసుకెళ్లిన రూట్లో వెళ్తుంటాడు. కొద్దిదూరం వెళ్లాక రౌడీల వ్యాన్ కనిపిస్తుంది. ఆ పక్కనే డేంజర్ స్నేక్ జోన్ కనిపిస్తుంది. మిస్సమ్మ ఏడుస్తుంది. అమర్ ఓదారుస్తూ పిల్లలను తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ భరోసా ఇస్తాడు. మరోవైపు అకాష్‌కు బయట పెద్ద పాము కనిపించడంతో స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!