Nindu Noorella Saavasam Serial Today Episode: బస్సు డ్రైవర్‌కు అమర్ ఫోన్ వివరాలు అడుగుతాడు. డ్రైవర్ ఫోన్ చేసింది అరవిందే అనుకుని బస్సు ఎక్కడ వెళ్తుంది.. ఎలా వెళ్లేది మొత్తం వివరాలు చెప్తాడు. డ్రైవర మాటలకు అమర్ షాక్ అవుతాడు. ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోతాడు. అమర్ అలా అయిపోవడం చూసిన శివరాం భయంగా ఏం జరిగింది అమర్ అని అడుగుతాడు. అమర్ పలకడు. నిర్మల కూడా భయంగా ఆ డ్రైవర్ పిల్లలను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అడుగుతుంది. అమర్ అలాగే చూస్తుండి పోతాడు. బస్సులో వెళ్తున్న డ్రైవరుకు అనుమానం వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. అందులో అమర్ నెంబర్ ఉండటంతో అరవింద్‌కు ఫోన్ చేస్తాడు. డ్రైవర్: అన్న కంగారులో అమర్ ఫోన్ లిఫ్ట్ చేశాను. మీరే అనుకుని అన్ని వివరాలు చెప్పాను. నేను అతనికి దొరికిపోయాను అన్న.
అరవింద్: ఓరేయ్ నా ప్లాన్ అంతా నాశనం చేశావు. ఇప్పుడెలా సరే దాబా దగ్గర బస్సు ఆపు రాజు వస్తాడు. ఆ తర్వాత నేను చెప్పినట్టు చేయండి.
డ్రైవర్: సరే అన్నా
అరవింద్: అమర్ చేతిలో నేను ఓడిపోకూడదు.. ఈసారి అమర్‌కు దొరికితే జీవితంలో బయటకు రాలేను.
అంటూ రాజుకు ఫోన్ చేసి దాబా దగ్గరకు బస్సు వస్తుంది. నువ్వు వెళ్లి ఆ బస్సు ఎక్కు అని చెప్తాడు. రాజ్ సరే అంటాడు. అమర్ లాప్ టాప్ తీసుకుని బస్సును ట్రాక్ చేస్తుటాడు. అందరూ భయంతో చూస్తుంటారు. మరోవైపు బస్సు దాబా దగ్గర ఆపగానే రాజు వచ్చి బస్ ఎక్కుతాడు.
ప్రిన్సిపాల్: ఏయ్ ఎవరు నువ్వు.. బస్సు ఎందుకు ఎక్కావు.
డ్రైవర్: మేడం వాడు మా వాడే
అని చెప్పి డ్రైవర్ బస్సు ఆపుతాడు.
ప్రిన్సిపాల్: ఏయ్ డ్రైవర్ బస్సును ఎందుకు ఆపావు..?
డ్రైవర్ సీట్‌లోంచి వచ్చి గన్ తీసి అందర్ని బెదిరిస్తాడు. రాజు కూడా గన్ బయటకు తీసి పిల్లలను బెదిరిస్తుంటాడు.
ప్రిన్సిపాల్: ఏం కావాలి మీకు
డ్రైవర్: ఈ బస్సులో ఇప్పటి నుంచి నేను చెప్పిందే వినాలి. ఈ బస్సులో బాంబు ఫిక్స్ చేశా.. ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే.. ఒక్క బటన్ నొక్కగానే అందరూ పోతారు.
అని బెదిరిస్తూ మళ్లీ వెళ్లి బస్ స్టార్ట్ చేస్తాడు. డ్రైవర్.. రాజును పిలుస్తాడు.
డ్రైవర్: మన మీద అమరేంద్రకు డౌటు వచ్చింది. మనం వీళ్లను మన ప్లేస్‌కు తీసుకెళ్లే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న తప్పటడుగు వేసినా అందరం దొరికిపోతాం
రాజ్: సరే అన్నా నేను చూసుకుంటాను.
అంటాడు. బస్సులో పిల్లలు భయంతో వణికిపోతుంటారు. మరోవైపు నిర్మల ఏడుస్తుంది.
నిర్మల: అసలు తప్పంతా మనదేనండి.. పిల్లలు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మనమే.. మిస్సమ్మ చెప్తున్నా వినకుండా పిల్లలను పంపించాం.
శివరాం: అవునే వాళ్ల వెనక ఇంత కుట్ర జరుగుతుందని తెలియక పంపించాం.
భాగీ: మామయ్యా పిల్లలు మారం చేస్తుంటే మీరేం చేస్తారు.
నిర్మల: ఇక నుంచి పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అమ్మగా మిస్సమ్మే తీసుకోవాలండి.. ఇలా తలా ఒకటి ఆలోచిస్తూ ఏది బడితే అది చేస్తూ పిల్లల ప్రాణానికే ప్రమాదం తీసుకొచ్చాం.
శివరాం: సరిగ్గా చెప్పావే.. తల్లి మనసు కాబట్టి ప్రమాదాన్ని ముందే పసిగట్టింది.
మనోహరి: ప్రతిసారి వీళ్లకు దీని భజన ఏంటో (అంటూ మనసులో అనుకుని) ఏంటి ఆంటీ ఒక్కసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా తెలుస్తుంది.
నిర్మల: నువ్వు ఊరుకోమ్మా… నువ్వే మధ్యలో వచ్చి పిల్లలను రెచ్చగొట్టి వెళ్లేలా చేశావు.
అంటూ నిర్మల తిడుతుంటే ఇంతలో అమర్ ఇంట్లోకి వచ్చి మీరేం భయపడకండి పిల్లలను సేఫ్‌గా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి వెళ్తుంటే భాగీ కూడా అమర్‌తో వెళ్తుంది. గుప్త దగ్గరకు వెళ్లిన ఆరు పిల్లలను ఎలాగైనా కాపాడండి అని ప్రాధేయపడుతుంది. గుప్త కాపాడలేను అని చెప్పడంతో అయితే నా పిల్లలను నేనే కాపాడుకుంటాను అని వెళ్తుంటే.. గుప్త మంత్రం వేసి ఆరును బంధిస్తాడు. బాలికా నువ్వు ఆ బంధనం దాటితే నేను నీ అనుమతి లేకుండానే మా లోకానికి తీసుకెళ్తాను అని చెప్తాడు. అయినా సరే ఆరు దాటడానికి ప్రయత్నిస్తుంది. బయటకు రాలేకపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!