Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌కు కాఫీ తీసుకొస్తానని కిచెన్‌లోకి వెళ్లిన మనోహరికి చుక్కులు చూపించాలకుంటుంది భాగీ. అందుకోసం కిచెన్‌లో షుగరు డబ్బాకు సాల్ట్‌ అని సాల్ట్‌ డబ్బాకు షుగరు అని రాసి పెడుతుంది. ఆరును తీసుకుని కిచెన్‌ దగ్గరకు వెళ్లిన భాగీ ఇప్పుడు లోపల జరిగే తమాషా చూడు అక్కా అంటుంది. మనోహరి కాఫీ పెట్టడం తమాషా ఏంటి మిస్సమ్మ.. తను మీ ఆయనకు దగ్గర అవ్వాలనుకుంటుంది. నువ్వేమో తమాషా అంటున్నావు అని హెచ్చరిస్తుంది. మీరు సైలెంట్‌గా చూడండి అక్కా మీ మాటలు మనోహరి వింటుంది అని భాగీ చెప్పగానే నా మాటలు నీకు తప్పా తనకు వినిపించవు అంటుంది ఆరు. ఎందుకలా నాకు మాత్రమే వినిపిస్తాయి అని భాగీ అడగ్గానే తను దూరంగా ఉంది. నువ్వు దగ్గరగా ఉన్నావు కదా అంటుంది ఆరు. ఇంతలో మనోహరి కాఫీ రెడీ చేసుకుని అందులో సాల్ట్‌ వేసుకుని తీసుకుని అమర్‌ దగ్గరకు వెళ్తుంది. భాగీ, ఆరు, గుప్త కిటికీ దగ్గరకు వెళ్లి చూస్తుంటారు. కాఫీ తాగిన అమర్‌ వెంటనే పక్కకు ఊసేస్తాడు.


భాగీ: అక్క ఇక కిటికీలోంచి నా ఫర్మామెన్స్‌ చూడండి.. ఏవండి..  అయ్యో ఏమైందండి  మీకేం కాలేదు.. కదా..? వాటర్‌ తాగుతారా..? ఒక్క నిమిషం.. ఏవండి ఈ వాటర్‌ తాగండి


అంజు:  ఎందుకలా అరిచారు డాడ్‌


అమర్‌: అది.. కాఫీ..


అంటూ అమర్‌ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివరాం కాఫీ తాగి ఉమ్మేస్తాడు.


శివరాం: ఈ కాఫీ పెట్టిన మాత ఎవరు…?


మనోహరి: నేనే అంకుల్‌ షుగర్‌ ఏమైనా తక్కువైందా..?


శివరాం:  షుగర్‌ ఏంటి కాఫీలో కాస్త ఉప్పు ఎక్కువైంది.. కాదు కాదు ఉప్పులో కాఫీ కాస్త తక్కువైంది.


మనోహరి: ఉప్పా.. ఉప్పు ఎందుకు ఉంటుంది..?


అమ్ము:  అది మీరే కదా ఆంటీ చెప్పాల్సింది..


మనోహరి: నేను షుగర్‌ అని రాసి ఉన్న బాక్స్‌ లోంచే తీసి షుగర్‌ తీసి వేశాను.


అమ్ము:  ఏంటి రాసి పెట్టి ఉంటే వేశారా..? ఆంటీ.. మీకు షుగరుకు సాల్ట్‌కు తేడా తెలియదా..?


శివరాం: అయినా నువ్వు అమర్‌కు కాఫీ ఇవ్వడం ఏంటి మనోహరి.. నీకు అమర్‌కు ఏంటి సంబంధం.. ఈ ఇంటికి నీకు  ఏంటి సంబంధం


నిర్మల: అయినా ఏంటి మిస్సమ్మ నువ్వు మీ ఆయన పనులు చూసుకోవాలి కదా… కడదాకా కలిసుండేది మీరైతే మధ్యలో రావడానికి మనోహరి ఎవరు..? అమ్మా మనోహరి నువ్వు మరోసారి రాకు.. నీ పేరు చెప్పి పనులు తప్పించుకోవాలని చూస్తుంది.


శివరాం:  మీ ఆంటీ చెప్పింది నిజమే మనోహరి. నవ్వు ఇక ఈ గది వైపు కూడా రాకూడదు..


అని శివరాం చెప్పగానే మిస్సమ్మ అందరినీ బయటకు వెళ్లమని చెప్తుంది. అందరూ వెళ్లిపోయాక మనోహరి దగ్గరకు వెళ్లి వార్నింగ్‌ ఇస్తుంది. నా కాపురంలో వేలు పెట్టాలని చూస్తే నీకు ఎలాంటి బుద్ది చెప్తానో తెలుసు కదా..? అయినా ఇది శాంపిల్‌ మాత్రమే ఇంకోసారి ఇలాంటి తలతిక్క వేషాలు వేయాలని చూస్తే తోక కట్‌ చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు గార్డెన్‌లో కూర్చుని భాగీ తెలివితేటలు, నిర్మల, శివరాంల యాక్టింగ్‌ గుర్తు చేసుకుని ఆరు ఆశ్చర్యపోతుంటే.. గుప్త  వచ్చి ఈ ఇంటికి పొంచి ఉన్న ప్రమాదం నీకు అవగతం అవ్వడం లేదు బాలిక అంటూ హెచ్చరిస్తాడు. ఎందుకు గుప్త గారు అలా మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ ఘోర వల్ల సమస్య ఉండేది. ఇప్పుడు ఘోర వెళ్లిపోయాడు కదా.. అంటుంది ఆరు. ఘోర వెళ్లిపోలేదని మళ్లీ ఏ క్షణంలోనైనా వస్తాడని గుప్త చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!