Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో సీమంతానికి తాను వెళ్లితే ఊరి వాళ్లు గుర్తు పడతారు కదా అన్న ఆరు ప్రశ్నకు సమాధానంగా గుప్త, ఆరును పంజాబీ అమ్మాయిలా మార్చేస్తాడు. అప్పుడు ఇద్దరూ కలిసి రామ్మూర్తి ఇంటికి వెళ్తారు.  

Continues below advertisement

గుప్త: చూచితివా బాలిక నీ సహోదరి సీమంతమునకు మీ తండ్రి ఎంతటి ఘనమైన ఏర్పాట్లు చేసేనో..

ఆరు: అవును గుప్త గారు నా విషయంలోనే ఆయన ఏమీ చేయలేకపోయారు. అందుకే ఆ లోటు తీర్చుకోవడం కోసం నా చెల్లికి అచ్చట ముచ్చట చేయాలనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది

Continues below advertisement

గుప్త: ఇటుల దూరంగా ఉండి సంతోషించుట ఏలా బాలిక. నీ సహోదరికి గంధము పూసి గాజులు తొడగి అక్షింతలు వేసి ఆశీర్వదింపుము వెళ్లుమ

ఆరు: గుప్త గారు నేను చనిపోయాను కదా..? నిన్నేమో ఊరందరికీ కుంకుమ బొట్టు పెట్టి మా చెల్లి సీమంతానికి ఆహ్వానం పలికాను. ఈ రోజు నా చెల్లికి గంధము, పసుపు పూయాలి.. ఇది తప్పు అవుతుందేమో కదా.?

గుప్త: ముమ్మాటికి కాదు బాలిక నీవు నిండు ముత్తైదువుగా మరణించితివి.. ఎప్పటికీ నువ్వు నిత్య సుమంగళివే.. అన్ని విధములా నీకు ఆ అర్హత ఉన్నది

ఆరు: అయితే ఓకే గుప్త గారు శుభమా అని మా చెల్లి సీమంతం చేసుకుంటుంటే చనిపోయిన నేను ఇక్కడికి రావడము అశుభమేమో అనుకున్నాను.. మీరు చెప్పాక సంతోషంగా ఉంది

గుప్త: అటుల ఏమీ లేదు బాలిక నీవా శంకలు వదిలి జరుగు శుభకార్యమును వీక్షించుము పద మేము కూడా నీతో వచ్చెదము

ఇద్దరూ ఇంట్లోకి వస్తుంటే గేటు దగ్గర నిలబడిన రామ్మూర్తి గమనిస్తాడు. దగ్గరకు రాగానే..

రామ్మూర్తి:  రండి అమ్మ రండి అమ్మ లోపలికి రండి. అమ్మా మీరు..?

ఆరు: మాది పక్కూరు అండి ఇలా వెళ్తుంటే.. ఇక్కడ సీమంతం జరుగుతుందని తెలిసి అమ్మాయిని ఆశీర్వదించాలని వచ్చాను

రామ్మూర్తి: చాలా మంచిది అమ్మ. నిండు ముత్తైదువులా మహాలక్ష్మీలా ఉన్నావు.. నీలాంటి సుమంగళి నా కూతురును ఆశీర్వదిస్తే.. నా కూతురు నా కూతురుకు పుట్టబోయే బిడ్డ చాలా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చూస్తుంటే.. ఎందుకో నా పెద్దమ్మాయి అరుంధతియే గుర్తుకు వచ్చింది. తను బతికి ఉంటే అచ్చం నీలాగే ఇలాగే నిండు ముత్తైదువులా ఉండేదమ్మా.. మీరు కొంచెం అటు ఇటుగా మా అమ్మాయి లాగే ఉన్నారు. అమ్మా మీరు తప్పకుండా భోజనం చేసి వెళ్లాలి.. ఈ పేద వాడి ఆతిథ్యం స్వీకరించే వెళ్లాలి.

ఆరు: అలాగే బాబాయ్‌ గారు.. నేను మీ కూతురినే అనుకోండి.. కార్యం జరిగే వరకు ఇక్కడే ఉండి తప్పకుండా భోజనం చేసి వెళ్తాను

రామ్మూర్తి:  చాలా సంతోషం అమ్మా ఈ సీమంతానికి ఇప్పటి వరకు రాని కల ఇప్పుడు వచ్చింది అమ్మ.. లోపలికి వెళ్లండి అమ్మ

ఇంతలో ఎవరో రామ్మూర్తిని పిలవగానే రామ్మూర్తి వెళ్లిపోతాడు. ఆరు ఏడుస్తూ ఉంటుంది.

గుప్త: బాలిక ఎందులకు ఆ కన్నీరు

ఆరు: ఇవి కన్నీళ్లు కాదు గుప్త గారు ఆనందబాష్పాలు నేను ఎవరో తెలియకపోయినా..? మా నాన్న నన్ను తన కూతురివే అన్నారు చాలా సంతోషంగా ఉంది

గుప్త: బాలిక నీ రాకతో ఈ సీమంతమునకే కల వచ్చింది అన్నారు.. మాకును సంతోషముగానే ఉన్నది..

ఆరు: అయ్యో గుప్త గారు మీ లాంటి గొప్ప వాళ్ల ముందు మా లాంటి మనుషుల సంతోషాలు ఏపాటివి చెప్పండి..

గుప్త: లేదు బాలిక మానవ సంబంధములలో ఏదో తెలియని ఆనందం ఉన్నది అది అనుభవించిన వారికే తెలియును తప్ప మరోకరికి తెలియుట సాధ్యం కాదు.. కానీ నీ వల్ల ఆ అనుబంధాలను ఆప్యాయతలను మేము అనుభవించుచున్నము పద బాలిక లోపలికి వెళ్దాం

అనగానే ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. లోపలికి వెళ్లిన తర్వాత అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఒకావిడ కార్యక్రమం మొదలు పెట్టండి అని చెప్తుంది. వెంటనే రామ్మూర్తి ఆరు దగ్గరకు వెళ్లి నా కూతురుకు మొదటి గాజు నువ్వే తొడగాలమ్మ ఆని చెప్తాడు. ఆరు వెళ్లి భాగీకి గాజులు తొడుగుతుంటే.. అమర్‌, భాగీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!