Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరుకు తన శక్తులేంటో చూపిస్తున్న చంభాకు ఎదురుదెబ్బ తగులుతుంది. ఆరు కూడా తన శక్తులతో చంభా శక్తులను ఓడిస్తుంది. దీంతో చంభా మరో శక్తిని ఆరు మీదకు ప్రయోగించబోతుంటే అప్పుడే అమర్, రాథోడ్ వస్తారు.
రాథోడ్: ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. అసలు లోపలికి ఎలా వచ్చావు.. ఎందుకు వచ్చావు..? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి..? మాటలు రావా నీకు ముందు బయటకు వెళ్లు వెళ్లమంటున్నానా..?
అమర్: (డబ్బులు ఇస్తూ.) ఇవి తీసుకుని వెళ్లు
చంభా డబ్బులు తీసుకోకుండా ఆరును కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాథోడ్: ఎవరో పిచ్చిదానిలా ఉంది సార్.. ( భయంగా ) సార్ ఆ వచ్చిన ఆవిడను చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది సార్.. అంజు పాపను కిడ్నాప్ చేయడానికి రణవీర్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయోమో సార్. అందుకోసమే ఈ లేడీని పంపించాడేమో సార్
అమర్: కంగారు పడకు రాథోడ్ ఆవిడ వచ్చిన రూట్స్ ద్వారా ట్రేస్ చేయమని చెప్పు. ఇంటి సీసీటీవీ పుటేజీ కూడా చెక్ చేయ్ నిజం ఏంటో తెలుస్తుంది.
అమర్ గార్డెన్ వైపు చూస్తాడు.
రాథోడ్: ఏంటి సార్ ఏమైంది అలా ఆగిపోయారు..?
అమర్: ఆరు.. రాథోడ్ ఆ వచ్చిన ఆవిడను చూస్తుంటే నాకెందుకో మాంత్రికురాలిలా అనిపిస్తుంది. ఆరు ఆత్మ ఇక్కడే ఉందని పంతులు గారు చెప్పారు కదా ఆరు ఆత్మ కోసం ఏమైనా వచ్చి ఉంటుందా..?
రాథోడ్: అవును సార్ నిజమే తన గెటప్ చూస్తుంటే.. తను మాంత్రికురాలిలాగే ఉంది
అమర్: ఇదివరకు ఘోరా వచ్చినట్టు ఇప్పుడు తను వచ్చి ఉంటుంది. ఆరు నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా..? నీకేం కాలేదు కదా (మనసులో అనుకుంటాడు.)
ఆరు: మీరు ఉండగా నాకేం అవుతుందండి
రాథోడ్: మీ ప్రేమే అరుందతి మేడంకు శ్రీరామ రక్ష సార్ పదండి
ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు.
గుప్త: ఈరోజు ఆ మాంత్రికురాలి నుంచి నిన్ను నీ పతిదేవుడే కాపాడినాడు. సమయమునకు అతగాడు రాకున్నచో ఆ దుష్ట మాంత్రికురాలి బారి నుంచి మేము కూడా నిన్ను రక్షించలేకపోయేవారము. నీ కుటుంబమే నీకు ఎప్పటికీ రక్షగా ఉండును
అని గుప్త చెప్పగానే ఆరు ఎమోషనల్ అవుతుంది. రణవీర్ ఇంటికి వెళ్లిన చంభా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది.
చంభా: ఆ ఆత్మకు శక్తులు ఉన్నాయి రణవీర్
రణవీర్: అదే మేము చెప్పింది
చంభా: మీరు చెప్పిన దానికన్నా.. నేను ఊహించిన దాని కన్నా ఎక్కువ శక్తులు ఉన్నాయి రణవీర్
రణవీర్: అయితే నిన్ను ఆ ఆత్మను బంధించలేవా..?
చంభా: అవుతుంది దాని భర్త రాకపోయి ఉంటే ఇందాకే దాని కథ ముగిసిపోయి ఉండేది. ఆఖరి నిమిషంలో అతను వచ్చి అంతా చెడగొట్టాడు
లాయరు: నీ మీద నమ్మకంతో నిన్ను రణవీర్ ఇక్కడికి పిలిపించాడు కదా చంభా నువ్వే ఏదో ఒకటి చేయాలి.
చంభా: చేస్తాను అది నా అహాన్ని దెబ్బకొట్టింది. దెబ్బకు దెబ్బ తీస్తాను. రేపు కాలాని ఆ ఇంటికి పంపిస్తాను. ఆ పువ్వులు తీయిస్తాను
రణవీర్: ఆ రూంలోకి వెళ్లడం అంత ఈజీ కాదని మనోహరి చెప్పింది కదా..?
చంభా: ఎలాగోలా కాలాని ఆ రూంలోకి పంపిచే ఏర్పాటు మనోహరిని చేయమని చెప్పు.. మిగతా పని కాలా పూర్తి చేస్తుంది
లాయరు: మనోహరి సాయం లేకుండా పాము ఆ రూంలోకి వెళ్లలేదా..?
చంభా: ఆత్మ శక్తి ఆ గది చుట్టూ రక్షణ కవచంలా ఉంటుంది. అది చేధించి కాలా లోపలికి వెళ్లాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరు సాయం చేయాలి.
రణవీర్: అలాగే నేను మనోహరితో చెప్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎలాగైనా సరే ఆ ఆత్మను బంధించు. ఆ తర్వాత నేను అంజలిని తీసుకుని కోల్‌కతా వెళ్లిపోతాను
చంభా: రణవీర్ ఇప్పటి వరకు నేను ఓడిపోయిందే లేదు..
అని మనోహరికి ఏం చేయలో ఎలా చేయాలో నేను చెప్తాను ఫోన్ చేయ్ అంటుంది. రణవీర్ ఫోన్ చేయగానే చంభా అంతా వివరిస్తుంది మనోహరి సరే అంటుంది. మరునాడు చంభా కాలాని పిలిచి అమర్ ఇంట్లోని ఆరు రూంలో ఉన్న పూలను నీ కాలకూట విషంతో వాడిపోయేలా చేయమని చెప్తుంది. చంభా చెప్పినట్టే కాలా అమర్ ఇంట్లోకి వెళ్తుంది. కిటికీ దగ్గర నుంచి అంతా గమనిస్తుంటారు ఆరు, గుప్త. కాలా ఆరు రూంలోకి వెళ్లగానే ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!