Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఆరు పక్కనే మిస్సమ్మ వచ్చి మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అని అడగ్గానే.. అవునని మధ్యాహ్నం నుంచి భయం పెరిగిపోతుందని ఆరు ఏడుస్తుంది. దీంతో మిస్సమ్మ.. ఆరును ఓదారుస్తుంది. ఇంకాసేపట్లో ఆయన అందరి పిల్లలను కాపాడబోతున్నారు. మీరు నిశ్చింతగా ఉండండి అక్కా మన పిల్లలకు ఏమీ కాదని మీస్సమ్మ చెప్పడంతో ఆరు షాక్ అవుతుంది. మన ఏంటి అని అడుగుతుంది. మీ పిల్లలు, మా పిల్లలు అని ఆరు చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు సీక్రెట్ ఆఫరేషన్ చేయడానికి రెడీ అవుతున్న అమర్, జేడీ స్కూల్ ప్రిన్సిపాల్ ను తమ రూంలోకి పిలుస్తారు. స్కూల్ లోకి ఎంటర్ కావడానికి ఎవరికీ తెలియని రూట్ ఉంటే చెప్పండని అడుగుతారు. క్యాంటీన్ వెనకాల నుంచి దారి ఉందని ప్రిన్సిపాల్ చెప్తుంది.
జేడీ: మనకు ఎంట్రీ పాయింట్ దొరికింది. నెక్ట్స్ మనకు వాళ్ల గురించి తెలియాలి. వాళ్లు సింగిల్ రూంలో ఉన్నారా? లేదా మల్టిపుల్ రూమ్స్ లో ఉన్నారా? అనేది తెలియాలి.
అమర్: అవును..
జేడీ: లోపల ఎన్ని రూమ్స్ లో ఉన్నారో తెలియాలి అంటే.. లోపల ఉన్నవాళ్లే మనకు చెప్పాలి. కానీ ఎలా చెప్పించాలి.
అమర్: ఎస్
అంటూ అమర్ ఒక ప్లాన్ చెప్తాడు. దీంతో జేడీ ప్లాన్ సూపర్ గా ఉంది. కానీ వాళ్లు ఇది నమ్ముతారా? అంజలి చేయగలదా? అని జేడీ అడగ్గానే అంజలి చేయగలదు నాకు నమ్మకం ఉంది. అని చెప్పగానే వాళ్లను నేను నమ్మిస్తాను అని ఫోన్ చేస్తుంది జేడీ. అమర్ చిన్న కూతురుకు అస్తమా ఉంది అని ఒక ఇన్ హేలర్ పంపిస్తాము తనకు ఇవ్వండి అని చెప్పగానే సరే ఆ అమ్మాయినే కనుక్కుంటాను ఒకవేళ ఆ అమ్మాయి మీరు చెప్పింది కాకుండా వేరే చెప్తే గిఫ్ట్ కింద అమర్ చిన్న కూతురుని పంపిస్తాను అని వెళ్లి అంజును నీకేదో ప్రాబ్లమ్ ఉందట కదా అని అడగ్గానే అంజు కొద్దిసేపు ఆలోచించి బ్రీతింగ్ ప్లాబ్లమ్ ఉంది అని చెప్తుంది. దీంతో అమర్, జేడీ ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత అమర్ మిస్సమ్మను లోపలికి తీసుకరమ్మని రాథోడ్‌కు చెప్తాడు. మిస్సమ్మ లోపలికి వస్తుంది.
అమర్: నేను లోపలికి వెళ్తున్నాను మిస్సమ్మ. నేను తిరిగి వస్తానో రానో తెలియదు కానీ పిల్లలు మాత్రం కచ్చితంగా తిరిగి వస్తారు. నేను ఉన్నా లేకున్నా అమ్మా నాన్న పిల్లలను నువ్వు చూసుకుంటావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను. ఆరు తర్వాత నాకా ధైర్యం ఇచ్చింది నువ్వే. ఇది చెప్పడానికే పిలిపించాను జాగ్రత్త… వెళ్దామా?
మిస్సమ్మ: ఏవండి ( అని ఏడుస్తూ వచ్చి అమర్‌ను హగ్ చేసుకుంటుంది.) ఏంటి పెద్ద హీరో లాగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పి వెళ్లిపోతున్నారు. అనవసరంగా ఏడిపించారు. ఇంకోసారి నేను రాను నువ్వే చూసుకోవాలి అంటే నిజంగా కొడతాను మిమ్మల్ని.
అమర్: అది కాదు నేను చెప్పేది.
మిస్సమ్మ: విన్నా అయినా మీరు రాకపోతే ఎవర్ని టార్చర్ పెట్టాలి. ఎవరితో గొడవ పెట్టుకోవాలి. ఇంకా ఏం చూస్తున్నారు వెళ్లి పిల్లల్ని తీసుకుని రండి
అని మిస్సమ్మ అనగానే అమర్ వెళ్లిపోతాడు. జేడీ, అమర్ వెళ్లి తీవ్రవాదులు ఉన్న రూం దగ్గర ఇన్ హేలర్ పెడతాడు. ఒక తీవ్రవాది వచ్చి అది తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు. ఇన్ హేలర్ తీసుకున్న అంజు అందులో ఇన్ఫర్మేషన్ చూసి రిప్లై ఇస్తుంది. తర్వాత జేడీ సిగ్నల్ లైట్ వేస్తుంది. దీంతో అంజు అమ్మో ఎలుక అని అరుస్తుంది. దీంతో జేడీ, అమర్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్: మిత్రను కాపాడినట్లు బిల్డప్ ఇచ్చిన మనీషా