Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరును యమలోకం తీసుకెళ్లడానికి పైనుంచి చిత్రగుప్తుడు వచ్చి గుప్తను పైకి పంపిస్తాడు. అప్పుడే ఆఫీసుకు వెళ్లడానికి బయటకు వచ్చిన అమర్‌ గార్డెన్‌లోకి చూస్తూ ఉండిపోతాడు.

రాథోడ్‌: సార్‌ ఎక్కండి సార్‌

అమర్‌: ఓకే పద రాథోడ్‌

అంటూ వెళ్లిపోతారు. ఆరు, అమర్‌నే చూస్తూ ఉంటుంది.

చిత్రగుప్త: చూచితివా బాలిక ఇందాక నీ స్నేహితురాలి చూపులో వెటకారం. నీ పతిదేవుని చూపులో మమకారం. నిన్ను చూస్తుంటే మాకు విచారం. మా మాటను విని ఈ గృహమును వీడి నువ్వు ఎచ్చటికైనా వెళ్లుము..

ఆరు: ఇది నా ఇల్లు గుప్త గారు. నా ఇల్లు వీడి నేను ఎక్కడికి వెళ్లను

చిత్రగుప్త: నీతో వచ్చిన చిక్కు ఇదే బాలిక మాతో యమపురికి రావు పోనీ మరొక్క చోటికి వెళ్లమనినా అచటికి వెళ్లవు.. నీ మంచి కోరే చెప్తున్నాను. వినినచో నువ్వు పదిలము.. లేనిచో ప్రమాదము

అంటూ చిత్రగుప్త చెప్పడంతో ఆరు నవ్వుతుంది. మరోవైపు స్కూల్‌ లో అందరూ ఏదో పని చేస్తూ ఉంటే అంజు మాత్రం విచారంగా కూర్చుని ఉంటుంది. ఇంతలో బంటి వస్తుంటాడు.

ఆకాష్‌: అరేయ్‌ ఆనంద్  ఆ బంటి గాడు వస్తున్నాడురా

ఆనంద్‌:  ఆగరా బంటి

బంటి: ఏంటి…?

ఆనంద్‌: ఎక్కడికి వెళ్తున్నావురా..?

బంటి: నీకెందుకు..?

ఆనంద్‌: మీ క్లాస్‌లో డెకరేట్‌ చేశావా..?

బంటి: నేను చేయను.. స్టూడెంట్ ప్రెసిడెంట్‌ నువ్వే కదా నువ్వు చేసుకో..

ఆనంద్‌: స్టూడెంట్‌ ప్రెసిడెంట్‌ నేనే కాబట్టే నీకు పని చెప్తున్నాను

బంటి: చేయకపోతే ఏం చేస్తావు

ఆనంద్‌: ప్రిన్సిపల్‌ మేడంకు చెప్తాను. క్లాస్‌రూం బయట మోకాళ్ల మీద కూర్చోబెడతారు

బంటి:  ఏమీ అవసరం లేదులే.. ఏం చేయాలో చెప్పు

ఆనంద్‌: మీ క్లాస్ లో ఐటమ్స్ ఉన్నాయి. వెళ్లి డెకరేట్‌ చేయ్‌

బంటి: సరే

అంటూ వెళ్లిపోతాడు బంటి.

అమ్ము: అరేయ్‌ వాడి జోలికి వెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాలిరా

ఆకాష్‌:  వాడికి అలాగే కావాలి అక్కా వాడు కానీ గెలిచి ఉంటే మనల్ని ఇంతకంటే ఎక్కువ టార్చర్‌ పెట్టేవాడు

ఆనంద్‌: అవును అక్కా నేను కాబట్టి వాడికి పని చెప్పి వదిలేశా..? అదే అంజు అయితేనా..? వాడి బెండు తీసి వదిలేసేది

అంటూ అందరూ డల్లుగా కూర్చున్న అంజును చూస్తారు.

అమ్ము:  ఏమైంది అంజు.. ఏమైంది అంటే మాట్లాడవేంటి అంజు

అంజు: నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు.. ఇంటికి వెల్లాలని ఉంది.

ఆకాష్‌: ఎందుకు అంజు

అంజు: ఎందుకో తెలియదు.. ఎందుకో భయంగా ఉంది

అమ్ము: భయం ఎందుకే ఓంట్లో ఏమైనా బాగాలేదా..?

అంజు: ఏం లేదు.. నేను బాగానే ఉన్నాను.. అమ్ము నాకేం కాలేదు..

ఆనంద్‌: మరి ఎందుకే భయం

అంజు: అదే తెలియడం లేదురా..? ఇంటికి వెల్లిపోవాలనిసిస్తుంది. డాడ్‌తో మాట్లాడాలి.

అమ్ము: అంజు ఇప్పుడే మనం స్కూల్‌కు వచ్చాం. అప్పుడే వెళ్లిపోతాం అంటే ప్రిన్సిపల్‌ మేడం ఏమంటుంది చెప్పు

అంజు: నాకు డాడ్‌తో మాట్లాడాలి అనిపిస్తుంది.

ఆనంద్‌: సరే అంజు మిస్‌ వస్తున్నారు కదా నేను ఫోన్ అడిగి తీసుకుంటాను.. డాడ్‌కు కాల్‌ చేసి మాట్లాడు

అని చెప్తుండగానే మిస్‌ దగ్గరకు వస్తుంది. ఆనంద్ ఫోన్‌ అడుగుతాడు. మిస్‌ ఫోన్‌ ఇస్తుంది. అంజు, అమర్‌కు ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ రాథోడ్‌ లిఫ్ట్‌ చేస్తాడు.  డాడీతో మాట్లాడాలని చెప్తుంది. అమర్‌ ఫోన్‌ తీసుకోగానే.. ఇంట్లో ఏదో జరుగుతుందని నాకు భయంగా ఉందని ఇంటికి వస్తానని అంజు చెప్పడంతో ఏం కాదులే అంజు నేను ఉన్నాను కదా నువ్వు స్కూల్లోనే ఉండు అంటూ రాథోడ్ కారు ఇంటికి తిప్పు అంటాడు అమర్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!