Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ పిల్లలను చూడాలని స్కూల్ లోపలికి వస్తాడు. మిస్సమ్మ అమర్ సార్ వచ్చారని పరుగెత్తుకెళ్తుంది. పిల్లలు కూడా పరుగెత్తుకొచ్చి అమర్ ను చూసి హ్యాపీగా ఫీలవుతారు. మాకోసమే వచ్చారా? అని పిల్లలు అడిగితే లేదని డ్యూటీ మీద వచ్చానని అమర్ చెప్పగానే పిల్లలు డల్‌గా ఫీలవుతారు. తర్వాత తనకు వర్క్ ఉందని అమర్ వెళ్లిపోతాడు. మిస్సమ్మ పిల్లలతో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అమర్ దగ్గరకు వెళ్తుంది.
అమర్: ఏమైంది మిస్సమ్మ ఎందుకు పరిగెత్తుకొచ్చావు.
మిస్సమ్మ: మీతో మాట్లాడటానికి వచ్చాను.
అమర్: చెప్పు ఏంటో..
మిస్సమ్మ: మీరు రాగానే పిల్లల కళ్లల్లో ఆనందం. మీరు వెళ్లిపోతున్నప్పుడు ముఖంలో బాధ. మీకు కనిపించవా అండి. కనిపించినా కనికరం లేకుండా వెళ్లిపోతున్నారా? ఆకాష్ ఎంత ఆశగా మిమ్మల్ని ఉండమని అడిగాడు. కనీసం కాసేపు ఉండి వెళ్లొచ్చు కదా?
అమర్: వాళ్లకు నా అవసరం లేదు మిస్సమ్మ.
మిస్సమ్మ: అది మీరెలా చెప్పగలరండి.
అమర్: నాకు తెలుసు కాబట్టి.
మిస్సమ్మ: తెలుసా? వాళ్ల పక్కన మీరుంటే వాళ్లకు వచ్చే ధైర్యం. ఎంతో మీకు తెలుసా?
అంటూ మిస్సమ్మ అడగ్గానే తెలుసని కానీ పక్కన నువ్వు ఉన్నావన్న ధైర్యం అందుకే వెళ్తున్నాను. పిల్లల పక్కన నువ్వు ఉంటే వాళ్ల అమ్మలా వాళ్లకు నా అవసరం లేకుండా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది అంటాడు అమర్. దీంతో నమ్మకం పెట్టుకున్నందుకు థాంక్స్ చెప్తుంది మిస్సమ్మ. అమర్ వెళ్లిపోతాడు. రాథోడ్ మిస్సమ్మను చూస్తుంటే మా సార్ నీకు మిస్సమ్మ నుంచి మిస్సెస్ గా ప్రమోషన్ ఇచ్చేలా ఉన్నాడని అంటాడు. మరోవైపు మనోహరి డబ్బులు తీసుకుని వచ్చి ఆజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేస్తుంది.
మనోహరి: హలో నువ్వు చెప్పిన ప్లేస్ కు వచ్చేశాను.
అజ్ఞాత వ్యక్తి: ఆ కనిపిస్తుంది. దిక్కులు చూడ్డం వల్ల నీకు ఉపయోగం లేదు మనోహరి. నీ ముందు ఒక చెత్తకుప్ప కనిపిస్తుంది కదా?
మనోహరి: ఆ కనిపించింది.
అజ్ఞాత వ్యక్తి: ఆ సూట్ కేసు అక్కడ పెట్టేసి నువ్వు అక్కడి నుంచి వెళ్లిపో..
మనోహరి: ఏయ్ సూట్ కేసు అక్కడ పెట్టేసి వెళ్లిపోవడం ఏంటి? నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నా కళ్ల ముందే నువ్వు ఆ వీడియో డిలీట్ చేయాలి.
అజ్ఞాత వ్యక్తి: ఏంటి మనోహరి వాయిస్ పెరుగుతుంది. నేను చెప్పింది చేయడం తప్పా ప్రశ్నించే హక్కు నీకు లేదు. కాదు కూడదు అంటే నేనేం చేస్తాను నీకు తెలుసు కదా?
అంటూ ఆ వ్యక్తి బెదిరించడంతో మనోహరి డబ్బుల అక్కడ పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత బుర్ఖా వేసుకున్న ఒక మహిళ ఆటోలో వచ్చి ఆ సూటుకేసు తీసుకెళ్తుంది. అంతా గమనించిన మనోహరి ఆటోకు అడ్డుగా వెళ్లి నిలబడుతుంది. మరోవైపు ఆకాష్ చెస్ అడుతుంటాడు. మిస్సమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని చెస్ లో గెలుస్తాడు. ఆనంద్ కూడా బాడ్మింటన్‌లో గెలుస్తాడు. అమ్ము స్పీచ్ విభాగంలో పాల్గొంటుంది. తన టాఫిక్ అమ్మ గురించి అని చెప్తుంది. తన అమ్మ గురించి గొప్పగా చెప్తుంది. దీంతో మిస్సమ్మ, అరుంధతి ఎమోషన్ అవుతారు. మరోవైపు ఆటోకు అడ్డుగా వెళ్లిన మనోహరి నుంచి ఆ బుర్ఖా వేసుకున్న వ్యక్తి తప్పించుకుని పారిపోతుంది. పారిపోయిన వ్యక్తిని పట్టుకుని బుర్ఖా తీసి చూసి షాక్ అవుతుంది. బుర్ఖాలో ఉన్నది మంగళ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'దృశ్యం' చిన్నారిని ఈ మధ్య గమనించారా..హీరోయిన్ గా ఆఫర్స్ కోసం వెయిటింగ్ అంటోన్న ఎస్తర్ అనిల్!