Nindu Noorella Saavasam Serial Today Episode:  ఘోర దగ్గరకు వెళ్లి మిస్సమ్మకు ఆత్మకు వాయనం ఇచ్చిన  విషయం చెప్తుంది మనోహరి.


మనోహరి: అసలు  చచ్చిన దాని స్పర్శ వీళ్లకు తెలియడం ఏంటి? ఒక ఆత్మ వచ్చి పూజలో కూర్చోవడం ఏంటి? అమర్‌తో కలిసి వ్రతం చేయడం ఏంటి? ఈ చెల్లెలేమో అక్కకి వాయనం ఇవ్వడం ఏంటి?


ఘోర: ఆత్మ విషయంలో నువ్వేం చెప్పినా.. నేనేం విన్నా ఆశ్చర్యపోను మనోహరి.


మనోహరి: ఏందుకు ఘోర


ఘోర: ప్రతి పౌర్ణమికి ఆ ఆత్మకు శక్తి వస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనుకున్నావు. ఆ ఆత్మకు దైవశక్తి తోడు అయ్యింది. మనం ఎదురువెళ్తుంది ఆత్మకే కాదు. పరమాత్రకు కూడా ఎదరు వెళ్తున్నాము. ఇవాళ సాక్ష్యాత్తు ఆ వరలక్ష్మీ దేవే దిగివచ్చి ఆ ఆత్మకు శక్తి ఇచ్చింది.


మనోహరి: అదేంటి ఘోర నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. ఇక ఆ ఆత్మ ఎప్పటికీ అక్కడి నుంచి వెళ్ళదా?


ఘోర: వెళ్తుంది. నీ నిజ స్వరూపం అందరికీ తెలిశాక, నువ్వు ఆ ఇంటిని  శాశ్వతంగా వదిలి వెళ్లాక ఆ ఆత్మ వెళ్లిపోతుంది.


మనోహరి: అది ఈ జన్మలో జరగదు. అమర్‌ ని నా సొంతం చేసుకునే వరకు ఆ ఇంటిని వదిలి వెళ్లను. అది నన్ను ఎలా చంపుతుందో నేను చూస్తాను.  


  అని మనోహరి చెప్పగానే ఘోర పెద్దగా  నవ్వుతాడు. దీంతో మనోహరి ఘోర ఎందుకు నవ్వుతున్నావని అడుగుతుంది. ఆ ఆత్మ నిన్ను చంపాలనుకుంటే మొదటి పౌర్ణమికే చంపేది. నువ్వు తనని శత్రువుగా చూసినా తను మాత్రం ఎప్పుడూ నిన్ను స్నేహితురాలిగానే చూసింది. ఆ మంచితనమే ఆ ఆత్మకు బలం అంటాడు ఘోరా. ఎంత కష్టమైనా సరే దాన్ని మాత్రం గెలవనివ్వను అంటుంది మనోహరి. మరోవైపు అమర్​ని పిలిచి స్వాతంత్య్ర దినోత్సవం రోజున సిటీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు మేజర్. సిటీలో ఎలాంటి సమస్య లేకుండా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతాయి, తానే దగ్గరుండి అన్నీ సవ్యంగా జరిగేలా చూసుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు అమర్​. స్కూల్లో స్వాతంత్య్ర దినోత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రన్సిపాల్‌


బంటీని పిలుస్తుంది.


ప్రిన్సిపాల్‌: ఓరేయ్‌ బంటి తినడం ఆపి ఆ అమ్ముని రన్నింగ్‌ రేస్‌ లో  ఎలా దెబ్బకొట్టాలో ఆలోచించు. రన్నింగ్ రేస్​లో అంజుని కొట్టేవాళ్లే లేరు, ఏదైనా అరెంజ్​మెంట్​ చేయమన్నా చేశావా?


బంటి: ఆల్రెడీ అన్నీ ప్లాన్ ​చేశాను మేడం.


అంజు:  అమ్మ లేకుండా పరుగు పందెంలో పాల్గొనాలంటే భయంగా ఉంది అమ్ము.


 అంటూ  ఏడుస్తుంది అంజు. అదంతా పక్కనే ఉండి గమనిస్తున్న ఆరు బాధపడుతుంది. పిల్లలంతా అంజుకి నచ్చజెప్పి పరుగుపందెంలో పాల్గొనడానికి ఒప్పించాలని ప్రయత్నిస్తారు. అమ్మ స్థానంలో మిస్సమ్మ ఉంది కదా అంటారు. ఇంకోసారి మిస్సమ్మని అమ్మతో పోల్చకు. అమ్మ స్థానాన్ని ఎప్పటికీ మిస్సమ్మ భర్తీ చేయలేదు అంటుంది అంజు. మరోసారి మిస్సమ్మను నమ్మి మోసపోను అంటుంది. భయపడుతూనే రన్నింగ్ రేస్​లో పాల్గొనడానికి వెళ్తుంది అంజు. ఒంటరిగా నిల్చుని భయపడుతున్న అంజు దగ్గరకు వెళ్లి భయపడొద్దని చెబుతుంది అరుంధతి. దగ్గరుండి పరుగు పందేనికి తీసుకుని వెళ్తుంది. అరుంధతి స్పర్శని అనుభూతి చెందిన అంజు సంతోషంగా వెళ్తుంది. పందెంలో హుషారుగా పాల్గొనేందుకు సిద్ధమైన అంజుని పక్కన ఉన్న పాపతో చెప్పి పడేలా చేస్తాడు బంటీ.


ప్రిన్సిపాల్‌: ఈ పొట్టిది అందరి ముందర ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం నా కళ్లతో నేను చూడాలి. ఈ ప్రిన్సిపాల్‌ తో చాలెంజ్‌ చేస్తే.. దాని పర్యావసానాలు ఎలా ఉంటాయో దానికి తెలియాలి.  


 అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పరుగుపందెం మొదలవుతుంది. బంటి పురమాయించిన పాప అంజును కింద పడేలా చేస్తుంది. అంజు కింద పడి అమ్మా అంటూ బాధపడుతుంది. ఇంతలో మిస్సమ్మ వచ్చి గట్టిగా అంజు అని పిలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ALSO READ: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేణు స్వామి... మహిళా కమిషన్‌లో ఫిర్యాదు వల్లనే జర్నలిస్టులపై ఆరోపణలా?