Nindu Noorella Saavasam Serial Today Episode:  అరుంధతిని కూడా పూజలో కూర్చోమంటుంది మిస్సమ్మ. అయితే ఆరు పక్కనే మనోహరి ఉండటంతో అందరూ మిస్సమ్మ, మనోహరికి చెప్తుంది అనుకుంటారు. అయితే తాము కూర్చుంటే వెనకాలే ఉన్న ఆరు ఫోటో మిస్సమ్మ చూస్తుందని భయపడుతూ ఆరు, మనోహరి కూర్చుంటారు. ఇంతలో గుప్త వారి వెనకే తోటమాలి వేషం వేసుకుని వచ్చి అక్కడి నుంచి ఫోటో తీసుకుని వెళ్లిపోతాడు. బయటకు వెళ్లిన గుప్తకు అమర్‌ ఎదురుగా వస్తాడు. దీంతో ఆరు ఫోటో పట్టుకున్న గుప్త భయంతో వణికిపోతుంటాడు.


అమర్‌ దగ్గరకు రాగానే గోడకు ఆనుకుని ఫోటో వెనక పెట్టుకుని నిల్చుంటాడు. అమర్‌ లోపలికి వెళ్లగానే రాథోడ్‌ వస్తాడు.


రాథోడ్‌: ఏంటి నోటితో సమాధానం చెప్పలేవా?


గుప్త: మీరు నోటితో అడగలేదు కదా?


రాథోడ్‌: అది సరే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లి చచ్చావు.


గుప్త : చచ్చిన వాళ్లను చేర్చాల్సిన చోటికి చేర్చి వచ్చితిని..


రాథోడ్‌: ఏంటి ఏదీ తిన్నగా సమాధానం చెప్పలేవా?


గుప్త: అంటే ఒక ముఖ్యమైన పని పడినది అందులకు వెళ్లితిని..


రాథోడ్‌: అయితే నువ్వు ఇక్కడ చేస్తుంది ముఖ్యమైన పని కాదా?


  అంటూ ఇద్దరి మధ్య చాలా ఫన్నీగా గొడవ జరుగుతుంది. ఇంతలో గుప్త చేతిలో ఉన్న ఆరు ఫోటో చూస్తాడు రాథోడ్‌. ఎందుకు ఈ ఫోటో అని అడగ్గానే శుభ్రం చేయడానికి అని గుప్త చెప్తాడు. మరోవైపు ఇంట్లోకి వెళ్లిన అమర్‌, పూలు తీసుకుని వస్తున్న మిస్సమ్మకు డాష్‌ ఇస్తాడు. దీంతో ఇద్దరూ తన్మయత్వంతో రొమాంటిక్ గా ఫీలవుతారు. నిర్మల, శివరాం చూసి నవ్వుకుంటారు. ఆరు, మనోహరి ఇరిటేటింగ్‌ ఫీలవుతుంటారు. తర్వాత అమర్‌ రెడీ అయి వచ్చి మిస్సమ్మతో కలసి కూర్చోని పూజ చేస్తుంటాడు. అమర్‌ పక్కనే కూర్చున్న ఆరు కూడా అమర్‌ చెయ్యి పట్టుకోగానే అమర్‌, ఆరును గుర్తు చేసుకుంటాడు. అరుంధతితో కలిసి పూజ చేసిన రోజులను గుర్తు చేసుకుంటాడు. ఇంతలో పూజ పూర్తవుతుంది.


నిర్మల: మిస్సమ్మ పూజ పూర్తయింది. అమర్‌ దగ్గర ఆశీర్వాదం తీసుకో..


మిస్సమ్మ: నన్ను ఆశీర్వదించండి..


పక్కింటావిడ: అత్తయ్య, మామలతో కూడా ఆశీర్వాదం తీసుకోండి.


నిర్మల: దీర్థాయుష్మాన్‌ భవ.. దీర్ఘ సుమంగళీ భవ..


ఆరు: భర్త కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని భర్త అక్షితలు వేస్తే పూజ పూర్తవుతుంది అంటారు కదమ్మా.. పూజ అయితే చేయగలిగాను. కానీ ఆయన కాళ్లకు దండం పెట్టి అక్షితలు వేయించుకునే అదృష్టం నాకు లేదు కదమ్మా..


నిర్మల: మిస్సమ్మ నువ్వు వెళ్లి ముత్తైదువలకు వాయనాలు తీసుకురా?


మిస్సమ్మ: అలాగే అత్తయ్యా..


 అంటూ మిస్సమ్మ లోపలికి వెళ్లగానే ఆరు వెళ్లి అమర్‌ కాళ్లకు దండం పెడుతుంది. అప్పుడే తన తలపై పడిన అక్షితలు దులుపుకుంటాడు అమర్‌ అవి వచ్చి ఆరు మీద పడతాయి. దీంత ఆరు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అమ్మవారికి మొక్కుతుంది. ఇంతలో మిస్సమ్మ వాయినాలు తెచ్చి ఒక్కొక్కరికి ఇస్తుంటే ఆరు అక్కడి నుంచి మిస్సమ్మకు కనిపించకుండా వెళ్లిపోతుంది. బయటకు వెళ్లిన ఆరు సంతోషంగా ఏడుస్తూ కూర్చుటుంది.


గుప్త: బాలికా..?


ఆరు: ఆయన్ని తాకాను కదా గుప్త గారు. ఆయనకి నా స్పర్శ తెలిసింది. జరుగుతుందంతా కలా నిజమా అనుమానంగా ఉంది గుప్త గారు.


గుప్త:  ఇది కల కాదు నిజమే అని నీ కన్నీళ్లే చెప్తున్నాయి కదా బాలిక. ఇంత ఆనంద సమయంలో సంతోషంగా ఉండకా? ఆ కన్నీళ్లేంటి బాలిక.


ఆరు: అలవాటై పోయింది గుప్త గారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నది నా కన్నీళ్లే గుప్త గారు.


  అంటూ ఆరు బాధపడుతుంది. దీంతో గుప్త ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఆ దేవుణ్ని ఎలా పూజించావు తల్లి అంటూ ఆరును మెచ్చుకుంటాడు. నీ అచంచలమైన భక్తికి మెచ్చి ఆ దేవుడు నీకు సాయంగా ఉన్నారని చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: కీర్తి సురేష్‌ స్టన్నింగ్‌ లుక్‌ - రెట్రో వాల్ట్‌ అంటూ శారీలో ఫోజులు, రాశిఖన్నా రియాక్షన్‌ చూశారా?