Guppedanta Manasu  Serial Today Episode:  మహేంద్రే తన తండ్రి అని తెలిసి కూడా ఇన్నాళ్లు తనకు వసుధార ఎందుకు చెప్పలేదని బాధపడతాడు మను. మహేంద్ర తనపై చూపించిన ప్రేమ నిజాన్ని దాచిపెట్టడానికే అయ్యుండొచ్చు అనుకుంటాడు. చివరికి నా కన్నతల్లే నన్ను మోసం చేసిందని ఎమోషనల్‌ గా ఫీలవుతాడు మను. తాను కూడా నిజం తెలియనట్టే ఉండాలని.. వారితోనే నిజం బయటపెట్టించాలని నిర్ణయించుకుంటాడు మను. మరోవైపు రిషి, వసుధార ఇంటికి వెళ్తుంటారు.


వసుధార: పతనమవుతున్న కాలేజీని నిలబెట్టడానికే మి‌మ్మిల్ని హ‌ఠాత్తుగా ఎండీగా ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది సర్‌.


రిషి: ఈ విష‌యం ఇంత‌టితో వ‌దిలేయ్‌ వసుధార.


 అని ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగానే కారుకు అడ్డుగా సరోజ వస్తుంది. సరోజను చూసిన రిషి వెంటనే కారు దిగి దగ్గరకు వెళ్లగానే మనం మన ఊరు వెళ్దాం పద బావ అంటూ చేయి పట్టుకుని లాక్కోళ్లడానికి ప్రయత్నిస్తుంది సరోజ.


రిషి: నేను రాలేను సరోజ. నేను ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.


సరోజ: ఈ దిక్కుమాలిన ఊళ్లో నీకు ఏం ప‌నులు ఉన్నాయి.


రిషి: అన్ని త‌ర్వాత చెబుతాను కానీ.. ఇక్కడికి నిన్ను ఎవ‌రు ర‌మ్మ‌న్నారు.


సరోజ: నీకోసమే  హైద‌రాబాద్ వ‌చ్చాను బావ.


ధనరాజ్‌: ఇంతకు ముందు నా కోసం వచ్చానన్నావు.


సరోజ: అమ్మమ్మ నిన్ను చూడాల‌ని క‌ల‌వ‌రిస్తుంది. ఆమెను చూడాల‌ని నీకు లేదా బావ. అమ్మమ్మ కంటే నీకు వ‌సుధార‌తో తిర‌గ‌డం ఎక్కువైందా?


 అంటూ వసుధారను తిడుతుంది సరోజ. రిషిని రమ్మని అడిగితే మీ నాన్నే డబ్బుల కోసం నన్ను ఇక్కడికి పంపించాడని ఏదైనా ఉంటే ఆయన్నే అడుగు అంటూ సరోజకు చెప్తాడు రిషి. మరోవైపు మను, అనుపమ దగ్గరకు వచ్చి తనకు రసగుల్ల తినాలని ఉందని.. అలాగే డిన్నర్‌లోకి ఆటూ కర్రీ అప్పడాలు చేయమని అడుగుతాడు. అయితే సేమ్‌ మహేంద్ర లాగే అడుగుతున్నాడేంటి అని అనుపమ అనుమానపడుతుంది.


మను: మ‌హేంద్ర‌ సార్‌ కు కూడా ఇవే స్వీట్‌, క‌ర్రీస్ ఇష్టం క‌దా అమ్మా. మా ఇష్టాలు, అభిరుచులు కూడా భ‌లే క‌లిశాయి.


 అంటూ గుడ్‌ న్యూస్‌ తెలిసినప్పుడు స్వీట్స్‌ తినాలని అనుపమకు రసగుల్లా తినిపిస్తాడు మను. మ‌రోవైపు మ‌హేంద్ర‌ కు పొల‌మారుతుంది. మిమ్మ‌ల్ని ఎవ‌రో త‌లుచుకుంటున్నార‌ని వ‌సుధార అంటుంది. మ‌రోవైపు మ‌హేంద్ర కూడా త‌న‌కు ఇష్ట‌మైన ర‌స‌గుల్లా తింటుంటాడు.


మహేంద్ర: రిషి తిరిగి రావ‌డం ఆనందంగా ఉంద‌మ్మా.. అందుకే స్వీట్ తినాల‌ని అనిపించింది.


వసుధార: మిమ్మ‌ల్ని సంతోష‌పెట్టే నిజం కావ‌చ్చు..మీ గ‌తాన్ని ప‌రిచ‌యం చేసే బంధం ఏదైనా కావొచ్చు మామయ్య.


 అంటూ మను గురించి ఇన్‌డైరెక్టుగా మాట్లాడుతుంది వసుధార. మరోవైపు


ఎండీ సీట్ చేజారిపోవ‌డంతో శైలేంద్ర బాధపడుతుంటాడు. ఇంతలో దేవయాని వచ్చి శైలేంద్రను తిడుతుంది.


దేవయాని: ఎన్నో ఎళ్ల క‌ల ఒక్క రోజులో  చెడ‌గొట్టావు..నా క‌డుపున చెడ‌బుట్టావు. ఒక్క ప‌ని స‌రిగ్గా చేయ‌డం చేయ‌డం చేత కాదు. నిన్ను న‌మ్ముకున్నందుకు న‌న్ను నేను కొట్టుకోవాలి


   అప్పుడే ధ‌ర‌ణి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడ‌గానే క‌న్నీళ్లు పెట్టుకుంటాడు శైలేంద్ర.


శైలేంద్ర:  నా బ‌తుకుకు అర్థం లేదు. నా క‌ల‌, ల‌క్ష్యం అన్ని పోయాయి. ఎండీ సీట్ నా చేజారిపోయింది ధరణి. మళ్లీ ఎండీగా రిషి బాధ్యతలు తీసుకున్నాడు.


అంటూ శైలేంద్ర చెప్పగానే ధరణి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఆమె సంతోషం చూసి శైలేంద్ర మరింత బాధపడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.