Nindu Noorella Saavasam Serial Today Episode: ఆనంద్‌ స్కూల్‌ ఎలక్షన్స్‌లో పోటీ చేయడం అమ్ము వ్యతిరేకిస్తుంది. దీంతో భాగీ వెళ్లి అమ్ముకు నచ్చజెప్పి ఆనంద్‌ ఎలాగైనా గెలిచేలా చేయాలని చెప్తుంది. అంతా విన్న మనోహరి వెంటనే తన రూంలోకి వెళ్లి ఫోన్ చేస్తుంది. వెనకే చిత్ర వస్తుంది.

చిత్ర: ఎవరికి చేస్తున్నావు మను ఫోన్‌

మను: స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు

చిత్ర: ప్రిన్సిపాల్‌కు ఎందుకు..?

మను: ఆనంద్‌ స్కూల్‌  లీడర్‌గా పోటీ చేస్తున్నాడట. రేపే ఎలక్షన్స్‌ ఎలాగైనా ఆనంద్‌ను ఓడించాలని ప్రిన్సిపాల్‌తో చెప్పాలి.

ఆరు: చూశారా గుప్త గారు మనోహరి అనుకున్నంత పని చేస్తుంది.

గుప్త: మేము మీకు ముందుగానే చెప్పితిమి కదా..? మనోహరి బుద్ది వక్రబుద్ది అని

ప్రిన్సిపాల్‌ ఫోన్‌ బిజీ వస్తుంది.

మను: ఛ ఫోన్‌ బిజీ వస్తుందేంటి

చిత్ర: ఆ చిన్న పిల్లల గొడవలో నువ్వు తల దూర్చడం అవసరమా

మను: షాపింగ్‌ మాల్‌ లో నీకు జరిగిన అవమానం అప్పుడే మర్చిపోయావా..?

చిత్ర: అది చేసింది భాగీ కదా..? పిల్లలేం చేశారు. భాగీ మీద కోపం ఆ పిల్లల మీద చూపించడం ఎందుకు..?

మను: అమ్ము వద్దు అంటున్నా.. ఆ భాగీ  ఆనంద్ కు సపోర్ట్‌ చేస్తుంది. రేపు ఎలక్షన్స్‌ లో ఆనంద్‌ ఓడిపోతే డిప్రెస్‌ అవుతాడు. అందుకు కారణం భాగీ అని చెప్పి అమర్‌ను రెచ్చగొట్టి భాగీని బాగా తిట్టించొచ్చు.. తర్వాత వాళ్లిద్దరిని విడగొట్టొచ్చు

ఆరు: చూశారా గుప్త గారు అది ఆనంద్‌ను ఓడించడం కాదు. పిల్లలను అడ్డం పెట్టుకుని ఆయనను భాగీని విడదీయాలని చూస్తుంది.

గుప్త: మనోహరి కపట నాటకములు నీకు కొత్త కాదు కదా బాలిక

మను ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది ప్రిన్సిపాల్‌

ప్రిన్సిపాల్‌:  చెప్పండి మేడం ఈ టైంలో ఫోన్‌ చేశారేంటి

మను: చెప్పాల్సింది నువ్వు అసలు మీ స్కూల్‌లో ఏం జరుగుతుంది.

ప్రిన్సిపాల్‌: ఎస్పీఎల్‌ ఎలక్షన్స్‌ కండక్ట్ చేస్తున్నాం. ఈ సారి అమ్ము పాప కాకుండా ఆనంద్‌ పోటీ చేస్తున్నాడు. వాళ్లకు పోటీగా మన బంటి గాడు నిలబడ్డాడు

మను: నేను అడిగేంత వరకు నాకు ఈ విషయం చెప్పవా..?

ప్రిన్సిపాల్‌: రేపటి ఎలక్షన్స్‌ లో ఆనంద్‌ గెలవడు.. వాడికి సొంత ఇంట్లోనే సపోర్టు లేదు.. పైగా బంటిగాడు చాక్లెట్స్‌ తో పిల్లలందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు.

మను: కానీ ఇక్కడ అంజలి ఉంది. అది ఏమైనా చేస్తుంది. రేపు స్కూల్‌కు ఆనంద్‌, భాగీ వస్తారు. వారితో పాటు నేను కూడా వస్తాను.  నువ్వేం చేస్తావో నాకు తెలియదు బంటీనే గెలవాలి.

ప్రిన్సిపాల్‌: రేపు రండి చూసుకుందాం అ

అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు చంభాను వెటకారంగా మాట్లాడతడు రణవీర్‌ లాయరు. నువ్వేం చేయలేవని హేళన చేస్తాడు. దీంతో చంభా కోపంగా లాయరును మరుగుజ్జుగా మార్చేస్తుంది.

రణవీర్‌: చంభా లాయర్‌ ఎక్కడ..? ఏం చేశావు తనను (అంటూ అటూ ఇటూ చూస్తే కింద మరుగుజ్జులాగా లాయరు కనిపిస్తాడు.) చంభా నీ శక్తులు మనోహరి మీదనో.. లాయర్‌ మీదనో కాదు.. ఆ ఆత్మ మీద చూపించు..

చంభా: ఆ ఆత్మను మరుగుజ్జుగా మార్చబోతున్నాను. అప్పుడు  దాని శక్తులు ఏవీ పని చేయవు.. నా చేతిలో కీలుబొమ్మై నేను ఆడించినట్టల్లా ఆడుతుంది.

రణవీర్‌: వెంటనే ఆ పని చేయ్ చంభా.. ఇప్పుడే చేయ్‌..

అనగానే చంభా మంత్రదండం తీసుకుని మంత్రిస్తుంది. అటువైపు గార్డెణ్‌లో ఆరు కనిపించక గుప్త అటూ ఇటూ వెతుకుతాడు. ఎక్కడా కనిపించకపోవడంతో అయోమయలో పడిపోతాడు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!