Nindu Noorella Saavasam Serial Today Episode:  అనామికను చిత్ర అనుమానంగా చూస్తుంది. ఇది అచ్చం మా అరుంధతిలాగే ఉందేంటని మనసులో అనుకుంటుంది. దగ్గరకు ఎవరు నువ్వు అసలు మా అరుంధతిలా ఉన్నావేంటి అని అడుగుతుంది. దీంతో అనామిక అవును నా నవ్వు కొంచెం మేడంలా ఉంటుందని ఆంటీ వాళ్లు అంటుంటారు అని చెప్తుంది.

చిత్ర: నీకు ఇంట్లో అందరి గురించి తెలుసా..?

అనామిక: మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు

చిత్ర: తెలివైన దానివే.. మను గురించి తెలుసుకోవాలి

అనామిక: మను గురించి చిత్ర ఎందుకు అడుగుతుంది. ఇందాక చిత్ర ఏదో చెప్పబోతుంటే మను పక్కకు తీసుకెళ్లింది. చిత్రకు మను గురించి తెలుసా..? తెలుసుకోవాలనుకుంటుందా..?

(అని మనసులో అనుకుంటుంది.)

చిత్ర:  ఆలోచిస్తున్నారేంటి మను గురించి తెలుసా..?

అనామిక: పెద్దగా నాకేం తెలియదండి.. ఆవిడ ఒక ఏడు సంవత్సరాలు ఎక్కడుందో ఏం చేసిందో ఎవ్వరికీ తెలియదు.

చిత్ర: అప్పుడే కోల్‌కతాలో పెళ్లి చేసుకుని బిడ్డను కన్నది.

( అని మనసులో అనుకుంటుంది.)

అనామిక:  ఆ తర్వాత కొడైకెనాల్‌ లో అరుంధతి మేడం దగ్గరకు వచ్చారట. వచ్చిన నాలుగు రోజులకే అరుంధతి మేడం యాక్సిడెంట్‌లో చనిపోయారట. మీకో విషయం తెలుసా..? సార్‌ పెళ్లి మనోహరిగారితే జరగాలట. కానీ అనుకోకుండా భాగీతో జరిగిపోయింది. ఇప్పటికీ భాగీని తప్పించి మనోహరి గారు అమర్‌ పెళ్లాంగా సెటిల్‌ అవ్వాలని ట్రై చేస్తుందట.. చిత్ర గారు మళ్లీ ఇదంతా నేను చెప్పానని మనోహరికి చెప్పకండి నన్ను తిడుతుంది.

 అని వెళ్లిపోతుంది. అనామిక వెళ్ళిపోయాక చిత్ర ఆలోచిస్తుంది.

చిత్ర: అమ్మా మనోహరి ఆరోజు నువ్వు అన్న మాటలు కోపంతో అన్నావనుకున్నాను. కానీ ఇలా ఇన్నేళ్లు పంతంతో పగబట్టి అరుంధతి మీద పగ తీర్చుకుంటావనుకోలేదు. అంటే అమర్‌ను పెళ్లి చేసుకోవడానికి మనోహరే అరుంధతిని చంపేసింది.  ప్లాన్‌ చేసి పెళ్లి చేసుకునే సమయానికి భాగీతో పెళ్లి అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా భాగీని చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. ఆహా ఏం దొరికావు మనోహరి నేనేదో నిన్ను భయపెట్టి కొంచెం డబ్బులు తీసుకుందామని ఇక్కడికి వస్తే.. నాకు మాత్రం పెద్ద జాక్‌ పాట్‌ తగిలింది. నీ గతాన్ని అడ్డు పెట్టుకుని నా భవిష్యత్తును సెట్‌ చేసుకుంటా..!

అని మనసులో అనుకుంటూ ప్లాన్‌ చేసుకుంటుంది చిత్ర. మరోవైపు అందరికీ భోజనాలు వడ్డించడానికి శివరాం, నిర్మల ఏర్పాట్లు చేస్తుంటారు. రాథోడ్‌కు మిగిలిన ఏర్పాట్లు చూడమని నిర్మల చెప్తుంది. అలాగేనని వెళ్లున్న రాథోడ్‌ ఆలోచిస్తూ ఉన్న అమర్‌ను చూస్తాడు. దగ్గరకు వెళ్తాడు.

రాథోడ్‌: సార్‌ ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు..?  ఏంటి సార్‌ గేటు దాకా వచ్చిన మేడం లోపలకు రాకుండా పోతారా..? మీరు మరీ ఇక్కడ నిలబడి వెయిట్‌ చేయాలా..? లోపలికి రండి సార్‌

అమర్‌: నేను భాగీ కోసం వేయిట్‌ చేయడం లేదు రాథోడ్‌. భాగీ చుట్టూ అల్లుకుంటున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను.

అని అమర్‌ చెప్పగానే  రాథోడ్‌ షాక్‌ అవుతాడు. దీంతో అమర్‌ కోల్‌కతాలో జరిగింది మొత్తం చెప్తాడు. పక్క నుంచి వింటున్న మనోహరి షాక్‌ అవుతుంది. తర్వాత అందరూ భోజనాలు చేశాక ఇంటికి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లాక అనామిక, భాగీ దగ్గరకు వెళ్తుంది.

అనామిక: భాగీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా..? లైఫ్‌లో సార్‌తో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలని ఉందా..? లేదా..?

అని అడుగుతుంది. మరోవైపు అమర్‌ దగ్గర రాథోడ్‌ ఉంటాడు.

రాథోడ్‌: సార్‌ మిస్సమ్మ మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు తెలియదా..?

అనామిక: అసలు సార్‌కు దగ్గరయ్యే ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా నువ్వు. ఆయన ఫస్ట్‌ వైఫ్‌ను మర్చిపోలేక పోతున్నారు. అలా అని అలాగే వదిలేస్తావా..?

రాథోడ్‌:  మీరిద్దరూ సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు సార్‌. మిస్సమ్మకు ఒక్క చాన్స్‌ ఇచ్చి చూడండి సార్‌. సంతోషాన్ని ప్రేమను కొత్తగా పరిచయం చేస్తారు.

అంటూ రాథోడ్‌, అమర్‌ మనసులో ప్రేమను.. ఆరు, మిస్సమ్మ మనసులో కొత్త ఆశలను రేకెత్తిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!