Nindu Noorella Saavasam Serial Today Episode: కుటుంబ సభ్యులతో కలిసి ఆరు పెరిగిన అనాథ శరణాలయానికి వెళ్తాడు అమర్. దీంతో మనోహరిఎందుకు అమర్ ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అమర్ చెప్తాను అంటూ గేటు దగ్గరకు రాగానే శివరాం ఎదురవుతాడు.
శివరాం: ఏంటి అమర్ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు
అమర్: ఆరు చనిపోయినప్పటి నుంచి ప్రతినెల తను చనిపోయిన రోజు ఆశ్రమంలో భోజనాలు పెట్టిస్తున్నాను నాన్నా.. వార్డెన్ మేడం నుంచి ఈ విషయం తెలుసుకున్న ఆరు ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఇక్కడికి వస్తామని చెప్పారు. అందుకే మీరు కూడా ఉంటే బాగుంటుందని ఇక్కడికి రమ్మని చెప్పాను
నిర్మల: ఇవాళ అమ్మాయే బతికి ఉంటే తన స్నేహితులు అందరినీ చూసి ఎంత సంతోషించేదో..?
శివరాం: ఒక్క సంతోషమేనా.. మొత్తం హడావిడి అంతా అమ్మాయిదే ఉండేది.
మనోహరి: ఇదేంటి నన్ను ఇంత కోపంగా చూస్తుంది. ఇక్కడికి వచ్చాక అనామికలో ఉన్న అరుంధతి జ్ఞాపకాలు బయటపడ్డాయా..? ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ( అని మనసులో అనుకుంటుంది.)
అనామిక: ఏమో అండి అరుంధతి గారు ఇప్పటికి కూడా మీ మధ్యలోనే ఉండొచ్చు. మీతోనే ఉంటూ ఉండొచ్చు
శివరాం: నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా.. అప్పుడప్పుడు అమ్మాయి నిజంగా మా మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి కోడలిని పోగొట్టుకోవాలని మా తలరాతలో ఉందేమో
నిర్మల: సరే సరే ఇలా మాట్లాడుతూ పోతే ఇక్కడే సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉండిపోతాం. అమర్ ఒకసారి భాగీ ఫోన్ చేసి ఎంత వరకు వచ్చిందో కనుక్కో
అమర్, మిస్సమ్మకు ఫోన్ చేయగానే.. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను వచ్చేస్తున్నాను అని చెప్తుంది.
అమర్: అమ్మా ఇప్పుడే స్టార్ట్ అయ్యిందంట వచ్చేస్తుంది. మనం లోపలికి వెళ్దాం. రాథోడ్ కారులో ఆరు ఫోటో, పూలు ఉన్నాయి. అవి తీసుకురా..?
అని చెప్పి అందరూ లోపలికి వెళ్తుంటారు. వెనక మెల్లగా వస్తున్న మనోహరికి అనామిక షాక్ ఇస్తుంది.
అనామిక: ఇక్కడికి వచ్చాక చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఏమైనా గుర్తుకు వచ్చాయా..? ఏంటి అప్పుడే మర్చిపోయారా..? అరుంధతి గారు పెళ్లి చూపులు, పెళ్లంతా మొదలైంది ఇక్కడే కదా .. అంతా చేసి అప్పుడే ఎలా మర్చిపోయారు.
మనోహరి: ఏంయ్ ఏం మాట్లాడుతున్నావు
అనామిక: ఇలా అడుగుతున్నారేంటి మనోహరిగారు అరుంధతి గారు మీరు కలిసింది పెరిగింది అంతా ఇక్కడే అంట కదా..? దాని గురించే అడుగుతున్నాను.
మనోహరి: అవును కానీ తప్పులు అన్నావు..
అనామిక: అదా ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. టీనేజ్ లో వార్డెన్‌కు తెలియకుండా సినిమాలకు వెళ్లడాలు, కాలేజీలో వచ్చిన ప్రేమలేఖలు చదువుకోవడాలు చేసి ఉంటారు కదా వాటి గురించి అడిగాను
మనోహరి: అలా అన్నావా.. ముందు లోపలికి వెళ్దాం పద
అంటూ లోపలికి వెల్లిపోతుంది. మనోహరిని మనసులో తిట్టుకుంటుంది అనామిక రూపంలో ఉన్న ఆరు. లోపలికి వెళ్లాక తన ఫ్రెండ్స్‌ను చూసిన ఆరు ఎమోషనల్ అవుతుంది. వారితో మనఃస్పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను అనుకుని మనసులో బాధపడుతుంది. అందరూ హ్యాపీగా ఉంటే అమర్ మాత్రం బాల్కనీ లోకి వెళ్లిపోతాడు. వెనకే రాథోడ్ వస్తాడు.
రాథోడ్: సార్ ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు
అమర్: భాగీకి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను.
అప్పుడే అటుగా వెళ్తున్న మనోహరి చాటుకు వెళ్లి అమర్ మాటలు వింటుంది.
రాథోడ్: మేడంకు ప్రమాదం ఉందా..?
అమర్: అవును రాథోడ్.. భాగీ కోల్‌కతా వెళ్లినప్పుడు తన మీద అటాక్ జరిగింది. ఎవరో ఒక అమ్మాయి వచ్చి తనను కాపాడింది. ఆరును చంపిన వాళ్లే భాగీని చంపాలనుకుంటున్నారు. కానీ ఈసారి ఆ ప్రమాదం భాగీ దగ్గరకు రావాలంటే నన్ను దాటి రావాలి. నా కుంటుంబాన్ని బాధపెట్టాలని చూస్తుంది ఎవరో నాకు తెలియదు కానీ వాళ్లను మాత్రం వదిలిపెట్టను
అని అమర్ కోపంగా చెప్తుంటే చాటు నుంచి విన్న మనోహరి షాక్ అవుతుంది. అమర్ చెప్పినంత పని చేస్తాడని భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!