Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆకాష్‌  స్పృహలోకి వస్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అనామిక అక్కడి నుంచి గార్డెన్‌ లోకి వెళ్తుంది. అమర్‌ కూడా అనామిక వెనకాలే వెళ్తాడు. అనామికను నువ్వు నీలా కనిపించడం లేదని నిజం చెప్పాలంటే  ఆరులా కనిపిస్తున్నావని అంటాడు.

అనామిక: నాలా అనిపించలేదు అంటే ఏంటి సార్‌ అర్థం కాలేదు. మేడం లాగా నేనెందుకు అనిపిస్తాను సార్‌. ఫస్ట్‌ టైం ఆకాష్‌ కు అలా అంత బ్రీతింగ్‌ ప్రాబ్లమ్‌ చూశాను అందుకే అంత కంగారు పడ్డాను అంతే  సార్‌ నేను వెళ్లి మెడిసిన్స్‌ తీసుకుని వస్తాను.

 అమర్‌:  ఆగు అనామిక.. అంతే అయితే.. నాకు ఆరుకు మాత్రమే ఎక్కడుందో తెలిసిన ఎక్స్‌ట్రా మెడిసిన్‌  గురించి నువ్వెలా చెప్పగలిగావు. చెప్పు అనామిక ఆ ఎక్స్‌ట్రా మెడిసిన్‌ నా రూంలో రైట్‌ సైడ్‌ కప్‌బోర్డులో ఉన్నాయని అంత క్లియర్‌గా ఎలా చెప్పగలిగావు..

 అనామిక: అది పిల్లలు ఎవరో చెప్పినట్టు ఉన్నారు సార్‌

అమర్‌: మెడిసిన్స్‌ అక్కడ ఉన్నాయని పిల్లలకు కూడా తెలియదు. తెలియని విషయం గురించి వాళ్లు ఎలా నీకు చెప్తారు

అనామిక: ఆ గుర్తుకు వచ్చింది సార్‌ లాస్ట్‌ వీక్‌ భాగీ గారు మీ రూం క్లీన్‌ చేస్తుంటే హెల్ప్‌ చేశాను. అప్పుడు మెడిసిన్‌ అక్కడ ఉండటం చూశాను. అది గుర్తుకు వచ్చి చెప్పాను. ఏమైంది సార్‌ ఎందుకు అలా అడుగుతున్నారు

అమర్‌: ఆరు అస్థికలు గంగలో కలపకపోవడం వల్ల ఇక్కడే ఉందని స్వామిజీ చెప్పారు. తను నీలో ప్రవేశించిందేమోనని డౌటు వచ్చి అడిగాను. నీ మాట, కంగారు అన్ని అచ్చం ఆరులా ఉంటే.. ఆరు వచ్చిందేమో అనుకున్నాను.

 అనామిక: అవునా సారీ సార్‌ నేను కొంచెం ఓవర్‌ గా రియాక్ట్ అయ్యాను మరోసారి అలా కాకుండా జాగ్రత్త పడతాను

 అమర్‌: పర్వాలేదు అనామిక ఇందులో నీ తప్పేం లేదు కదా

అని లోపలికి వెళ్లిపోతాడు. బాల్కనీలోంచి అంతా విన్న మనోహరి భయంతో రూంలోకి వెళ్తుంది.

మనోహరి: అసలు ఇది అరుంధతియా..? అనామికనా..? అర్థం కావడం లేదు. క్లారిటీ వచ్చే లోపే కన్పీజ్‌ చేస్తుంది. ఒకసారి స్వామిజీకి ఫోన్‌ చేద్దాం.

అని ఫోన్‌ చేస్తుంది.

స్వామిజీ: హలో మనోహరి..

మనోహరి: నమస్కారం స్వామిజీ నాకొక సాయం కావాలి.

స్వామిజీ:  చెప్పు మనోహరి ఏం కావాలి.

మనోహరి: మా ఇంట్లో కేర్ టేకర్‌ గా ఉంది అనామికనో.. లేక అరుంధతినో కనుక్కునే మార్గం కావాలి. అది అనామికలా వచ్చిన అరుంధతి అయితే మాత్రం నా నిజస్వరూపం బయట పెట్టడానికి పెద్ద ప్లానే వేసినట్టు ఉంది స్వామిజీ. అందుకే అది అనామికనో కాదో తెలుసుకోవడం నాకు ముఖ్యం.

 స్వామిజీ: ముందు నీ జీవితంలోకి పెను తుఫాను అడుగుపెట్టబోతుంది. ఒక పెద్ద గండం నీకు ఎదురు అవ్వబోతుంది. నిన్ను మించిన మోసం నిన్ను నిలువునా ముంచేయడానికి నీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది.

అని స్వామిజీ హెచ్చరించడంతో మనోహరి భయపడుతుంది. ఇంతలో ఒక అమ్మాయి క్యారెక్టర్‌ బస్టాండులో ఇంట్రడ్యూస్‌ అవుతుంది. ఆ అమ్మాయి బస్టాండులో ఉన్న మహిళ మెడలో గోల్డ్‌ చైన్ కొట్టేస్తుంది. మరోవైపు అమర్‌ ఫ్యామిలీ మొత్తం అనాథ శరణాలయానికి వెళ్తుంది. ఆ ఆశ్రమాన్ని చూడగానే ఆరు తన చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది.

శివరాం: ఏంటి అమర్‌ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు

అమర్‌: ఆరు చనిపోయినప్పటి నుంచి ప్రతి నెల  ఆశ్రమంలో అందరికీ భోజనం పెట్టిస్తున్నాను నాన్నా.. వార్డెన్‌ మేడం నుంచి ఈ విషయం తెలుసుకున్న ఆరు ప్రెండ్స్‌ అందరూ ఇవాళ ఇక్కడకు వస్తాము అని చెప్పారు.

అని అమర్ చెప్తుండగానే.. ఆరు స్నేహితులు అందరూ వస్తారు. అందరూ కలిసి ఆరు ఫోటోకు దండ వేసి నివాళులు అర్పిస్తారు.   ఇంతలో ఒక ఫ్రెండ్‌ మనోహరి నీకోసం ఒక స్పెషల్‌ ఫర్సన్‌ వచ్చారు అని చెప్తుంది. మనోహరి అనుమానంగా ఎవరు..? అని అడుగుతుంది. ఇంతలో నేనే అనుకుంటూ బస్టాండులో గోల్డ్‌ చైన్‌ కొట్టేసిన అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే మను షాక్‌ అవుతుంది. ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!