Lakshmi Nivasam Serial Today Episode: తులసి ఉద్యోగం కోసం ఓ ఆఫీసుకు వెళ్లగా అక్కడ ఆఫీసర్ ఆమెతో తప్పుగా ప్రవర్తించేందుకు యత్నిస్తాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన సిద్ధు ఓ వృద్ధురాలికి పెన్షన్ ఇచ్చేందుకు లంచం అడిగాడని సదరు ఆఫీసర్‌ను చితక్కొడతాడు. అయితే, సిద్ధు వల్లే తనకు ఉద్యోగం రాలేదని అతన్ని తప్పుగా అర్థం చేసుకున్న తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు, బసవ తులసి పెళ్లి ఆగిపోయిందని లక్ష్మీ, శ్రీనివాస్‌ల ఇంటికి పరామర్శకు వెళ్తాడు బసవ. అతన్ని చూసిన తులసి యాక్సిడెంట్ చేసిన వారిని పట్టుకునేందుకు సాయం చేయాలని అడుగుతుంది. దీంతో బసవ టెన్షన్ పడతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ విషయానికొస్తే..
తులసికి బసవ జాబ్ ఆఫర్
తులసికి మంచి జాబ్ వేయిస్తానని బసవ అంటాడు. అయితే, ఉద్యోగం తాను సంపాదించుకుంటానని యాక్సిడెంట్ చేసిన వారు ఎవరో కనిపెట్టాలని బసవతో అంటుంది తులసి. దీంతో బసవ టెన్షన్ పడతాడు. ఖుషీ చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి మీటింగ్ ఉందంటూ హడావుడిగా వెళ్లిపోతాడు.
ఆస్తి కోసం భార్గవ్ ప్లాన్
శ్రీకాంత్ డెత్ సర్టిఫికెట్ తెచ్చానని భార్గవ్ సుపర్ణికతో అంటాడు. ఎవరో వాటాలు వేసుకునే కంటే ముందే ఆస్తిని తమ పేరు మీదే మార్చుకోవాలని ఆమెతో అంటాడు భార్గవ్. ఇంతలో భార్గవ్ తల్లి భాగ్యం ఏడుస్తూ అక్కడకు వస్తుంది. దేవత లాంటి వసుంధర, శ్రీకాంత్‌ను కోల్పోవడం చాలా బాధ అంటూ.. సుపర్ణికను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతానని భార్గవ్‌తో అంటుంది ఆమె తల్లి.
ఆస్తి కోసం భార్గవ్, అతని తల్లి ప్లాన్ వేస్తుంటారు. ఇప్పుడు కోట్లు తీసుకోవచ్చని ఆమె తల్లితో అంటాడు. ఇంతలో జ్యూస్ తీసుకొస్తానని సుపర్ణిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో శ్రీకాంత్ ఫ్యామిలీ లాయర్ సుపర్ణికకు ఫోన్ చేసి జరగరానిది జరిగిందని.. ఇక తర్వాత జరగాల్సిన విషయాలు చూడాలని లాయర్ ఆమెకు చెప్తాడు. త్వరలోనే ఇంటికి వస్తానని చెప్తాడు. సరే అని సుపర్ణిక అంటుంది. ఇదే విషయాన్ని సుపర్ణిక భార్గవ్‌కు చెప్తుంది.
జై కారులో జాను
మరోవైపు, జై కారులో జాను తన ఇంటికి వెళ్తుండగా ఆమెపై స్పెషల్ కేరింగ్ చూపిస్తాడు. అయితే, జై అంత కేరింగ్ చూపించడం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది జాను. కారు దిగి జాను అక్కడి నుంచి నవ్వుతూ తన ఇంటికి వెళ్తుండగా ఆమెనే చూస్తూ ఉండిపోతాడు జై. తనకు వచ్చిన గిఫ్ట్స్‌తో జాను ఇంటికి వెళ్లగా అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరి సపోర్ట్‌తోనే ఇన్ని గిఫ్ట్స్ గెలుచుకున్నానని జాను.. లక్ష్మీ, శ్రీనివాస్‌తో అంటుంది.
కోపంతో సిద్ధు
కీర్తి ఇంటికి బసవ వెళ్లిన విషయం తెలుసుకున్న సిద్ధు అతనిపై కోప్పడతాడు. వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లావని సిద్ధు అడుగుతాడు. ఇన్నాళ్లకు మీ నాన్నకు వాళ్లపై కోపం పోయిందని అందుకే వెళ్లామని విశాలాక్షి సిద్ధుతో అంటుంది. తులసికి కాబోయే వాడి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని సిద్ధుతో అంటుంది. ఇంకోసారి వారి ఇంటికి వెళ్లొద్దంటూ బసవకు చెప్తాడు సిద్ధు.
ఇదే సమయంలో తులసిని జాబ్ గురించి అడుగుతుంది జాను. తనకు ఓ రౌడీ షీటర్ వల్ల జాబ్ రాలేదని.. చెప్తుంది తులసి. తనకు ఓ కుర్రాడు పరిచయమయ్యాడని లక్ష్మి వారితో చెప్తుంది. ఇద్దరూ ఒకరికొకరు తెలియకుండానే 'సిద్ధు' గురించి మాట్లాడుకుంటారు.
జాను ఇంటికి జై
మరోవైపు, జాను ఇంటికి జై వెళ్తాడు. అతన్ని చూసి కంగారు పడిన జాను.. తానేమీ మర్చిపోలేదని అతనితో అంటుంది. మీ నాన్న వాళ్లతో మాట్లాడాలని జై.. జానుతో అంటాడు. దీంతో కంగారుగా లక్ష్మీ, శ్రీనివాస్‌లను పిలుస్తుంది జాను. ఇదే సమయంలో తన అనుచరులతో తాంబూలాలతో ఎంటర్ అవుతాడు జై. మరి అతను జానుతో పెళ్లి గురించి వారితో మాట్లాడతాడా?, ఆస్తి కొట్టేయాలన్న భార్గవ్ ప్లాన్ ఫలిస్తుందా? అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.