Nindu Noorella Saavasam, October 11  ఈరోజు ఎపిసోడ్​లో..


మిస్సమ్మ: మీరు మనోహరి గారిని చూడటానికి వెళ్లి మేడం గారిని పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఆవిడ చెప్పిన సమాధానాలు నచ్చి ఆమెని మీరు పెళ్లి చేసుకున్నారు కదా అలాగే నన్ను కూడా ప్రశ్నలు అడగండి, సమాధానాలు చెప్పకపోతే అప్పుడు పంపించేయండి.


మనోహరి : తనేదో తిక్క తిక్కగా మాట్లాడుతుంది, నేను చూసుకుంటాను నువ్వు వెళ్లు అమర్.


అమర్: నువ్వు ఉండు మనోహరి అని చెప్పి మిస్సమ్మతో.. నేను నిన్ను వద్దన్నది నీ ప్రవర్తన చూసి. నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు అలాగే నువ్వు అనుకున్న దానికోసం ఏం చేయటానికైనా సిద్ధపడతావు, నీ వస్తువుల మీద నువ్వు జాగ్రత్త చూపించవు అలాంటిది నా పిల్లలకి ఏం డిసిప్లిన్ నేర్పిస్తావు అందుకే వెళ్లిపోమన్నాను.


మిస్సమ్మ: ఆ పరిస్థితుల్లో నాకు ఉన్న కారణాలు నాకు ఉన్నాయి వాటినే మీరు ఎందుకు పాయింట్ అవుట్ చేయాలి.


అమర్ తండ్రి : ఇద్దరి మాటల్లోనే న్యాయం ఉన్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడు ఈ సమస్య తీరేదెలా.


మిస్సమ్మ: నా దగ్గర సొల్యూషన్ ఉంది, నాకు కొంత గడువు ఇవ్వండి. మీరిచ్చిన గడువులో ఏ చిన్న తప్పు జరిగినా నన్ను బయటికి పంపించేయండి.


అమర్: సరే అయితే, నీకు మూడు రోజులు గడిపిస్తున్నాను. ఈలోపు ఎలాంటి పొరపాటు జరిగినా నిన్ను బయటికి పంపించేస్తాను. లేదంటే నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ ఇంట్లో ఉండేలాగా అగ్రిమెంటు రాస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


అమర్ తల్లిదండ్రులు: మా దగ్గర నెగ్గినట్టే అమర్ దగ్గర కూడా నెగ్గాలి అని చెప్పి మిస్సమ్మకి ఆల్ ద బెస్ట్.


రాథోడ్: పూనకం వచ్చిన దానిలాగా అలా మాట్లాడేసావేంటి, నీ లెటర్ మీద ఆయనే సైన్ చేయాలి మర్చిపోయావా..


మిసమ్మ : అదంతా నాకు తెలియదు, ఆవిడ ఎలా చెప్పారో అలాగే చేసేశాను. ఈరోజు నేను ఈ ఇంట్లో ఉన్నానంటే ఆవిడే కారణం.


రాథోడ్ : ఎవరు ఆవిడ, ఆ పక్కింటి ఆవిడేనా.. నాకు కనిపించని ఆ పక్కింటి ఆవిడ నీకు మాత్రమే ఎలా కనిపిస్తుంది.


మిస్సమ్మ చెప్పేందుకు ప్రయత్నిస్తుంది కానీ ఈ రోజుకి ఈ కన్ఫ్యూషన్ చాల్లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాథోడ్. మిస్సమ్మ అక్కడే ఉండబోతున్నందుకు అరుంధతి సంతోషిస్తుంది.


ఆ తర్వాత..


తమ గదిలోకి వెళ్లిన పిల్లలు ఎక్కడ మిస్సమ్మ మీద తమ రివెంజ్ తీర్చుకోకుండా వెళ్లిపోతుందో అనుకున్నాం. కానీ తను మళ్లీ తిరిగి వచ్చింది. మనల్ని క్యాంపునకు వెళ్లకుండా ఆపుతుందా.. మనం చేసే అల్లరితో ఆమెని గడువులోగా బయటకు వెళ్లిపోయేలాగా చేయాలి అనుకొని ఆనందపడతారు.


అదే సమయంలో మనోహరి తన గదిలో కూర్చుని మిస్సమ్మ మళ్లీ వచ్చినందుకు బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత


చిత్రగుప్తుడు : ఇంటి బయటే ఉన్న చిత్రగుప్తుడు ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తాడు కానీ గేటు ఎంతకీ రాకపోవడంతో గేటు దూకి లోపలికి వెళ్దాం అనుకుంటాడు.


కానీ అంతలో అటుగా వెళ్తున్న ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు.


చిత్రగుప్తుడు : గేటు దూకి లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను.


కానిస్టేబుల్: నన్ను ఏమైనా సాయం చేయమంటావా..


చిత్రగుప్తుడు : నువ్వు ఎంత మంచి రక్షకబటుడివి నువ్వు ఒంగో నీ మీద ఎక్కి నేను గోడ దూకుతాను.


కానిస్టేబుల్: ఏంటి నన్ను చూస్తే ఎటకారంగా ఉందా.. అయినా ఈ వేషం ఏమిటి, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా..


చిత్రగుప్తుడు : ఈ ఇల్లు దేశ రక్షకుడిది, ఇది వేషము కాదు. మా లోకంలో నియమము. మీకు ఎలా బట్టలు నియమం ఉందో మా లోకంలో కూడా మాకు బట్టల నియమం ఉంటుంది.


కానిస్టేబుల్: అన్నీ తెలుసుకునే ఇంట్లో దొంగతనానికి సిద్ధమయ్యావన్నమాట, దొంగతనం చేసిన డబ్బులతో ఉంగరాలు చేయించుకుంటున్నావా.. పదా పోలీస్ స్టేషన్ కి అంటూ చిత్రగుప్తుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లిపోతాడు.


ఆ తర్వాత మిస్సమ్మ అరుంధతికి థాంక్స్ చెప్పటం కోసం లాన్ దగ్గరికి వచ్చి చుట్టూ చూస్తుంది. అక్కడ తను కనిపించకపోవడంతో గతంలో అరుంధతి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది. బంధం కలవడానికి రక్తసంబంధమే అక్కర్లేదు అనే మాటలు గుర్తు తెచ్చుకొని అక్క అని పిలుస్తుంది. ఆ మాటలకి ఎమోషనల్ అవుతుంది అరుంధతి.


అరుంధతి: మిస్సమ్మ దగ్గరికి వచ్చి నన్ను అక్క అని పిలిచావా..


మిస్సమ్మ : అవునండి. ఎందుకో మిమ్మల్ని అలా పిలవాలనిపిస్తుంది.


అరుంధతి: ఎందుకు పిలవాలనిపిస్తుంది.


మిస్సమ్మకి పాత జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వస్తాయి, బాగా ఎమోషనల్ అవుతుంది.


మిస్సమ్మ : ఇంతకుముందు ఒక అక్కని ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నాడు. బంధాన్ని ఇచ్చాడని ఆనందించే లోపు బాధను మిగిల్చాడు. ఆ బంధం నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. చెప్పకుండా నా జీవితంలోకి వచ్చి చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. కానీ అర్ధాంతరంగా వెళ్లిపోయి తీరని లోటు మిగిల్చింది.


అరుంధతి: మిస్సమ్మ, ఏంటా బంధం అని అడుగుతుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.