Nindu Manasulu Serial Today Episode ప్రేరణ వాళ్ల ఇంటికి సిద్ధూ వస్తాడు. రంజిత్ భోజనం చేస్తుంటే హాయ్ సార్ అని అంటాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావ్ వెళ్లిపో అని ప్రేరణ అంటే నేను సార్‌కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని అంటాడు. ఈ విషయం చెప్పాలి అనడానికి ఈ టైంలో రావాలా అని అడుగుతాడు. సాయం చేసిన వాళ్ల రుణం తీర్చుకుంటా సార్ అందుకే వచ్చా అని చెప్పి వెళ్లిపోతా సార్ అని సిద్ధూ అంటాడు.
రంజిత్ ఆపి ఇంటికి వచ్చావ్.. థ్యాంక్స్ చెప్పావ్ అలా వెళ్లిపోతావ్ ఏంటి.. భోజనం చేసి వెళ్లిపో అని అంటాడు. సరే సార్ అని సిద్ధూ కూర్చొంటాడు. ప్రేరణతో వడ్డించమని ఇందిర చెప్తే ప్రేరణ గుర్రుమని చూస్తుంది. భోజనం చేసి వెళ్లిపో అని రంజిత్ అంటాడు. మొత్తానికి సిద్ధూ ప్రేరణ ఇంట్లో భోజనం చేస్తాడు. మరోవైపు సిద్ధూ తనని విడిపించింది విజయానంద్ కాదు అని మంజులతో చెప్పడం విజయానంద్ గుర్తు చేసుకొని మందు తాగుతూ ఉంటాడు. నేనే సిద్ధూని విడిపించుంటే నాకు మంచి క్రెడిట్ వచ్చేదని అంటాడు. ఇదంతా గణ వల్లే వాడు మన దగ్గర తలవంచి ఉంటే నేను మీ మేడం దగ్గర తలెత్తుకునే వాడిని.. వాడికి పొగరు ఎక్కువైంది.. వాడిని వదలను.. వాడికి ఆ యూనీఫాం లేకుండా చేస్తా తిరిగి జీవితంలో స్టేషన్‌కి వెళ్లకుండా చేస్తా అని అనుకుంటాడు.
సుధాకర్ గణకి కాల్ చేసి ఘోరం జరిగిపోయింది సార్ అని చెప్తాడు. ఏమైందని గణ అడిగితే మొన్న మీరు అరెస్ట్ చేసిన వీరయ్య చనిపోయాడు. వాడిని ఇంటరాగేట్ చేసింది మీరే కదా వాడిని మీరు కొట్టిన దెబ్బలకు వాడు చనిపోయాడు.. అందరూ లాక్‌అప్ డెట్ అని మాట్లాడుకుంటున్నారని సుధాకర్ చెప్పగానే గణ ఛా అనుకుంటూ పరుగులు తీస్తాడు.
సిద్ధూతో ఈ గణ గాడిని వదలను అని అంటే ఎందుకు నీ గోల్ నీకు ఉంది.. నా గోల్ నాకు ఉంది.. మనం ఆ పని చూసుకుంటే చాలు వాడి గురించి ఎందుకు అని అంటుంది. ఇక సిద్ధూ ప్రేరణతో నేను వాడిని చాలా సార్లు ఎదుర్కొన్నా కాబట్టి నన్ను టార్గెట్ చేశాడు. కానీ మిమల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు.. ఏదో మీరు పుట్టుకతోనే వాడికి శత్రువు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు అని సిద్ధూ అంటాడు. దానికి ప్రేరణ చాలా కంగారు పడుతుంది. నువ్వు వీడియో తీసినప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా అందుకే అన్నాడని అంటుంది. ఇలాంటి వాడిని కన్న ఆ తండ్రిని అనాలి.. అని సిద్ధూ రాజశేఖరాన్ని అనడంతో ప్రేరణ వాళ్ల నాన్నని ఎందుకు అంటావ్ అని సీరియస్ అయిపోతుంది. సిద్ధూకి ప్రేరణ మాటలు ఏం అర్ధం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక సిద్ధూ ప్రేరణతో ఇంత వరకు జరిగిన డిస్ట్రబెన్స్ చాలు ఇక వదిలేద్దాం.. రేపు వచ్చి పిక్ చేసుకుంటా అని వెళ్లిపోతాడు.
లాకప్‌డెట్ అయినందుకు గణని పై అధికారి చాలా తిడతాడు. అతని ఫ్యామిలీ మీడియాకు వెళ్తా అంటోంది. నీ జాబ్‌తో పాటు నీ ఫ్యూచర్ కూడా పోతుందని అంటాడు. ఏ ఒక్కరూ నీకు సపోర్ట్‌గా మాట్లాడటం లేదు.. ఆ ఫ్యామిలీతో సెటిల్ చేసుకో.. 50 లక్షలు రెడీ చేసుకో అని చెప్తారు. 50 లక్షలా అని గణ నోరెళ్లబెడతాడు. ఉన్నపళంగా అంత డబ్బు నేను ఎక్కడ తేవాలి సార్ అని గణ అంటే నీకు డబ్బు ముఖ్యమా లైఫ్ ముఖ్యమా అని అంటారు. చచ్చాడు వెధవ అని సుధాకర్ అనుకుంటాడు. అంత డబ్బు ఇవ్వకపోతే నా లైఫ్ పోతుంది కదా అని గణ అంటూ పోతుంది అవును పోతుంది అని అనుకుంటాడు.
పాలవాడు వచ్చి 900 ఇవ్వమని అంటే ఐశ్వర్య వచ్చి అడుగుతుంది. ప్రేరణ దగ్గర కేవలం 200 ఉండటంతో అతనితో తర్వాత ఇస్తా అని చెప్పి పంపేస్తుంది. తల్లీకూతుళ్లు డబ్బుల కోసం బాధ పడుతుంటారు. ఇంతలో రంజిత్ వచ్చి రెంట్ అడుగుతాడు. కాస్త టైం ఇవ్వమని ప్రేరణ అడుగుతుంది. అప్పుడే సాయం చేస్తాడు అప్పుడే సాధిస్తాడు వీడేంటో అని ఐశ్వర్య అనుకుంటుంది.
మరోవైపు సిద్ధూ వాళ్లకి కూడా రెంట్ ఇవ్వమని ఓనర్ అడుగుతాడు. వారంలో రెంట్ ఇవ్వకపోతే ఇంటి నుంచి గెంటేస్తా అని అంటాడు. కుమార్ సిద్ధూతో ఎలా అయినా నువ్వే ఏదో ఒకటి చేసి డబ్బు కట్టరా అని అంటాడు. నైట్ వర్క్ చేయాలని సిద్ధూ అనుకుంటాడు. కానీ అతనిని జాబ్ నుంచి తీసేశారని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.