Brahmamudi Serial Today Episode: హాస్పిటల్ కు వెళ్లిన రాజ్‌, కావ్యను కన్వీన్స్‌ చేసి డాక్టర్‌ దగ్గరకు వెళ్తాడు. సారీ చెప్తాడు. మొన్న ఏదో అలా జరిగిపోయిందని చెప్తాడు.

Continues below advertisement

డాక్టర్‌: మీ సిచ్యుయేషన్‌ నేను అర్థం చేసుకోగలను కానీ రియలైజ్‌ అయినందకు వెరీగుడ్‌ ఇంతకీ పేషెంట్‌ ఎక్కడున్నారు అబార్షన్‌ కు ముందు నేను తనతో మాట్లాడాలి. తనను మానసికంగా రెడీ చేయాలి.

రాజ్‌:  ఈ విషయమే నేను మీతో మాట్లాడాలి డాక్టర్‌.. అందుకే ఒక్కడినే లోపలికి వచ్చాను డాక్టర్‌

Continues below advertisement

డాక్టర్‌:  ఏంటో చెప్పండి..?

రాజ్‌:  తనకు అబార్షన్‌ చేస్తున్నట్టు తనకు నేను చెప్పలేదు.. డాక్టర్‌

డాక్టర్‌: ఏంటి ఇంకా చెప్పలేదా..? ఓకే ఒకసారి లోపలికి పంపించండి నేను మోటివేట్‌ చేస్తాను.

రాజ్‌: వద్దు డాక్టర్‌ తనుకు ఈ విషయం తెలిస్తే తను అబార్షన్‌కు ఒప్పుకోదు.

డాక్టర్‌: ఎందుకు ఒప్పుకోదు

రాజ్‌: అది తన వ్యక్తిత్వం డాక్టర్‌. తనను తాను ఎంతైనా బాధపెట్టుకుంటుంది. కానీ ఎదుటి వాళ్లను బాధపెట్టదు. అలాంటిది ఇప్పుడు తన ప్రాణం కోసం బిడ్డను వదులుకుంటుంది అంటే ఎలా వదులుకుంటుంది చెప్పండి

డాక్టర్‌: మీరు ఎన్నైనా చెప్పండి.. ఈ రోజుల్లో అమ్మాయికి తెలియకుండా అబార్షన్‌ చేయడం చాలా పెద్ద నేరం ఇలాంటి పరిస్థితుల్లో కండీషన్‌ క్రిటికల్‌ గా ఉంటేనే ఈ ఆపరేషన్‌ చేస్తాం.. అలాంటి విషయాన్ని పేషెంట్‌కు చెప్పకపోవడం ఏంటండి

రాజ్‌: నేను తన భర్తనే కదా డాక్టర్‌ నేను చెప్తున్నాను కదా

డాక్టర్‌: రేపు ఆమె తన బిడ్డను ఎందుకు చంపేశారని కోర్టుకు వెళితే నా ప్రాక్టీష్‌తో పాటు హాస్పిటల్‌ కూడా మూసుకోవాల్సి వస్తుంది.

రాజ్‌: మీరు అనుకుంటే అవుతుంది డాక్టర్‌ చాలా ఈజీగా అవుతుంది. మీరు  రూల్స్‌ అంటూ భయపడతున్నారు. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను.. కావాలంటే ఇలాంటి హాస్పిటల్‌ ఒకటి కట్టిస్తాను.

డాక్టర్‌: మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను

రాజ్‌: ఫ్లీజ్‌ డాక్టర్‌  అలా అనకండి తనకు నిజం తెలిసే లోపే ఈ అబార్షన్‌ అయిపోవాలి. కావాలంటే నేను మీ కాళ్లు పట్టుకుంటాను.

అంటూ రాజ్‌ బతిమాలుతూ డాక్టర్‌  కాళ్లు పట్టుకోబోతుంటే.. కావ్య చూస్తుంది. రాష్ షాక్‌ అవుతాడు. కావ్య కోపంగా రాజ్‌ దగ్గరకు వెళ్తుంది.

కావ్య: చెప్పండి నాకెందుకు ఇంత అన్యాయం చేయాలనుకున్నారు.

రాజ్‌:  అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కళావతి నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా..? నేను నిన్ను మనఃస్పూర్తిగా ప్రేమిస్తున్నానని  నమ్ముతున్నావా..?

కావ్య: నమ్ముతున్నాను

రాజ్‌: అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి కళావతి.. నెల తప్పలేదు అనుకుంటావో..అసలు ప్రెగ్నెంట్‌ కాలేదని అనుకుంటావో కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయ్‌

కావ్య: ఎందుకు చేయాలి.. నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ ఈ అబార్షన్ చేయించుకోను ఏదైనా మార్చుకోవాలంటే.. అది మీ నిర్ణయమే మార్చుకోండి నేను మాత్రం అబార్షన్‌ చేయించుకోను

అని ఏడుస్తూ కావ్య వెళ్లిపోతుంది. తర్వాత ఇంట్లో విషయం తెలుస్తుంది. అందరూ రాజ్‌ను తిడతారు. రాజ్‌ మాత్రం తన నిర్ణయం మార్చుకునేది లేదని రేపు నాతో వచ్చి కళావతి అబార్షన్‌ చేయించుకోవాలని చెప్పి వెళ్లిపోతాడు. అందరూ ఏడుస్తూ ఉంటారు. కట్‌ చేస్తే రుద్రాణి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది. ఈ రాజ్‌ గాడు చేసే పనులు చూస్తుంటే.. పిచ్చి ఎక్కుతుంది ఇక ఈ ఇంట్లో ఉండను అంటూ బట్టలు సర్దుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!