Nindu Manasulu Serial Today Episode విజయానంద్ బెయిల్ ఇప్పించాడని తెలిసి సిద్ధూ బెయిల్ వద్దని చెప్పేస్తాడు. ఏం ఉన్న కోర్లులోనే తేల్చుకుంటా ఎవరో సంబంధం లేని వాళ్లు చేసిన సాయం నాకు అవసరం లేదు అని అంటాడు. ప్రేరణ సిద్ధూ మీద కోప్పడుతుంది. తెలిసిన వాళ్లో తెలియని వాళ్లు ఎవరో ఎందుకో ఒక అందుకు సాయం చేశారు కదా చక్కగా బెయిల్ మీద బయటకు వెళ్లొచ్చు కదా నాకు అయితే కనీసం ఎవరూ లేరు నీకు ఎవరో ఒకరు ఉన్నారు కదా సంతోషంగా బెయిల్ మీద బయటకు వెళ్లొచ్చు కదా అని అంటుంది.
ప్రేరణ గారు మీకు అర్థం కావడం లేదు.. ఇక్కడ జరుగుతుంది వేరు.. అయినా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్తే మన మీద కేసు కొట్టేసినట్లు కాదు.. మనం నిర్దోషులం అని కూడా కాదు ఎవరో ఇచ్చిన బెయిల్ వల్ల మనం కేవలం ఈ రోజు రాత్రి స్టేషన్‌లో ఉండకుండా బయటకు వెళ్తాం అంతే.. మన మీద నింద అలాగే ఉంటుంది. కోర్టుకి వెళ్లకుండా ఆపలేరు. ఈ ఒక్క బెయిల్ పేపరుతో నన్ను నా జీవితాన్ని ఉద్దరించేశాను అని చెప్పుకునేవాళ్లు ఉన్నారు బయట. అలా నేను దిగజారిపోను మనం కోర్టుకి వెళ్లడానికి ఇంకా టైం ఉంది మనం తప్పు చేయలేదు మన నిజాయితే మనల్ని కాపాడుతుంది. ఇలాంటి బెయిల్ మీద వెళ్లడం కంటే జైలులో ఉండిపోవడమే బెటర్. ఎవరు ఏం చేసినా నేను ఏం తప్పు చేయలేదు అని రుజువు అయిన తర్వాతే ఇక్కడ నుంచి బయటకు వెళ్తా.. ఏంటి విశ్వాసం అలా చూస్తున్నావ్ వెళ్లి మీ మర్రిచెట్టుకు చెప్పు నాకు బెయిల్ అవసరం లేదు అని అంటాడు.
గణ విశ్వాసాన్ని తీసుకొని బయటకు వెళ్తాడు. సిద్ధూ ఏం అన్నాడని విజయానంద్ అడిగితే దానికి గణ ఉమ్మేయడం తప్ప అన్ని మాటలు అనేశాడు మీ తొక్కలో సాయం వాడికి అవసరం లేదు అంట.. మీరు తెచ్చిన బెయిల్ వాడి కాలి దూళితో సమానం అంట అని సిద్ధూ అన్న మాటల్ని విజయానంద్‌కి చెప్పి వెటకారంగా గణ నవ్వుతాడు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లిపోండి సార్ టైం వేస్ట్ అని అంటాడు. విజయానంద్ వెళ్లిపోతాడు.
ఇందిర ఇంటికి వెళ్తుంది. రంజిత్ ఫోన్ ఇవ్వలేదని ఐశ్వర్య తల్లికి చెప్పి ఇంత లేటు ఎందుకు అయింది. అక్క కూడా రాలేదు అని ఫోన్ చేయమని అంటుంది. ఇందిర ఏడుస్తూ ప్రేరణ అరెస్ట్ అయిన విషయం చెప్తుంది. రంజిత్‌ని అలా చేయమని తానే చెప్పానని అంటుంది. ఇదంతా గణ కావాలనే చేశాడు.. పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని అంటుంది. ఇందిర వద్దని అంటుంది. ఈ రాత్రి అంతా అక్క పోలీస్ స్టేషన్‌లో ఉండాలా అని ఐశ్వర్య ఏడుస్తుంది.
ఇంతలో రంజిత్ వచ్చి ప్రతీ రోజు భోజనం పెట్టమని అడగాలా పెట్టరా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటాడు. ఐశ్వర్య కోపంగా ఎదుటి వారు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు అవసరం లేదా ఎంత సేపు మీ రూల్స్ మీ తిండి ఇదేనా అని నిలదీస్తుంది. రంజిత్ అవేమీ పట్టించుకోకుండా భోజనం పెట్టమని అంటాడు. ఐశ్వర్య కోపంగా భోజనం వడ్డిస్తుంది. తినండి బాగా తినండి అని అంటుంది. రంజిత్ ఏం పట్టించుకోకుండా తినేసి ఇంక ఎవరూ రారు కదా.. తాళం వేసేస్తా అని అంటాడు. రంజిత్ మాటలకు ఐశ్వర్యకు కోపం కట్టలు తెంచుకుంటుంది.
విజయానంద్ ఇంటికి వెళ్లి సిద్ధూ తాను ఇచ్చిన బెయిల్ వద్దని అనేశాడని కోర్టులో తేల్చుకుంటా అని చెప్పేశాడు నేను బెయిల్ ఇప్పించడం వాడికి ఇష్టం లేదు పంతం పట్టేశాడు అని చెప్తాడు. వెంటనే మంజుల సిద్ధూకి కాల్ చేస్తుంది. గణ చూసి అమ్మ కాల్ చేస్తుంది. పాపం తమరు ఎలా ఉన్నారో అని భయపడిపోతున్నారు.. మాట్లాడు మీరు ఇక్కడ చాలా బాగున్నారు., నేను బాగా చూసుకుంటున్నా అని చెప్పు కుదిరితే జీవితాంతం ఇక్కడే ఉంచేస్తా అని చెప్పు హ్యాపీగా ఫీలవుతారు అని సిద్ధూకి ఫోన్ ఇస్తాడు. ఎందుకురా అంత మొండితనం.. ఎందుకు అంత పట్టుదల నువ్వు మారవా అని అడుగుతుంది. నువ్వు మారలేదు కదా నువ్వు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నువ్వు కోప్పడేవాడికి కానీ నీ కొడుకు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాడా అని బాధ పడుతున్నావ్ అంటాడు. దానికి మంజులు నువ్వు నా కొడువురా నువ్వే తప్పు చేయవు నాకు ఆ నమ్మకం ఉంది అని మంజుల అంటే ఇది చాలమ్మా నేను ఏ తప్పు చేయకుండా బయటకు రావడానికి అంటాడు. నా ప్రేమ సరిపోదురా మీ నాన్న పలుకుబడి కావాలి అని మంజుల అంటే అమ్మా అని సిద్ధూ అంటాడు. నేను తప్పు చేశానని నువ్వు నమ్మితే నేను బెయిల్ తీసుకుంటా.. లేదు నా కొడుకు తప్పు చేయడు అని నువ్వు నమ్మితే నాకు ఎవరి సాయం అవసరం లేదమ్మా.. నేను నీ కొడుకుని తప్పు చేయను.. నేను బయటకు రాగలను.. నీ నమ్మకమే నన్ను బయటకు తీసుకొస్తుంది నువ్వు భయపడకమ్మా అని ఫోన్ కట్ చేసేస్తాడు. ఉదయం సిద్ధూ ప్రేరణతో భయపడొద్దు మనం ఏం తప్పు చేయలేదు నిర్దోషిలా బయటకు వస్తాం అని అంటాడు. ఇక సుధాకర్ ప్రేరణతో సారీ అమ్మ మామయ్య అయి కూడా నేను ఏం చేయలేకపోయాను.. నన్ను క్షమించు అంటాడు. ప్రేరణ, సుధాకర్ మాట్లాడుకోవడం గణ చూసి దగ్గరకు వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.