Meghasandesam Serial Today Episode: వీడియో రికార్డర్‌ శారద దగ్గర ఉందని తెలుసుకున్న రత్న, శారద దగ్గరకు వెల్లి బెదరించి రికార్డర్‌ తీసుకోవాలని చూస్తుంది. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. దీంతో శారద్ కిచెన్‌లో ఉన్న కారం రత్న కళ్లల్లో కొట్టి  తప్పించుకుని వెళ్లి రూంలో దాక్కుంటుంది. రూంలో ఉన్న శారద వీడియో మొత్తం చూశాక కేపీని గుర్తు చేసుకుని బాధపడుతుంది.

శారద: నా భర్త ఏ నేరం చేయలేదు. అపూర్వ తన స్వార్తంతో ఆస్థి కోసం చేసిన కుట్రలో బలైపోయాడు. మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు దూరం అయ్యాడు. ఇన్నేళ్లు ఇంత మంది జీవితాలతో ఆడుకున్న అపూర్వను ఊరికే వదలిపెట్టను. తగిన శిక్ష పడేలా చేయాలి. ముందు ఈ విషయం భూమికి చెప్పాలి. అపూర్వ ఇంత దుర్మార్గురాలా..? డబ్బు కోసం ఇంత దిగజారుతావా..? శోభాచంద్ర గారిని చంపి నువ్వు ఆ స్థానంలోకి వస్తావా..? అసలు నువ్వు మనిషివే కాదు మృగానివి..

అనుకుంటుంది. శారద ఫోన్‌ చేసి భూమికి నిజం చెప్తుంటే.. డాన్స్‌ సౌండ్‌కు భూమికి వినిపించదు. దీంతో భూమి ఫోన్‌ కట్‌ చేస్తుంది. ఇంతలో కిచెన్‌ లోంచి బయటకు వస్తుంది రత్న. మీద మొత్తం కారం పొడి పడి ఉంటుంది. రత్న సౌండ్‌ విని శారద బెడ్‌ రూంలోకి వెల్లి లాక్‌ చేసుకుంటుంది.

రత్న: మంట.. మంట.. ఒసేయ్‌ శారద ఎక్కడ చచ్చావే.. ఒసేయ్‌ శారద.. ఎక్కడున్నావే..? శారద.. చ ఇక్కడ కూడా లేదేంటి.. అయ్యో మంట.. శారద ఎక్కడున్నావే..

అంటూ ఇల్లంతా వెతుకుతుంది. మరోవైపు అపూర్వ ఇంట్లో రత్న ఫోన్‌ కోసం వెయిట్‌చేస్తుంది. ఇంకోవైపు భూమి డాన్స్‌ స్కూల్ లో డాన్స్‌ నేర్పిస్తుంది. ఇక రత్న వెంటనే ఆ విషయం అపూర్వకు చెప్పాలని ఫోన్‌ చేస్తుంది. అపూర్వ ఫోన్‌ సైలెంట్‌ లో ఉంటుంది.

అపూర్వ: రత్నాన్ని ఆ ఇంటికి పంపించి చాలా రోజులైంది అయినా ఆ కెమెరా దొరకలేదు.. మాత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు నా ప్రాణాలు ఆ కెమెరాలో ఉన్నాయి.

అంటూ టెన్షన్‌ పడుతూ అటూ ఇటూ తిరుగుతుంది. డాన్స్‌ స్కూల్ లో ఉన్న భూమి మళ్లీ శారదకు ఫోన్‌ చేస్తుంది. శారద ఫోన్‌ లిప్ట్‌ చేయదు. దీంతో అనుమానంగా భూమి ఇంటికి వెళ్తుంది.  అత్తయ్యా అంటూ ఇల్లంతా వెతుకుతుంది. భూమి మాటలు విన్న శారద కిందకు వెళ్తుంది. భూమి పైకి వెళ్తుంది. ఇంతలో కింద ఎవరో డోర్‌ కొట్టిన సౌండ్ విని శారద వెళ్లి డోర్‌ తీస్తుంది. డోర్‌ ముందు ఎవరో ముసుగు వేసుకుని వచ్చి తుపాకీ తీసి శారదను కాల్చేస్తాడు. శారద చేతిలోని కెమెరా సోపా కిందకు పడిపోతుంది. కింద బుల్లెట్‌ సౌండ్ విన్న భూమి కిందకు పరుగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే ముసుగులో వచ్చిన వ్యక్తి పారిపోయి ఉంటాడు. శారద కింద పడి నెత్తుటి మడుగులో కొట్టుకుంటుంది. భూమి పరుగెత్తుకుంటూ వచ్చి శారదను తన ఒడిలో పడుకోబెడుతుంది. శారద ఏడుస్తూ భూమి నీకో విషయం చెప్పాలి అంటూ స్పృహ కోల్పోతుంది. మరోవైపు అపూర్వ రత్న, తాను పంపించిన ముగుసు వ్యక్తి ఫోన్‌ కోసం వెయిట్‌ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!