గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 19 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 19 Episode)

ఫర్నిచర్ షోరూం నుంచి ఇంటికెళ్లిన రోహిణి, మనోజ్..బాలుని టార్గెట్ చేస్తారు. మరోవైపు శ్రుతి కూడా మా అమ్మ నాకోసం పంపిస్తే నీకేంటని నిలదీస్తుంది. ప్రభావతి ఎప్పటిలా మీనాను టార్గెట్ చేస్తూ..వాడితో నువ్వే పని చేయించావా అని అడుగుతుంది. అసలు సోఫా వచ్చినప్పుడు నేను ఇంట్లోనే లేను..అయినా ఎవరు ఎవర్ని రెచ్చగొట్టి పంపించారో అర్థం అవుతోందని సెటైర్ వేస్తుంది. నీ చేతినుంచి బోణీ చేయమని మావయ్యయ చెప్పారు..శ్రుతి వాళ్లమ్మ చేయి మంచిదని బోణీ చేశాం.. కక్షతోనే ఇదంతా మీరు చేశారు కదా అని టార్గెట్ చేస్తుంది రోహిణి. మొదట అమ్ముడైన వస్తువు రిటర్న్ వస్తే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని నిలదీస్తుంది రోహిణి. ఆవిడ చేయి మంచిదనే కదా బోణీ చేయించారు మరి ఎందుకిలా జరిగిందని మీనా నిలదీస్తుంది. రోహిణి-మనోజ్-ప్రభావతి షాక్ అయి చూస్తారు.

ఇదంతా తన తల్లి గురించే కావడంతో శ్రుతి కూడా సీరియస్ గానే తీసుకుంటుంది. ఎప్పుడూ బాలు మీనాను సపోర్ట్ చేసే శ్రుతి కూడా బాలుపై ఫైర్ అవుతుంది. రవి శ్రుతికి సపోర్ట్ చేస్తుంటే..నైటీలేసుకునేవాడా నువ్వు ఆగు అని ఆడేసుకుంటాడు బాలు. హర్ట్ అవుతుంది శ్రుతి. ఆవిడ బోణీ చేసి ఇచ్చిన డబ్బులు డీలర్ కి ఇచ్చేశాను.. ఆవిడకు డబ్బులిచ్చేందుకు రోహిణి తన తాళిబొట్టు తాకట్టు పెట్టిందని చెబుతాడు మనోజ్. అంతా షాక్ అవుతారు. ఇంటికోడలికి అంత ఖర్మ పట్టిందంటే అంతా నీవల్లే అని బాలుపై ఫైర్ అవుతుంది ప్రభావతి. అయితే ఇదే ఇంటి కోడలు అయిన మీనా...చాలా రోజులు పసుపు తాడు వేసుకునే తిరిగింది.. విషయం మర్చిపోయావా తాడావతి అని బాలు సెటైర్ పేల్చుతాడు. దానికి - రోహిణికి పోలికేంటని మళ్లీ మీనాను అవమానిస్తుంది.

ఇదంతా వాళ్లు కావాలనే చేశారని మీనా బాలుతో అంటుంది. నువ్వు నిజం తెలుసుకున్నావా...ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నావా ? నిజం అర్థమైంది కదా అంటాడు.

శ్రుతి బాధపడుతుండగా వెళతాడు రవి. మా అన్నయ్య తప్పుచేశాడని రవి అనడంతో షాక్ అవుతుంది శ్రుతి.  నువ్వు నిజంగానే ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతుంది. నేను నిజం ఎటుంటే అటు మాట్లాడుతాను నువ్వే అర్థం చేసుకోలేదు అంటాడు. బాలు అన్నయ్య ఓ మాట మనకు చెప్పాల్సింది అంటాడు.. అదే టైమ్ లో మీ అమ్మ కూడా సోఫా కొంటున్నట్టు ఓ మాట చెప్పాల్సింది అంటాడు. సర్ ప్రైజ్ ఇద్దాం అనుకుందేమో అంటుంది. అయినా ఓ మాట మా నాన్నకి చెప్పి ఉంటే బావుండేది అంటాడు.

రోహిణి పార్లర్ కి వెళుతుండగా ఇలానే వెళతావా మెడలో పసుపు తాడుతో అని అడుగుతుంది. తప్పదు కదా అత్తయ్యా అని జీవించేస్తుంది రోహిణి.  ఎంతకు తాకట్టు పెట్టావో చెప్పు డబ్బులు సర్దుతాను అంటుంది. వద్దు అత్తయ్యా నాకు అలవాటే అంటుంది.  ఆ మీనా చేసిన పనే ఇదంతా అని ఫైర్ అవుతుంది.   ఇంతలో శ్రుతి వచ్చి...బాలు తప్పు చేస్తే మీనాను ఎందుకు అంటారని నిలదీస్తుంది. మా అమ్మ సోఫా రిటర్న్ ఇచ్చేసి డబ్బులు వెంటనే అడిగిందా? మెడలో పసుపుతాడు వేసుకుని తాళి అమ్మేసి ఇమ్మందా? అని గట్టిగానే అడుగుతుంది. లేదు అని చెబుతుంది రోహిణి. అన్నీ మీకు తెలిసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీస్తుంది శ్రుతి