Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ ఒకే బైక్ మీద వెళ్లి దొంగతనం చేసినట్లు గణ పక్కా సాక్ష్యాలు చూపిస్తాడు. సేమ్ డ్రస్సులు, సేమ్ బైక్, నెంబరు ప్లేట్‌తో సహా ఒకేలా ఉన్నాయని ఈ సాక్ష్యాలు చాలా.. నేనేదో మీ మీద కక్షతో ఇలా చేశానని అనుకుంటున్నారేమో.. మీ మీద నాకు ఎందుకు కక్ష ఉంటుంది. మీరు ఎవరో నేను ఎవరో.. అంతా దైవ లీల మన చేతిలో ఏం ఉండదు అని గణ అంటాడు.
ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ గణని కోపంగా చూస్తారు. సుధాకర్ వెంటనే ఇందిరకు కాల్ చేసి విషయం చెప్తాడు. అమ్మాయి కేసులో ఇరుక్కుపోయింది అక్క.. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అక్కా.. మన ప్రేరణ తప్పు చేయదు కానీ తప్పు చేసినట్లు సాక్ష్యాలు ఉన్నాయి అక్కా ఇదంతా గణ గాడి కుట్రలా ఉందక్క అని చెప్తాడు. ఇందిర చాలా ఏడుస్తుంది. సుధాకర్ ఇందిరతో ఏడ్వకు అక్క నేను ముందు ఈ విషయం నీకు చెప్పింది వేరే వాళ్ల వల్ల ఈ విషయం నీకు తెలియకూడదు అని నేనే చెప్పాను. అంతే కాదు నువ్వు పోలీస్ స్టేషన్‌కి కూడా రావొద్దు.. నువ్వు వస్తే గణకి విషయం తెలిసిపోతుంది. నువ్వు రావొద్దు అంతా నేను చూసుకుంటా ఏదో ఒకటి చేస్తా అని అంటాడు. ఇందిర చాలా ఏడుస్తుంది.
మరోవైపు కుమార్ సాహితికి కాల్ చేసి విషయం చెప్తాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు వెంటనే ఈ విషయం మీ అమ్మానాన్నలకు చెప్పి ఏదో ఒకటి చేయ్ సాహితి అని చెప్తాడు. సాహితి మంజుల, విజయానంద్‌కి విషయం చెప్తుంది. అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటే అని మంజుల షాక్ అయిపోతుంది. సిద్ధూ ఏంటి చైన్ దొంగతనం ఏంటి అని విజయానంద్ అంటే అది అబద్ధం అని మంజుల అరుస్తుంది. ఎక్కడో ఏదో జరిగింది.. ఏ స్టేషన్ పోలీసులు ఇంతకి దిగజారారో తెలుసుకోండి.. వెంటనే వెళ్లి మన సిద్ధూని తీసుకొచ్చి ఎవర్ని ఏ కేసులో అరెస్ట్ చేశారో ఆలోచించమని చెప్పి నాలుగు చీవాట్లు పెట్టండి అని అంటుంది. విజయానంద్ వెళ్లడానికి ఆలోచిస్తే మీరు వెళ్తారా నేను వెళ్లాలా.. అని మంజుల అంటే నేనే వెళ్తాను మన కొడుకుని అరెస్ట్ చేసిన వాళ్ల అంతు చూస్తా అని విజయానంద్ ఆవేశంగా బయటకు వస్తాడు.
బయటకు వచ్చి పీఏతో నాకు కాఫీ కావాలి.. తీసురా.. సిద్ధూ కరెక్ట్ ప్లేస్‌లో ఉన్నాడురా.. నాలుగు రోజులు ఉండనీ ఎలాగూ పోలీసులు అంతా మన వాళ్లే కదా.. తర్వాత బయటకు తీసుకొద్దాం అంటాడు. విశ్వాసం విజయానంద్‌తో సిద్ధూ బాబుతో పాటు ప్రేరణ ఉంది సార్.. వాళ్లని అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా గణ.. ట్రాఫిక్ ఎస్‌ఐగా ఉన్న గణ నేరుగా సీఐగా ప్రమోట్ అయ్యాడని చెప్తాడు. విజయానంద్ షాక్ అయిపోతాడు.
రంజిత్‌కి ఐశ్వర్య కాఫీ ఇస్తుంది. ఇంతలో రంజిత్‌కి ఇందిర కాల్ చేస్తుంది. ఫోన్ మాట్లాడాలి పక్కకి వెళ్లు అని రంజిత్ ఐశ్వర్యని పంపేస్తాడు. ఇందిర అనగానే రంజిత్ మర్చిపోతాడు. ఇందిర తాను రెంట్‌కి ఉందని గుర్తు చేసి ప్రేరణని అరెస్ట్ చేశారు వచ్చే సరికి లేట్ అవుతుందని అంటుంది. దానికి రూల్స్ రంజిత్ సరే వచ్చాక చెప్పండి గేట్ తీస్తా అంటాడు. అది కాదు బాబు మా పెద్దమ్మాయి అరెస్ట్ విషయం చిన్నమ్మాయికి తెలీకూడదు.. తెలిస్తే పోలీస్ స్టేషన్‌కి వచ్చి హడావుడి చేస్తుంది.. తను ఎలా అయినా బయటకు రాకుండా చూడండి అని చెప్తుంది.
రంజిత్ ఐశ్వర్య ఫోన్ అడిగి సైలెంట్‌లో పెట్టేస్తాడు. ఐశ్వర్య ఫోన్ అడిగితే నీ ఫోన్‌తో పని ఉంది పని అయ్యాక ఇస్తా అని తీసుకెళ్లిపోతాడు. నా ఫోన్ నా ఫోన్ అని ఐశ్వర్య అంటే ఈ రోజు నీ బాధ్యత నాది అంటాడు. వీడికి ఏమైంది అని ఐశ్యర్య అంటుంది. మరోవైపు విజయానంద్ మినిస్టర్‌కి కాల్ చేసి గణని ఇబ్బంది పెడదాం అనుకుంటే మీరేంటి సీఐ పోస్ట్ ఇచ్చారు.. వాడు సీఐ పోస్ట్‌లో ఉంటే నాకు ప్రమాదం..వాడు నా కొడుకుని అరెస్ట్ చేశాడు అని చెప్తాడు. గణ లాంటి వాడు డ్యూటీలో ఉండాలయ్యా లేదంటే ఎవరెవరో ఏవేవో వీడియోలు తీసేస్తారు అని అంటాడు. వీడియోలు ఏంటి అని విజయానంద్ అనుకొని మినిస్టర్ ఎందుకో భయపడుతున్నాడు.. గణ ఏదో చేశాడురా అని అనుకుంటారు.
విజయానంద్ బయట ఉండటం మంజుల, సాహితి చూసి ఇక్కడే ఉన్నారేంటి అని అంటే మినిస్టర్‌తో మాట్లాడాను అని అంటాడు. ఇక్కడే ఉండి డిలే చేస్తారు ఏంటి.. అసలు నా బిడ్డని అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి ఉందో నాకు తెలియాలి ఇప్పుడే వెళ్లండి అని అంటుంది. గణ సుధాకర్‌తో ఎఫ్‌ఐఆర్ రాశావా అంటాడు. లేదు సార్ వీళ్లు సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారని తెలిసింది అందుకే రాయలేదు సార్ అంటే వాళ్లు నేరం చేశారు వాళ్లేం చేస్తే మనకు ఏంటి పోలీసులకు అందరూ సమానమే నువ్వు ఎఫ్‌ఐఆర్ రాయు అని అంటాడు.
సుధాకర్ ఎఫ్‌ఐఆర్ రాయడానికి రెడీ అవుతూ ప్రేరణ వాళ్లకి సైగ చేస్తాడు. ఇద్దరూ ఎఫ్‌ఐఆర్ రాసినంత మాత్రాన మేం తప్పుచేసినట్లు కాదు.. కోర్టు మేం తప్పు చేసినట్లు నమ్మితేనే శిక్ష పడుతుందని మేం ఏం తప్పు చేయలేదని సాక్ష్యాలు వాటి అంతట అవే వస్తాయి అని అంటాడు సిద్ధూ.. ఎవరికీ ఇవ్వని అవకాశం ఈ రోజు మీకు నేను ఇస్తా.. ఇప్పటి నుంచి మీ ఫోన్స్ మీ దగ్గరే ఉంటాయి.. మీరు తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఎవరికైనా ఫోన్ చేసుకోండి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అని అంటాడు.
కుమార్ పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. అదిగో ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడుకోండి అని అంటాడు. సిద్ధూ కుమార్‌తో మేం 10:40కి దొంగతనం చేశాం అంటున్నాడు.. కానీ మేం ఆ టైంకి విశ్వనాథ్ గారి ఇంట్లో పరీక్ష రాస్తున్నాం. ఆయన ఇంటి బయట సీసీ టీవీ ఫుటేజ్ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనైనా మాకు ఫుటేజ్ కావాలిరా అని సిద్ధూ కుమార్‌ని పంపిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.