Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ, కుమార్‌లను విశ్వనాథ్‌ గారు కాఫీ షాప్ పెట్టుకోవడానికి తన పాత ఇల్లుని చూపిస్తారు. బ్రహ్మాండంగా ఉందని అంటారు. అందరూ అట్రాక్ట్ అయ్యేలా డిజైన్ చేయాలని సిద్ధూ అంటాడు. ఇది మా ఆవిడకు నచ్చిన ప్రోపర్టీ తన పరిస్థితి తెలుసుకదా అందుకే దీన్ని మేం వాడటం లేదు అందుకే మీకు ఇస్తున్నాం.. మీఈ ప్రయత్నం మీ ఆకలి తీర్చుతుంది కానీ చదువు మాత్రం మీకు గుర్తింపు ఇస్తుందని విశ్వనాథ్ అంటారు.

Continues below advertisement

ప్రేరణ సిద్ధూ ఇద్దరూ సక్సెస్‌తోనే థ్యాంక్స్ చెప్తాం సార్ అని అంటారు. ప్రేరణ, సిద్ధూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. స్టడీ కేఫ్‌ని బాగా డిజైన్ చేయాలి అనుకుంటారు. తర్వాత ప్రేరణ ఇంటికి వెళ్తుంది. అమ్మ ఎక్కడా అని ఐశ్వర్యని అడుగుతుంది. ఇంకెక్కడ అమ్మ నువ్వు వెళ్లొద్దని చెప్పినా.. నేను ఎంత పట్టు పట్టినా వినకుండా వెళ్లిపోయింది అని చెప్తుంది. మాట వినే మానసిక స్థితిలో ఉందా మన అమ్మ వద్దు వద్దు అన్నా వినకుండా వెళ్లిపోయింది అని చెప్తుంది. ఇంతలో ఇందిర వస్తుంది. ప్రేరణ కోపంగా చూస్తుంది. ఎందుకు వెళ్లావ్ అని అడుగుతుంది. కూతురు చెప్పిన మాట కన్నా నేను పడే ఆందోళన కన్నా నీకు నీ పట్టుదలే ఎక్కువ అయిపోయింది కదా.. ఇన్నాళ్లు మాకు చెప్పకుండా అక్కడికి వెళ్లి మమల్ని మోసం చేశావ్.. కానీ ఇప్పుడు చెప్పి మోసం చేయాలి అని ఎలా అనిపించింది.. నువ్వు అక్కడికి వెళ్తే రాబోయే ప్రమాదం నీకు పట్టడం లేదా.. వాడి చేతుల్లో నువ్వు చావాలి అనుకుంటున్నావా.. నువ్వు చచ్చి మమల్ని అనాథల్ని చేయాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. 

ఇందిర ఏడుస్తూ నేను ఎవరినీ మోసం చేయడం లేదే మీ నాన్నని కాపాడుకోవాలని అనుకుంటున్నాను.. మీ నాన్న పరిస్థితి మీకు తెలీదు అని అంటుంది. నాన్న గురించి నాకు తెలీకపోవడం ఏంటి నేను వెళ్లున్నా కదా నాన్న మామూలు మనిషిగా తిరిగి వస్తారు అని ప్రేరణ అంటుంది.  అలా ఎప్పటికీ జరగదే మీ నాన్న మాట్లాడరు.. తిరగరు.. ఆ గణ అలా చేయనివ్వడు. మీ నాన్నని అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడం కాదు కదా నాన్నకి సరిగా వైద్యం జరగడం లేదు.. అందించాల్సిన వైద్యం ఆపించేశాడు. మందులు మార్చి ఇస్తున్నాడు అని డాక్టర్‌ని కలిసి చెప్పిన విషయాలు చెప్తుంది. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం అని సుధాకర్ చెప్తాడు. మీ నాన్న నోరు తెరవకూడదు అని జీవితాంతం ఆయన మంచానికే పరిమితం అవ్వాలని ఇలా చేశాడు.. నేను తెగించి ఆ ఇంటికి పని మనిషిగా వెళ్లడం వల్లే ఇదంతా తెలిసింది అని ఇందిర అంటుంది. 

Continues below advertisement

ప్రేరణ ఆవేశంగా వెళ్తుంటే ఇందిర ఆపి ఎక్కడికి అంటుంది. అక్కడితే ఈ రోజు వాడో నేనో తేల్చుకుంటా అంటుంది. సుధాకర్ వాళ్లు వద్దని చెప్తారు. అయినా ప్రేరణ ఒంటరిగా వెళ్తానని అంటుంది. ఎంత చెప్పినా వినకుండా గణ ఇంటికి డాక్టర్‌ని తీసుకెళ్తుంది. ఇలా వచ్చావేంటి అని ఈశ్వరి అడిగితే మా నాన్నని డాక్టర్‌కి చూపిస్తాను అంటుంది. నువ్వు ఎవరే చూపించడానికి అని గణ అడ్డుకుంటాడు. ఈశ్వరి కూడా ఒప్పుకోదు. మా నాన్న ఆరోగ్యం విషయంలో నువ్వు ఏం తప్పు చేయకపోతే నన్ను డాక్టర్‌ని కలవనివ్వు.. లేదంటే నువ్వు ఏదో కుట్ర చేశావని అనుకుంటా అంటుంది. ఈశ్వరి అడ్డుకొని నా భర్తకి మేం సరిగా వైద్యం చేయించడం లేదు అనడానికి సిగ్గు లేదా మీరు గాలికి పుట్టారు వాడు రాజశేఖరం వారసుడు అంటాడు. గణ వైద్యానికి ఒప్పుకోను అంటే ఈశ్వరి ప్రేరణతో మేం సరైన వైద్యం ఇప్పిస్తామని తెలిస్తే నువ్వు ఇక ఎప్పటికీ ఈ ఇంటికి రాకూడదు.. నీ ఫ్యామిలీని తీసుకొని హైదరాబాద్ వదిలేసి వెళ్లిపోవాలి అంటుంది. ప్రేరణ ఛాలెంజ్‌కి ఒప్పుకుంటుంది. డాక్టర్ రాజశేఖరాన్ని పరిశీలించి వైద్యం సరిగా జరగడం లేదని.. అతను బతకడానికి మాత్రమే మందులు ఇస్తున్నారని.. రోజు రోజుకి అతని మైండ్ మొద్దు బారిపోతుందని.. ఇలా అయితే బతకడం కష్టం.. బతికినన్నినాళ్లు ఆయన బెడ్‌కే పరిమితం అయిపోతారని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.