Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా పురుషోత్తానికి కాల్ చేసి ఎమ్మెల్యే దేవుడమ్మ తనని పిలిచి.. వచ్చే ఎలక్షన్‌లో సపోర్ట్‌ చేయమని అడిగిందని రెండు కోట్లు ఆఫర్ చేసిందని అంటుంది. నువ్వేం చెప్పావ్ అని పురుషోత్తం అడిగితే దేవాకి వినిపించదు.. ఛార్జింగ్ లేక ఫోన్ కట్ అయిపోతుంది.

Continues below advertisement

దేవా ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తాడు. మిథున కూడా వెనకాలే వెళ్తుంది. ఇక రంగం, కాంతం రెండు రోజుల కోసం నాలుగైదు పెద్ద పెద్ద బ్యాగ్‌లు తీసుకొస్తారు. ఏంటి ఇవన్నీ అంటే మా అమ్మకి పట్టుచీర, నాన్నకి పట్టు బట్టలు, తమ్ముడికి బట్టలు తీసుకున్నాం అనుకున్నారా అని కవర్ చేస్తారు. ఎక్కువ లాగకు దొరికిపోతాం అని రంగం అంటాడు. ఇక శారద కాంతంతో దేవా, మిథునలు ఎక్కడున్నారో చూడండి అని అంటుంది. దేవా, మిథున లేరు అని చెప్పి అందరూ వెళ్లి ఇంటికి తాళం వేసేస్తారు. 

దేవా, మిథునలు ఇంటి లోపలే ఉంటారు. దేవా ఫోన్ ఛార్జింగ్ పెడితే మిథున పర్స్ తీసుకుంటుంది. దేవా బయటకు వెళ్తుంటే మిథున ఆపాలని చూస్తుంది. నా కంటే నీకు పురుషోత్తం అన్నే ఎక్కువ అయిపోయాడా అని మిథున అడుగుతుంది. అవును ఎక్కువే అని దేవా అంటాడు.  నా కంటే నీకు పురుషోత్తం అన్నతో మాట్లాడటమే ఎక్కువ కదా ఉండు చెప్తా అని మిథున దేవా ఫోన్ లాక్కుంటుంది. దేవా ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. ఇద్దరి మధ్య గిల్లిగజ్జాలు జరుగుతాయి. ఆ టైంలో దేవా ఫోన్ కింద పడి పగిలిపోతుంది. నా ఫోన్ పోగొడతావా అని దేవా మిథున ఫోన్ కూడా కింద విసిరేస్తాడు. మొత్తానికి ఇద్దరి ఫోన్లు పోతాయి. పురుషోత్తం దేవాకి ఫోన్ చేస్తూనే ఉంటాడు కానీ ఫోన్ అవ్వదు. 

Continues below advertisement

దేవా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు దేవా గ్యారేజ్‌కి వెళ్దాం అని పురుషోత్తం అంటాడు. ఇక మిథున దేవాతో ఫోన్లు రిపేయ్ చేయడానికి వెళ్దామని డోర్ తీయడానికి వెళ్తారు. డోర్ లాక్ అయిపోయి ఉంటుంది. మనం గుడి వెళ్లిపోయాం అని అనుకొని తలుపు వేసేశారు అని మిథున నవ్వుతుంది. మిథున దేవాతో మన ఇద్దరమే కలిసి ఉండాలి అర్థమైంది కదా రాజా అని అంటుంది. దానికి దేవా తలుపులు బద్దల కొట్టుకొని అయినా వెళ్లిపోతా కానీ నీతో కలిసి ఉండను అని అంటాడు. మిథున చూపు, మాట కొత్తగా ఉందని దేవా అంటే ఇప్పుడేముంది ఇంక ముందు ముందు నీకు ఉంది రా అని అంటుంది. వస్తా వస్తా వచ్చి నీ సంగతి చెప్తా అని దేవా అంటాడు.

దేవా కోసం పురుషోత్తం గ్యారేజ్‌కి వస్తాడు. దేవా గురించి అడుగుతాడు. దేవా గ్యారేజ్‌కి రాలేదని దేవా ఇప్పుడే రమ్మనిచెప్పాడని ఇంటికి వెళ్తున్నానని అంటాడు. దానికి పురుషోత్తం మనసులో దేవా మనసులో ఏం ఉందో ఎలా తెలుసుకోవాలి అనుకుంటాడు. పైకి మాత్రం త్వరగా దేవాని తీసుకురమ్మని చెప్తాడు. దేవాని నా నుంచి దూరం చేయాలని మిథున, దేవుడమ్మ ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు.. దేవాని ఎలా అయినా నా వైపు ఉంచుకోవాలి.. అనవసరంగా ఆదిత్య మాటలు విన్నానని పురుషోత్తం అనుకుంటాడు. 

మిథున కమ్మగా వంట చేస్తుంది. దేవా తలుపు తీయాలని ఎంత ప్రయత్నించినా రాదు.. మిథున దేవాని చూసి అటూ ఇటూ తిరిగే కంటే నా వైపు చూస్తూ ఉండు అని అంటుంది. మిథున మాటలకు దేవా ఈ టార్చరేంట్రా బాబు అని అనుకుంటాడు. దేవా ఫోన్ పట్టుకొని ఫోన్ పగిలిపోయింది అని బాధ పడతాడు. మిథున కాఫీ చేసుకొని దేవాకి ఇవ్వకుండా దేవాని ఉడికించి తాగుతుంది. ఇక దేవా ఫ్రెండ్ ఇంటికి వచ్చి తాళం వేయడం చూసి ఎదురింటి వాళ్లని దేవా గురించి అడుగుతాడు. దాంతో ఆయన ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లారని చెప్తాడు. వెంటనే అతను పురుషోత్తానికి కాల్ చేసి విషయం చెప్తాడు. 

మిథున చూడకుండా దేవా కాఫీ తాగేస్తాడు. మిథున వెనకాలే నిల్చొంటుంది. దేవా మిథునని చూసి షాక్ అయిపోతాడు. చెత్తలా ఉంది అని అంటాడు. ఇక దేవాకి బైక్ సౌండ్ వినిపించి ఎవరో వచ్చారని అనుకొని కిటికీ నుంచి చూసి పిలుస్తాడు కానీ అతను వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.