Nindu Manasulu Serial Today Episode ప్రేరణ తల్లి, చెల్లితో రోడ్డున పడుతుంది. ముగ్గురూ నడుస్తూ అద్దె ఇంటి కోసం చాలా మందిని అడుగుతారు. ఎవరూ ఇళ్లు లేదని అనేస్తారు. ప్రేరణ వాళ్లకి ఇళ్లు దొరక్కూడదని గణ రౌడీలకు చెప్పడంతో వాళ్లు ఎక్కడా ప్రేరణ వాళ్లకు ఇళ్లు ఇవ్వడానికి ఇష్టపడరు. ముగ్గురు దిగులుగా నడుస్తూ ఉంటారు.
ఇందిర ప్రేరణతో మనకు ఇలాంటి గతి పట్టిందేంటని ఏడుస్తుంది. ఇంతలో సుధాకర్ వాళ్లని వెతికి వెతికి ఓ చోట కలుస్తాడు. అన్యాయం అయిపోయాంరా నానా మాటలు అని మమల్ని ఓనర్ గెంటేశాడని ఇందిర చెప్తుంది. వాడు కాకపోతే ఇంకొకడు ఇస్తాడు ఇళ్లు వెతుకుదాం పదండి అని సుధాకర్ అంటే ప్రేరణ మామయ్యని ఆపేస్తుంది. మా వల్ల ఇప్పటికే నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు.. ఇంకా మాతో ఉంటే ఆ గణ నిన్ను ప్రశాంతంగా బతకనివ్వడు. మా తిప్పలు మేం పడతాం నువ్వు వెళ్లి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో మామయ్య అని చెప్తుంది. ఇందిర కూడా అవును తమ్ముడు ప్రేరణ చెప్పింది నిజమే నువ్వు మాతో ఉంటే నీకు ప్రమాదమే అని అంటుంది. సుధాకర్ సర్ది చెప్పబోయిన ప్రేరణ తల్లి, చెల్లిన తీసుకొని వెళ్లిపోతుంది.
ప్రేరణ ఇంటి కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎవరూ ఇవ్వరు. ముగ్గురు రోడ్డు మీద నిల్చొంటారు. ఇంతలో గణ చేసి ఏంటి రోడ్డు మీద ఉన్నారా.. మీకు అంటూ ఇళ్లు ఉండదు.. ఎవరూ మీకు ఇళ్లు ఇవ్వరు అని అంటాడు. రేయ్ అని ప్రేరణ అరుస్తుంది. అరవకు అని గణ అంటాడు. దానికి ప్రేరణ నువ్వు ఒక ఏరియాకి మాత్రమే పోలీసువి ఈ సిటీకి కాదు అని అంటుంది. మీకు ఒక్క ఇళ్లు కూడా దొరకదు.. దొరకనివ్వను. రోడ్డు మీద ఉండలేక పిచ్చోళ్లా తిరిగేలా చేస్తాను నా సంగతి మీకు తెలీదు బతుకు మీద విరక్తి పుట్టి ఈ సిటీ వదిలి పారిపోయేలా చేస్తా.. వెతుకు ట్రై చేయ్.. రాత్రి కాబోతుంది మీ ఫ్యామిలీ మొత్తం ఇంటింటికి వెళ్లి ఇళ్లు ఇవ్వండి అని అడుక్కోండి ఇస్తారేమో చూద్దాం అని గణ అంటాడు.
ఇందిర ప్రేరణతో ఇప్పుడేం చేద్దాం వాడు యమబటుడిలా వెంట పడుతున్నాడని ఏడుస్తుంది. ఈశ్వరి గణతో వాళ్లు వెళ్లిపోతారా అని అడిగితే ఆడవాళ్లు కదా ఉండలేరమ్మా. సేఫ్ కూడా కాదు కాబట్టి ఎక్కడా ఉండలేరు అని అంటాడు. తిరిగి తిరిగి ఇందిరకు కళ్లు తిరుగుతాయి. ప్రేరణ, ఐశ్వర్య ఓ చోట కూర్చొపెడతారు. ఇందిర దాహంగా ఉందని అంటుంది. ప్రేరణ చుట్టూ చూస్తుంది. ఏం చేయాలో అర్థం కాక కొబ్బరి నీళ్లు బుక్ ఆర్డర్ పెడుతుంది. ఆ కొబ్బరి నీళ్లని సిద్ధార్థ్ తీసుకొస్తాడు. ప్రేరణ సిద్ధార్థ్‌ని చూసి తనని ఫాలో అవుతున్నాడని అనుకొని సిద్ధార్థ్ దగ్గరకు వెళ్లి ఏంటి నీకు ఏమైంది నా పరిస్థితి బాలేదు ఇలా ఫాలో అవ్వడం బాలేదు అని చెప్తుంది. దాంతో సిద్ధార్థ్ నేనేం నీ కోసం రాలేదు ఎవరో కొబ్బరి నీళ్లు ఆర్డర్ చేశారని వచ్చానని అంటాడు. తానే ఆర్డర్ చేసిందని తెలుసుకొని సిద్ధూ ప్రేరణకి కొబ్బరి బొండాలు ఇస్తాడు.
ఐశ్వర్య అక్కతో నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నావేమో అని అంటుంది. అలా ఏం కాదని నన్ను ఫాలో అవ్వకపోతే బైక్ బుక్ చేసినా అతనే ఆర్డర్ చేసినా అతనే ఎలా వస్తాడు అని అంటుంది. ఇంతలో ఒక బ్రోకర్ వస్తాడు. అతను ప్రేరణ వాళ్లతో అందరూ ఇస్తామని అంటారు. కానీ ఎవరో మా మీడియేటర్ల గ్రూఫ్‌లో మీ ఫొటోలు పెట్టి ఇళ్లు ఇవ్వొద్దని చెప్తున్నారు అని అంటాడు. అతను కమీషన్ 4 వేలు అడుగుతాడు. సరే అని ప్రేరణ అంటుంది. దాంతో అతను మనసులో ఆ రంజిత్ గాడి ఇంట్లో ఎవరూ దిగడం లేదు కాబట్టి వీళ్లని అందులో పట్టేసి నేను తప్పించుకోవాలని అనుకుంటాడు. ప్రేరణ వాళ్లని తీసుకెళ్లి ఇంటి దగ్గరకు తీసుకొస్తాడు. ఇళ్లు చూస్తామని ప్రేరణ వాళ్ల అంటే ఇళ్లు బాగుంది నా కమీషన్ ఇవ్వండి అని ఓనర్ ఉండడు ఇంటి బాధ్యత నాది అని చెప్పి హడావుడి చేస్తాడు. ప్రేరణ వాళ్లతో అగ్రిమెంట్ మీద సంతకం చేయించి బయట నుంచే కమీషన్ తీసుకొని పారిపోవాలని అనుకుంటాడు. ఆ రంజిత్ వస్తే కండీషన్ తెలిస్తే నన్ను వీడు బతకనివ్వడు అని అనుకుంటాడు. వెళ్లిపోతూ ఇంటి ఓనర్‌తో జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతాడు.
ఇంటి ఓనర్ రాక్షసుడా అని అనుకొని ఐశ్వర్య కంగారు పడుతుంది. ఇక రంజిత్ ఓ కాఫీ షాప్‌లో ఎంట్రీ ఇస్తాడు. కాఫీ కప్పుకి 500 వందలు ఇస్తాడు. తర్వాత బయటకు వెళ్లి కారు ఉండగానే ఆటో బుక్ చేసుకుంటాడు. డ్రైవర్ విషయం చెప్పడంతో నిన్ను టెస్ట్ చేశా అంటాడు. చూస్తే రంజిత్ పెద్ద మతి మరుపు వ్యక్తిలా ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.