Nindu Manasulu Serial Today Episode గణని విజయానంద్ ఇంటికి భోజనానికి పిలిచి దారుణంగా అవమానిస్తాడు. సార్ నేను చాలా ట్రై చేశానని గణ చెప్తుంటే విజయానంద్ కోపంగా నోర్ముయ్ ఇద్దరు పిల్ల బచ్చాలను ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లకుండా ఆపలేకపోయావ్.. నీది ఒక బతుకేనా.. పేరుకేమో గణ.. ఏదో పొడిచేస్తా అని పెద్ద బిల్డప్.. నీ జాబ్ పోతే ఏదో పోనిలే అని ఆ ట్రాఫిక్‌లో ఇస్తే చేతకానివాడిలా క్షమించమని అడుగుతున్నావ్.. భోజనం చేస్తావా అంటే సిగ్గు లేకుండా నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొన్నావ్.. తూ అని తిడతాడు.
విజయానంద్ మాటలకు గణ తల దించుకొని కూర్చొంటాడు. విశ్వాసంతో విజయానంద్ ఇలాంటి వాడికి పోయిన ఎస్ఐ పోస్ట్ ఎలా వస్తుందని అంటాడు. కష్టం సార్ అని విశ్వాసం అంటాడు. విజయానంద్ గణతో నువ్వు మనిషివి అయితే నీకు సీము నెత్తురు.. మానం మర్యాద ఏమైనా ఉంటే వాళ్లిద్దరి అంతు చూసి అప్పుడు నా ముందుకి రా అని అంటాడు. విశ్వాసం విజయానంద్‌తో మినిస్టర్ బ్యాగ్ తీసుకెళ్లాలని అని అంటాడు. దానికి విజయానంద్ ఆ బ్యాగ్ తీసుకెళ్లాల్సిన వాడు మనవాడు అయ్యిండాలి.. వెర్రి వెంగలప్ప అయ్యుండాలి.. అని అంటాడు. గణని చూసి అనడంతో నేను తీసుకెళ్తాను సార్ అని గణ అంటాడు. దాంతో విశ్వాసం ఇక్కడే వెర్నివెంగలప్ప ఉన్నాడు సార్ అని అంటాడు. నువ్వు తీసుకెళ్తావా అని విజయానంద్ అంటే గణ తీసుకెళ్తానని అంటాడు. అది టైంకి మినిస్టర్‌కి వెళ్లాలి అని అంటాడు. ఒక్క అవకాశం ఇవ్వండి అని గణ అంటాడు. దాంతో విజయానంద్ సరే అంటాడు. బ్యాగ్ గణకి ఇచ్చి ఈ సారి ఏ తప్పు జరగకూడదు అని అంటాడు. విజయానంద్ విశ్వాసంతో ముందు ఉంది ముసళ్ల పండగ అని అంటాడు.
ప్రేరణ, సిద్ధూ విశ్వనాథం గారి ఇంటి దగ్గర నుంచి బయల్దేరుతారు. ఇద్దరూ పుస్తకాలు సర్దు కుంటారు. ఒక బుక్ అధికం ఉండటంతో నాకుకావాలి అంటే నాకు కావాలి అని పోట్లాడుకుంటారు. దాంతో సిద్ధూ బుక్ లాక్కుంటాడు. ఇంతలో అక్కడికి ప్రేరణ, సిద్ధూల డ్రాయింగ్ వేసిన అకుశం.. పరాంకుశం వస్తాడు. మళ్లీ పెయింటింగ్ కొనమని అడుగుతాడు. మీ ఇద్దరూ లవర్స్ అని నాకు తెలుసు అందుకే మళ్లీ మీ ఇద్దరూ గొడవ పడటం చూసి మళ్లీ డ్రాయింగ్ వేశానని చెప్పి మరో డ్రాయింగ్ చూపించి రెండింటికీ 2 వేలు అడుగుతాడు. ఇద్దరూ పరాంకుశాన్ని కొట్టబోయి మళ్లీ ఇద్దరి చేతులు కలుపుతారు. తర్వాత పరాంకుశాన్ని కొట్టి పంపేస్తారు.
గణ విజయానంద్ చేసిన అవమానం గుర్తు చేసుకొని ప్రతీ వెదవకి లోకువ అయిపోతున్నా మళ్లీ యూనిఫాం రాని అప్పుడు చెప్తా అని ఆవేశంగా కారు డ్రైవింగ్ చేస్తూ చూసుకోకుండా ఓ బైక్ అతన్ని గుద్దేస్తాడు. అందరూ గణని నడిరోడ్డు మీద నిలదీస్తారు. సాక్ష్యాలు ఉంటే చూపించడం లేదంటే పొండి అని గణ ఫైర్ అయితే ప్రేరణ వచ్చి నేను చూశానని అంటుంది. నేనే యాక్సిడెంట్ చేశాను అనడానికి సాక్ష్యం ఉండాలి కదా అని గణ అంటే ఇలా చెప్తా అని సిద్ధూ ఫోన్ పట్టుకొని వస్తాడు. ఈ వీడియో సాక్ష్యం సరిపోతుందా అని అడుగుతాడు. కావాలి అంటే చూడు అని అంటాడు. రేయ్ తప్పు చేస్తున్నావ్ అని గణ సిద్ధూని అంటాడు. దాంతో సిద్ధూ తప్పు చేసింది నువ్వు సారీ చెప్పి డబ్బులు ఇచ్చి వెళ్లిపో అంటాడు. అందరూ డబ్బులు ఇవ్వాలి అని గోల చేస్తారు. సిద్ధూమొత్తం వీడియో తీస్తాడు. దాంతో ఏం చేయలేక గణ డబ్బులు ఇస్తాడు. గణ వెళ్లిపోతుంటే ప్రేరణ ఆపి సారీ చెప్పలేదు ఇంకా అని అంటుంది. దాంతో అందరూ సారీ చెప్పాలి అని గోల చేస్తారు. గణ సారి అని చెప్పి వెళ్లిపోతాడు.
మినిస్టర్ దగ్గరకు గణ బ్యాగ్ తీసుకొని వెళ్తాడు. మినిస్టర్ గణతో ఎందుకు లేటు అయింది అని అడుగుతాడు. తిన్నావా.. టీ తాగావా ఇలా అడుగుతాడు. ట్రాఫిక్ అని గణ అంటే నిజం చెప్పడం నీకు అలవాటు లేదా తిడతాడు. నేనేం అబద్ధం చెప్పడం లేదు అని గణ అంటే చెప్పావుకదా ఆ రోజు విజయానంద్‌కి నేను వెర్రోడిలా నమ్మేసి స్టేజ్ మీద చెప్పి పరువు మొత్తం పోగొట్టుకున్నా అని మినిస్టర్ అంటాడు. దానికి గణ ఆ ఒక్క పొరపాటుకి నేను కావాల్సినంత అనుభవిస్తున్నాను సార్ అని అంటాడు. మినిస్టర్ కోపంగా ఒక్క పొరపాటు కాదునీకు పొరపాట్లు చేయడం అలవాటు అందుకే ఇప్పుడు కూడా చేసిన తప్పు దాచేసి అబద్ధం చెప్తున్నావ్ అంటాడు. కారులో వస్తుంటే ఒకడు ఢీ కొట్టాడు.. చిన్న గొడవ అంటే చిన్ని గొడవ కాదు అని మొత్తం వైరల్ అయింది అని చూపిస్తాడు. నీ కారులో ఎంత విలువైన బ్యాగ్ ఉందని తెలీదా.. ఒకవేళ ఈ బ్యాగ్ దొరుకుంటే ఏమయ్యేది.. సిగ్గు ఉండాలయ్యా.. అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్.. నన్ను ఇరికించేయాలని అనుకుంటున్నావా ఇలాగే పోతే నీ ఒంటి మీద ఆ ట్రాఫిక్ యూనిఫాం కూడా ఉండదు అని గణని తిడతాడు. రాత్రి ప్రేరణ చదువుకుంటూ ఉంటే ఐశ్వర్య వచ్చి అక్క వాడి పని అవుట్ అక్క సోషల్ మీడియాలో తిడుతున్నారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.