Nindu Manasulu Serial Today Episode విజయానంద్ ఒక్కడే చెస్ ఆడుతూ నాకు సాటి పోటీ ఎవరూ రారురా.. పోనీ నువ్వు వస్తావా పోటీకి.. రారా వచ్చి కూర్చొరా.. ఆడు వచ్చి నా మీద గెలవరా అని పీఏ విశ్వాసాన్ని పిలుస్తాడు. ఇద్దరూ గేమ్ ఆడుతుంటారు. 

ఓ వైపు సిద్ధూ మరో వైపు ప్రేరణ విశ్వనాథం గారి దగ్గరకు బయల్దేరుతారు. సిద్ధూ, కుమార్ వస్తుంటే గణ చూసి సిద్ధూని ఆపమని చెప్తాడు. సిద్ధూ హెల్మెట్ పెట్టుకోవడం చూసిన గణ బండి మీద వచ్చాడని అనుకొని ఎలా వచ్చాడో చూడకుండా వాళ్ల బండిని పక్కకి ఆపమని చెప్పు అని కానిస్టేబుల్‌కి చెప్తాడు. తర్వాత గణ సిద్ధూని సైకిల్ మీద చూసి బిత్తర పోతాడు. గణకి సిద్ధూ షాక్ ఇచ్చినట్లు విశ్వాసం కూడా చెక్ పెట్టి విజయానంద్‌కి షాక్ ఇస్తాడు. సిద్ధూ హెల్మెట్ తీసి రేయ్ కూమార్ ఇది వెయికిల్ అంటరా అని వెటకారం చేస్తాడు. దానికి కూమార్ వెటకారంగా టూ వీలర్ అనుకున్నారేమో అనుకుంటారు. కానిస్టేబుల్ గారు ఏం చెక్ చేస్తారు. సైకిల్‌కి డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారేంటి అని అంటాడు. దానికి కుమార్ ఇంకా నయం పొల్యూషన్, ఆర్సీ అడుగుతారేమో అని సెటైర్లు వేస్తాడు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి బొల్తా కొట్టిందే బుల్ బుల్ పిట్టా అని పాటలు పాడుతూ నవ్వి గణని రెచ్చగొడతారు.

ఫ్లాష్ బ్యాక్‌లో సిద్ధూ, కుమార్‌లు పీఏ విశ్వాసాన్ని పట్టుకొని డబ్బు మనిషి విజయానంద్ తనని ఆపడానికి ఏం ప్లాన్ చేశాడో చెప్పమని అడుగుతాడు. విశ్వాసాన్ని బెదిరించి విజయానంద్‌ గణతో చెప్పి మిమల్ని అడ్డుకోవాలని అనుకున్నాడని విశ్వాసం చెప్పేస్తాడు. ఇక సిద్ధూ మనల్ని ఆపేది ఎవడ్రా అని అంటాడు. గణతో ఇప్పుడు విశ్వనాథం గారి దగ్గరకు వెళ్తున్నా.. రేపు నేను అనుకున్నది సాధించబోతున్నా అని నిన్ను పురమాయించి వాళ్లకి వెళ్లి చెప్పు అని వెళ్లిపోతారు. గణ చూస్తూ ఉండిపోతాడు కానీ ఏం చేయలేకపోతాడు. 

ప్రేరణ ఆటోలో వస్తుంటుంది. గణ చూసి కూడా ఆటోని ఆపడు. ప్రేరణ చూసి ఇదేంటి ఆటోలో నేను ఉన్నాని అని తెలిసి కూడా ఆపలేదు ఏంటి అని అనుకుంటుంది. గణ మాత్రం ప్రేరణని చూసి వెటకారంగా నవ్వుతాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ప్రేరణ వాళ్ల ఆటో వేరే రూట్‌కి వెళ్తుంది. సిద్ధూ వాళ్లు చూసి విశ్వనాథం గారి ఇళ్లు ఇటు ఉంటే తను అటు వెళ్తుంది ఏంట్రా అనుకుంటారు. అయినా మనకు ఎందుకులే పదం పోదాం అని కుమార్ అంటాడు. ఇద్దరూ వెళ్లిపోతారు. ఇక ప్రేరణ ఆటో డ్రైవర్‌తో అన్న ఇటు వెళ్తున్నామేంటి అని కంగారుగా అడిగితే షార్ట్ కట్ అని ఆయన అంటాడు. ప్రేరణకు డౌట్ వస్తుంది. ఇంతలో ఇద్దరు రౌడీలు ఆటో ఎక్కి ప్రేరణని పట్టుకుంటారు. ప్రేరణ వదలమని బతిమాలుతుంది. ఇంతలో ఆటోకి అడ్డంగా సైకిల్ పెట్టి దాని మీద కూర్చొని కూల్‌గా ఐస్ క్రీమ్ తింటూ హీరో ఎలివేషన్‌తో కుమార్ ఎంట్రీ ఇస్తాడు. సైకిల్ అడ్డంగా తీయరా ఏమైనా హీరో అనుకుంటున్నావా అని రౌడీ అడిగితే మనకు అంత సీన్ లేదన్నా కానీ ఒక్కడున్నాడు అన్న వాడు కొడితే అయిపోతావన్నా అని అంటాడు. 

సిద్ధూ వచ్చి రౌడీలను చితక్కొడతాడు. కుమార్ రౌడీలతో కళ్లు తిరుగుతున్నాయా.. ఇంకా దెబ్బలు తింటారా ఓపిక ఉందా అని సెటైర్లు వేసి  ఐస్‌ క్రీమ్ చేతిలో పెట్టి పంపేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో విశ్వాసం సిద్ధూ వాళ్లతో ప్రేరణని కూడా విశ్వనాథం గారి దగ్గరకు టైంకి వెళ్లకుండా ప్లాన్ చేశారని చెప్తాడు. అది తెలియన ప్రేరణ చప్పట్లు కొట్టి కుమార్‌ని లాగి పెట్టి కొడుతుంది. మా వాడు టైంకి వచ్చి మిమల్ని కాపాడితే కొడుతున్నారేంటి అని అడుగుతాడు. దాంతో ప్రేరణ మీరే రౌడీలను పెట్టి నన్ను విశ్వనాథం గారి దగ్గరకు వెళ్ల కుండా ఆపాలని ఇలా ప్లాన్ చేశారని అంటుంది. అంత అవసరం లేదని సిద్ధూ అంటాడు. ప్రేరణ మాత్రం సిద్ధూని తప్పుగా అర్థం చేసుకొని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.