Nindu Manasulu Serial Today Episode మినిస్టర్ జయరాం విజయానంద్‌ని కోప్పడతాడు. నిన్ను నమ్మి వచ్చినందుకు నా పరువు అంతా పోయింది. ఇక నీతో కాంట్రాక్ట్ కాదు కదా నిన్ను నా ఆఫీస్‌లో కూడా అడుగుపెట్టనివ్వను అని తిట్టేసి వెళ్లిపోతాడు. విజయానంద్ ఎంత బతిమాలినా వినడు.
నీ నిజం విలువ 50 కోట్లు..
గణ వల్లే ఇదంతా అని విజయానంద్ గణని కోపంగా చూసి ఇదంతా నీ వల్లే కదా.. నువ్వ చేసిన పనికి ఆ మినిస్టర్ నన్ను వెధవలా చూశాడు. యూనిఫాం వేసుకున్నావ్ కాబట్టి ఏమీ అనలేకపోతున్నా లేదంటే నీ అంతు చూసేవాణ్ని అని కోప్పడతాడు. నేను నిజమే చెప్పాను సార్ అని గణ అంటే నీ నిజం విలువ 50 కోట్లు.. అని తిడతాడు. లోపల మీడియా ఉందని పీఏ చెప్పడంతో విజయానంద్ అరుస్తూ వెళ్లిపోతాడు.
ఆ పోలీసోడే ఇదంతా చేశాడు..
మీడియా మొత్తం ప్రేరణని చుట్టు ముడుతుంది. విజయానంద్ తన పీఏతో మీడియాని పంపేయమని చెప్తాడు. ప్రేరణని పక్కకి తీసుకెళ్లి ఇదంతా పొరపాటు అమ్మా నాకు మినిస్టర్ గారికి ఇది తెలీదు జరిగిన దానికి చాలా ఫీలవుతున్నామని అంటుంది. ప్రేరణ ఆయనతో అవమానం జరిగిన తర్వాత ఇలా మాట్లాడితే ఏంటి సార్.. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం ఏంటి సార్ అని అడుగుతుంది. ఓ ఇడియట్ చెప్పడం వల్ల మేం తొందరపడ్డామమ్మా సారీ అని అక్కడే ఉన్న గణని చూపించి అదిగో ఆ పోలీసోడే దీనంతటికి కారణం అని చెప్పాడు. నీకు ఇప్పుడు విషయం అర్థమైంది కదమ్మా ఇక ఈ మేటర్ వదిలేయ్ అని అంటాడు. తర్వాత పీఏ విశ్వాసం దగ్గరకు వెళ్లి ఛా అయింది ఒకటి అనుకున్నది ఒకటి.. మీడియా మొత్తాన్ని మ్యానేజ్ చేశావా అని అడుగుతుంది. చేశానని వార్త బయటకు వెళ్లదు అని విశ్వాసం చెప్తాడు. వాడెవడివల్లో మినిస్టర్కి నేను సారీ చెప్పాల్సి వచ్చింది అని రగిలిపోతాడు.
సెల్యూట్ కొట్టడానికి రెడీగా ఉండు..
ప్రేరణ గణ దగ్గరకు వెళ్లి చూశావా ఆకాశం మీద ఉమ్ము వేయాలి అని చూస్తే ఎవరి ముఖం మీద పడిందో.. పది మందిలో నన్ను అవమానించాలి అనుకున్నావ్ నువ్వే అవమానపడ్డావ్ అని అంటుంది. ఏంటే అప్పుడే కలెక్టర్ అయినట్లు ఫీలయిపోతున్నావ్ అని అంటాడు. దానికి ప్రేరణ ఇంకొన్నాళ్లలో నేను కలెక్టర్ అవుతాను. ఇందాక సెల్యూట్ చేసి నన్ను వెక్కిరించావు కదా ఇంకొన్నాళ్లలో నేను కలెక్టర్ అవుతా అప్పుడు నాకు సెల్యూట్ కొట్టడానికి రెడీగా ఉండు అని అంటుంది.
త్వరగా వచ్చేయ్‌రా ఉప్మా చేశా..
సిద్ధూ పార్క్‌లో డల్‌గా కూర్చొని ఉంటాడు. సిద్ధూ ఫ్రెండ్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తాడు. మన లాంటి వాళ్లకి అదృష్టం లేదురా అని అంటాడు. ఇక్కడ కోచింగ్ కష్టమేరా నేను ఎక్కడుంటే నా దరిద్రం పక్కనే ఉంటుంది కదా ఆ పచ్చనోటు షూటు బూటు వేసుకొని వచ్చాడు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్రీ కోచింగ్ ఇచ్చేది అతనేరా అని చెప్తాడు. దాంతో అతని ఫ్రెండ్ శుభం ఉప్మా చేసి ఉంచుతా త్వరగా వచ్చేయ్ అంటాడు. ప్రేరణ కూడా ఆలోచిస్తూ వచ్చి సిద్ధూ పక్కనే కూర్చొంటుంది. ఇద్దరూ కోచింగ్ గురించి ఆలోచిస్తూఉంటారు. మెయిన్స్ కోచింగ్ ఎలాగా అనుకుంటారు.
మేం లవర్స్ అని నీతో చెప్పామా..
ప్రేరణ సిద్ధూని చూసిన ఓ ఆర్టిస్ట్ ఇద్దరూ లవర్స్ అనుకొని వాళ్ల బొమ్మగీసి వాళ్లతోనే కొనిపిస్తా అనుకొని ఇద్దరి దగ్గరకూ తీసుకెళ్తాడు. ప్రేరణ సిద్దూ ఒకర్ని ఒకరు చూసుకొని నువ్వా అంటే నువ్వా అనుకుంటారు. నా పక్కన ఎందుకు కూర్చొన్నావ్ అని ప్రేరణ అంటే ఇన్‌స్టిట్యూట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడేంటి అని అంటాడు. ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటారు. ఇంతలో ఆర్టిస్ట్ వచ్చి మీ ఇద్దరి అలకలు ఎలా తీశానో చుశారా అంటాడు. మా ఇద్దరి బొమ్మ ఎందుకు గీశావని ప్రేరణ అడిగితే నాకు తెలుసు మేడం మీ ఇద్దరూ లవర్స్ అని అంటాడు. ఆర్టిస్ట్ ఐస్క్రీమ్, ఐమాక్స్ అంటూ లవర్స్ ముచ్చట్లు చెప్పి వేయి రూపాయలు అడుగుతాడు. దాంతో ఇద్దరూ అతన్ని లాగిపెట్టి కొట్టడానికి ఒకే సారి చేయి ఎత్తుతారు. ఒకరి చేయి ఒకరికి తాకి దండం పెట్టినట్లు అవుతుంది. ఇక ఆర్టిస్ట్ ఈ బొమ్మ మీతో కొనేలా చేయకుండా వదలను అనుకుంటాడు.
సవతి ఇంటికి ఇందిర..
గణ తల్లి ఈశ్వరిని ఫాలో అయితే తన భర్త ఆచూకి తెలుస్తుందని ఇందిర కారు వెనకాలే వస్తుంది. ఇందిర ఇంటి లోపలికి వెళ్లడం చూసి సుధాకర్ వచ్చి ఆపుతాడు. నువ్వు నన్ను వెళ్లిపోఅని చెప్పినప్పుడే అనుమానం వచ్చింది అక్క అందుకే నిన్ను ఫాలో అయ్యానని చెప్తాడు. ఇంటికి వెళ్లిపోదామని బతిమాలుతాడు. ఒక్కసారి మీ బావని చూసేసి వస్తారా అని ఇందిర బతిమాలుతుంది. మా సార్ చూస్తే మన ఇద్దర్ని చంపేస్తాడే అని సుధా అక్కని ఇంటికెళ్లిపోదామని బతిమాలుతూ ఉంటాడు. ఇక ఈశ్వరి ఇంటి లోపలికి వెళ్లేసరికి పని మనిషి రాజశేఖరానికి స్పూన్‌తో జ్యూస్ తాగిస్తూ తిట్టుకుంటుంది. అది చూసిన ఈశ్వరి ఈ పనిమనిషిని మార్చేయాలి అనుకుంటూ బయటకు వచ్చి సుధాకర్ వాళ్లని చూసి సుధాకర్ అని పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.