Nindu Manasulu Serial Today Episode సాహితీ సిద్ధూకి రాఖీ కట్టడంతో గిఫ్ట్ ఇవ్వలేవని విజయానంద్ అవమానిస్తాడు. సిద్ధూ తన దగ్గరున్న ఉంగరం చెల్లికి తొడిగి విజయానంద్, తల్లిలను షాక్‌కి గురి చేస్తాడు. సాహితీ ఎమోషనల్ అయిపోతూ నేను అడిగానా అన్నయ్యా అని అంటుంది. నువ్వు అడగపోయినా ఇవ్వడం నా బాధ్యత.. సాహితీ అందరిలా నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఇచ్చాను అంటాడు.

విజయానంద్ సిద్ధూతో ఇలా ఇంటి బయట రాఖీ కట్టి ఉన్న ఆ కాస్త బంగారం వదులుకోవడం కంటే మాతో ఉండి ఉంటే ఈ పరిస్థితి రాదు కదా అంటాడు. నేను ఒంటి మీద ఉన్న బంగారం కంటే ఆప్యాయతకే ఎక్కువ విలువ ఇస్తాను.. స్టేటస్ కంటే వ్యక్తిత్వాన్నే నమ్ముతాను అని అంటాడు సిద్ధూ. నీ క్యారెక్టర్ విశ్వనాథం గారి దగ్గర సీటు సంపాదించేలా చేసిందా అంటాడు. అది నీకు అనవసరం అని సిద్ధూ అంటాడు. తండ్రిగా అతనికి బాధ్యత ఉందని మంజుల అంటుంది. ఇక సాహితీ తండ్రితో ఎందుకు నాన్న అన్నయ్యకి ఇష్టం లేకపోయినా రికమండేషన్ చేస్తున్నావ్ వదిలేయొచ్చు కదా అంటుంది. చెల్లి చెప్పింది కదా ఇప్పటికైనా అర్థమైందా అమ్మా అని సిద్ధూ అంటే మంజుల భర్తకే సపోర్ట్ చేస్తుంది. నువ్వు అన్న పరపతి పేరు ప్రతిష్టలు ఎవరి సాయం లేకుండా సంపాదిస్తానని సిద్ధూ అంటాడు. నువ్వు అనుకున్నది సాధించకపోతే ఏ స్టేటస్ వద్దు అనుకున్నావో అక్కడికి వస్తావా.. ఎవరిని వద్దు అనుకున్నావో వాళ్లని నాన్న అని పిలుస్తావా అని అంటుంది. ఆ పరిస్థితి వస్తే ప్రాణాలు వదిలేస్తా కానీ వెనక్కి తిరిగి చూడను అని సిద్ధూ కోపంగా చెప్పి వెళ్లిపోతాడు. 

పీఏ విశ్వాసం ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ సెలక్ట్ అయ్యారని విజయానంద్‌తో చెప్పడంతో గణని పిలవమని విజయానంద్ చెప్తాడు. సిద్ధూ ఎలా సెలక్ట్ అవుతాడో నేను చూస్తా అంటాడు. కుమార్ సిద్ధూ రావడంతో ఎందుకు సాహితి పిలిచిందిరా అంటే రాఖీ కట్టడానికి అని చెప్తాడు. సిద్ధూ తన దగ్గర ఉన్న చైన్ చూసి ఎమోషనల్ అయిపోతాడు. కుమార్ చూసి ఏమైందిరా ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు తీశావ్‌రా అని అడుగుతాడు. దాంతో సిద్ధూ ఎలా అయినా విశ్వనాథం గారి దగ్గర సీటు సంపాదించాలిరా.. ఈ చైన్ ప్రేరణకి ఇచ్చి తనని వేరే దగ్గర కోచింగ్ తీసుకోమని చెప్తానురా. నాకు రికమండేషన్ వద్దు కాబట్టి నేను విశ్వనాథం గారి దగ్గర కోచింగ్ తీసుకుంటా అంటాడు. 

కుమార్ ప్రేరణకు కాల్ చేసి సిద్ధూ కలవాలి అని అంటాడు. ఎవరికీ ఇబ్బంది లేకుండా మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దామని చెప్పి అడ్రస్ చెప్పి రమ్మని అంటాడు. ఐశ్వర్య ఒకసారి వెళ్దామని అంటుంది. ప్రేరణని ఒప్పిస్తుంది. మరోవైపు భర్తకి సేవలు చేస్తూ ఈశ్వరి తిట్టుకుంటుంది. నా బాధ నా కొడుకు బాధ నీకు అర్థం కావడం లేదు నరకం కనిపిస్తుంది మాకు. ఆ ఊరు పేరు లేని వాళ్ల ఇక్కడికి వస్తున్నారు.. నీ పేరు చెప్పుకొని బొట్లు పెడుతున్నారు. నువ్వు నోరు తెరవవు.. మేం ఏం చెప్పలేం.. నువ్వు గొంతు విప్పి చెప్పే వరకు నీ దగ్గరకు కూడా రాకూడదు అనుకున్నా కానీ తప్పలేదు అని అంటుంది. అప్పుడే ఈశ్వరికి ఇందిర గుర్తొచ్చి సుధాకి ఫోన్ చేసి కనుక్కుందామని అనుకుంటుంది. 

సుధాకర్, ఇందిర నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇంతలో ఈశ్వరి సుధాకి కాల్ చేసి ఇందు గురించి అడిగితే  తను లేదు ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్పేస్తాడు. నేను కాల్ చేస్తా తను నెంబరు ఇచ్చిందని ఈశ్వరి అంటే సుధా కంగారుపడి ఇందిరతో వేరే ఒకరికి ఫోన్ చేయాలి అని ఇందిర ఫోన్ తీసుకుంటాడు. నెంబరు కనెక్ట్ అవ్వకుండా చేసేస్తాడు. ప్రేరణ వాళ్లు సిద్ధూ వాళ్లని కలుస్తారు. కుమార్ ప్రేరణతో విశ్వనాథం గారి దగ్గర సీటు మీరు వదులుకోవాలి  అని చెప్తాడు. ఇక సిద్ధూ ప్రేరణతో మీకు ఫ్రీ సీట్ కావాలి అంటే కదా అంటాడు. దానికి ఐశ్వర్య వేలకు వేలు అవుతుంది అని అంటాడు. సిద్ధూ వాళ్లతో మీరు ఆ సీటు నాకు వదిలేస్తే చాలు నేను మీకు డబ్బులు ఇస్తాను అని చైన్ ఇస్తాడు. ప్రేరణ కోపంతో అదే పని మీరు చేయొచ్చు కదా అంటుంది. ఆ అవకాశం లేదని కుమార్ అంటాడు. మా వాడి లైఫ్‌లో ఒకడున్నాడు.. డబ్బు లేకుండా ఏం చేయలేం.. రికమండేషన్ లేకుండా ఏం చేయలేం అని పొడుచుకు తింటున్నాడని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.