Nindu Manasulu Cast and Crew : బుల్లి తెర ప్రేక్షకులకు వినోదం పంచడంలో స్టార్ మా ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇప్పటికే ఆ ఛానల్‌లో ప్రసారమయ్యే చాలా సీరియల్స్ మనం చూస్తునే ఉన్నాం. అలాంటి సీరియల్స్‌లో మరొకటి ' నిండు మనసులు' కుటుంబ బంధాలు, ఆశయాలు, వాటి చుట్టూ తిరిగే కథనం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా మారుతింది. ఇందులో లీడ్ రోల్ ప్రేరణ పాత్ర పోషిస్తున్న పవిత్ర నాయక్ నటన, అమె ఎదుర్కొనే సవాళ్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అసలు ఈ కథ ఏంటీ ఇందులో నటిస్తున్న వారు ఎవరు మీరు ఈ సీరియల్‌ఎక్కడ చూడొచ్చు అనేది తెలుసుకుందాం.
ప్రేరణ ఆశయం ఒక ఎమోషనల్ జర్నీ
ఈ కథ అంతా ప్రేరణ అనే ధైర్యవంతురాలైన యువతి చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి రాజశేఖర్ కన్న కలలను నిజం చేయడమే ఆమె జీవిత లక్ష్యం. అమె ఒక సివిల్ సర్వెంట్ కావాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అయితే జీవితం ఎప్పుడూ అనుకున్నట్టు సాగదు కదా. ప్రేరణ తన తండ్రి జీవితానికి సంబంధించిన కొన్ని భయంకరమైన నిజాలను తెలుసుకుంటుంది. తండ్రికి ఉన్న ఇతర సంబంధాలు, దాగి ఉన్న కుటుంబ రహస్యాలు ఆమెను మానసికంగా కుంగదీస్తాయి.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ఎలా నిలబడింది. తన ఆశయాన్ని నెరవేర్చుకుందా లేదా కుటుంబ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిందా అనేది ఈ సీరియల్ స్టోరీ.
కథను మలుపు తిప్పే పాత్రలు ఇవే!
ఈ సీరియల్ ఇంతలా క్లిక్ అవ్వడానికి ప్రధాన కాణం అందులోని పాత్రలు, వాటిని రక్తి కట్టించిన నటులు.
ప్రేరణ: కథానాయికగా పవిత్ర (Pavithra B. Naik)అద్భుతంగా నటిస్తోంది. గతంలో నువ్వు నేను ప్రేమ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఇప్పుడు ప్రేరణ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె తన సోషల్ మీడియా ద్వారా షూటింగ్ విశేషాలను కూడా పంచుకుంటూ ప్రేక్షకులతో టచ్‌లో ఉంటోంది.
సిద్ధార్థ్: ప్రేరణకు జంటగా సిద్ధార్థ్ పాత్రలో యశ్వంత్ కనిపిస్తున్నాడు. గతంలో దేవతలారా రండి సీరియల్ ద్వారా పరిచయమైన యశ్వంత్ ఈ సీరియల్‌లో చాలా పరిణతి చెందిన నటనను కనబరుస్తున్నాడు. సిద్ధార్థ్ జీవితంలో కొన్ని విషాదాలు ఉంటాయి. వీరిద్ధరి జీవితాలు ఎలా కలిశాయి అనేది చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు.
రాజశేఖర్: ప్రేరణ తండ్రి పాత్రలో ఇంద్ర నాగ్ నటిస్తున్నారు. ఈయన సీరియల్ నటుడు. కథను మలుపు తిప్పే కీలకమైన ఎమోషనల్‌పాయింట్ ఈయన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
నీపా శివ: గతంలో బ్రహ్మముడి సీరియల్‌లో కనకమ్మగా అలరించిన నీపా శివ, ఇందులో ఒక కీలకమైన తల్లి పాత్రలో కనిపిస్తున్నారు. కుటుంబ బంధాల మధ్య నలిగిపోయే ఈ పాత్రలో ఆమె నటన సీరియల్‌కు నిండుదనాన్ని ఇస్తోంది.
సంగీత కొండవీటి: రాజశేఖర్ మొదటి భార్యగా సంగీత కనిపిస్తున్నారు. ఈమె పాత్ర కథలో ఎంతో గంభీరంగా, కొత్త మలుపులు తెచ్చేలా ఉంటుంది.
పోలీస్ ఆఫీసర్ గుణ: కథలో ఒక కీలకమైన మలుపులో పోలీస్‌ఆఫీసర్ గుణ పాత్ర ప్రవేశిస్తుంది. దీనిని శశాంక్ పోషిస్తున్నారు.
నిండు మనసులు ఎందుకు చూడాలి?
ఈ సీరియల్ కేవలం ఏడుపుగొట్టు సీన్లు మాత్రమే కాకుండా, ఒక యువతి తన కలల సాకారం చేసుకోవడానికి చేసే పోరాటం ఉంది. కుటుంబంలో రహస్యాలు బయటపడినప్పుడు ఒక మనిషి ఎంత ధైర్యంగా ఉండాలో ప్రేరణ పాత్ర ద్వారా చూపించారు. ఎమోషన్స్, సస్పెన్స్, సామాజిక బాధ్యత కలగలిసిన కథ కావడంతో అందరికీ నచ్చుతోంది.
నిండు మనసులు ఎప్పుడు ఎక్కడ చూడాలి?
ఈ సీరియల్ స్టార్ మాలో ప్రతి సోమవారం నుంచి శనివారం సాయంత్ర 6.30 నుంచి 7.30 మధ్య టెలికాస్ట్ అవుతుంది. ఒక వేళ సీరియల్ టీవీలో మిస్ అయితే డిస్నీ+ హాట్‌స్టార్ యాప్‌లో ఎప్పుడైనా చూడొచ్చు. దీని కోసం మీకు సబ్‌స్క్రిప్షన్ అవసరం ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్‌లో కూడా ఈ ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తానికి నిండు మనసులు కేవలం ఒక సీరియల్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ జర్నీ, ప్రేరణ తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తుందా? ఆమె జీవితంలోకి వచ్చిన సిద్ధార్థ ఎలాంటి తోడుగా నిలిచాడు, అనే విషయాలు తెలియాలంటే మీరు ప్రతి రోజూ సీరియల్ చూడాల్సిందే.
