Trinayani july 11th: తిలోత్తమా విశాలాక్షి తలకు ఢీ కొట్టి స్పృహ కోల్పోతుంది. దాంతో ఎద్దులయ్య నీరు చల్లి తనను లేపగా తను అందర్నీ అదోరకంగా చూస్తూ ఉంటుంది. తను వేసుకున్న డ్రెస్సు చూసి ఇలా ఉన్నాను ఏంటి అని హాసినిని అడగటంతో తను మామూలు మనిషి అయిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. జరిగిన విషయం మొత్తం చెప్పటంతో తనకేమీ గుర్తుకులేదు అని అంటుంది తిలోత్తమా. తర్వాత తిలోత్తమాను తీసుకొని వల్లభ అక్కడ నుంచి వెళ్తాడు. ఇక ఇదంతా నయని వల్ల అయిందని నయనకి థాంక్స్ చెబుతారు.
మరోవైపు నయని సుమన దగ్గరికి వెళ్ళగా సుమన వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. అసలు నేను నీకు సొంత చెల్లినేనా.. పరాయి దానిలాగా చూస్తున్నావు.. నాకు కావాల్సింది ఇవ్వటం లేదు అనటంతో.. దాంతో ఎంత కావాలి అని అడుగుతుంది నయని. చంద్రకాంతపు మని కావాలి అడగటంతో నయని ఇవ్వను అని అంటుంది. సుమన కావాలి అని అంటున్న కూడా.. ఇచ్చేది కుదరదని అంటుంది.
అనవసరంగా నాగయ్య జోలికి కూడా వెళ్లొద్దు అని సుమనకు చెబుతుంది. నేనెందుకు నాగయ్య జోలికి వెళ్తాను అని కోపంగా చిరాకు పడి అక్కడ నుంచి వెళ్తుంది. తన చెల్లెలి పరిస్థితి గురించి తలుచుకొని ఏం చేయాలో అర్థం కాక బాధపడుతుంది. వల్లభ తన తల్లికి జరిగిన విషయాలు చెబుతూ ఉంటాడు. పెద్దమ్మను చంపింది నువ్వే అని ఎక్కడ చెబుతావో అని నీ వెనకాలే ఉన్నాను అని అంటాడు.
అప్పుడే హాసిని తిలోత్తమా కోసం చీర తీసుకొని వచ్చి కాసేపు వెటకారం చేసి అక్కడ నుంచి వెళ్లి గుమ్మం బయట నిలబడి వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంది. ఇక విశాలాక్షి ఇన్ని రోజులు మ్యాజిక్ చేస్తుందని అనుకున్నాము.. కానీ తను నిజంగా శివ భక్తురాలు. ఎలాగైనా తనని పట్టుకొని గాయత్రి తలపై ఉన్న అర్థ చంద్రకారపు పుట్టుమచ్చ గురించి అడగాలని.. ఇదివరకు అది ఎవరికైనా ఉందేమో అడగాలని వల్లభతో విశాలాక్షిని తీసుకొని రమ్మని చెబుతుంది.
ఈ మాటలు అన్ని విని ఈ విషయం విశాల్ కు చెప్పాలని అక్కడి నుండి హాసిని వెళ్తుంది. ఇక విశాలాక్షి ధ్యానంలో ఉండగా అక్కడికి వల్లభ, తిలోత్తమా వచ్చి విశాలాక్షి గురించి చూస్తుంటారు. నిజం అడగాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఇక హాసిని వచ్చి తిలోత్తమా విశాలాక్షిని అర్థ చంద్రకారపు మచ్చ గురించి అడగటానికి వచ్చిందనటంతో వెంటనే విశాల్ అక్కడి నుంచి కంగారుపడుతూ వెళ్తాడు.
ఇక విశాలాక్షి కళ్ళు తెరిచిన వెంటనే నా కోసమే చూస్తున్నావా అని విశాలాక్షి తిలోత్తమా తో అనటంతో అక్కడే ఉన్న వల్లభ వెటకారం చేస్తూ మాట్లాడుతాడు. అందరూ వచ్చేసి అక్కడ నిలబడతారు. ఇక అక్కడ కాసేపు వెటకారం చేస్తూ ఉంటారు. ఇక తిలోత్తమా తనలో ఉన్న అనుమానాన్ని అడుగుతుంది. నయని దత్తత తీసుకున్న పాప తల మీద అర్ద చంద్రకారపు మచ్చ గురించి చెప్పమని అంటుంది.
అప్పుడే విశాల్, హాసిని కంగారుగా పరిగెత్తుకొని వస్తారు. ఇంట్లో వాళ్ళు ఏం జరిగింది అనడంతో.. విశాలాక్షి శ్రీశైలం వెళ్తా అన్నది కదా అందుకే డ్రాప్ చేద్దామని తొందరగా వచ్చాను అని అంటాడు విశాల్. ఇక హాసిని కూడా బాగా తొందర పెడుతూ తీసుకెళ్లాలి అని చూస్తుంది. కానీ విశాలాక్షి తిలోత్తమా ఒక ప్రశ్న అడిగింది అని దానికి సమాధానం చెబుతాను అని అంటుంది.
ఇంట్లో ఉన్న అర్థ చంద్రకారపు మణిని తీసుకువచ్చి ఆ మణి ని వెన్నెల్లో పెట్టినప్పుడు ఆ మణి కరిగి నీరు గా మారుతుంది ఆ నీటిలో ఇంతకు ముందుకు ఆ మచ్చ ఎవరికి ఉందో కనిపిస్తుంది అనడంతో అందరూ షాకుల మీద షాకులు తింటారు. అంతే కాకుండా దానికి పరిహారం, శిక్ష కూడా చెప్పగా అందరూ షాక్ అవుతారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial